మాధవ వరం అనే ఒక ఊరిలో సోము -భాగ్య దంపతులకి వరుణ్ ఒక్కగానొక్క బిడ్డ . ఆ ఊరికి ఉత్తరాన ఒక పెద్ద పర్వతం వుంది. ఆ పర్వతంపైకి సాయంత్రం ఆరుదాటితే ఎవరూ వెళ్ళరు . ఎవరైనా వెళ్ళితే తిరిగిరాని ఇంకా ఏవేవో కథలు ప్రచారంలో వున్నాయి .
ఇక వరుణ్ ఎంత బాగా చదువుతాడో అలానే చాలా అల్లరి వాడు కూడా . వరుణ్ కి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం . వాళ్ళ అమ్మ కోసం ఏమైనా చేస్తాడు . అది వర్షా కాలం వరుణ్ వాళ్ళ అమ్మ స్కూల్ వరుణ్ నుంచి రాగానే బయటకి వెళ్ళొదు వర్షం పడేలా వుంది తడిస్తే నీకు బాగా జలుబు చేస్తుంది . దాని వల్ల ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడతావ్ అని చెప్పింది.
కానీ వరుణ్ వాళ్ళ అమ్మ మాట పెడచెవిన పెట్టి ఆడుకోవటానికి బయటకి వెళ్లి దగ్గుతూ ఇంటికి వచ్చిన కొడుకుని చూసి అమ్మ కోపంతో బాగా కొట్టేసింది. వరుణ్ ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోయాడు . అమ్మ తన పిల్లల్ని కొట్టేది వాళ్ళ మంచి కోసమే. భాగ్య తరువాత వరుణ్ తల తుడిచి పాలు ఇచ్చింది. వరుణ్ కి జలుబు చేసి బాగా దగ్గుతూ ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడతాడు అని అమ్మ మనసుకి తెలుసు. రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని మందు వరుణ్ ఛాతీ భాగంపై రాస్తూ మధ్యలో ఆయుర్వేద కాషాయం తాగిస్తూ వుంది .
వరుణ్ తన పడుతున్న బాధ పగ వాడు కూడా పడకూడదు అనుకోని (దగ్గు , ఊపిరి అందక తను పడే బాధను గుర్తుతెచ్చుకుంటూ ) అలానే తన అమ్మ సేవ చూస్తూ అనుకున్నాడు. వరుణ్ కి ఉదయానికి తగ్గింది. లేచి వాళ్ళ అమ్మకి సారీ చెప్పాడు. స్కూల్ వెళ్లే టప్పుడు వాళ్ళ నాన్న మాటల ద్వారా రేపు వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని తెలుసుకున్నాడు.
స్కూల్ నుంచి రాగానే అమ్మతో టీవీ చూస్తున్నపుడు వాళ్ళ అమ్మకి సప్త వర్ణ గులాబీ అంటే ఇష్టమని తెలుసుకుంటాడు . కానీ అది చాలా అరుదైన పువ్వు. వరుణ్ ఎలా అయినా వాళ్ళ అమ్మకి సప్త వర్ణ గులాబీ పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని అనుకుంటాడు . అదే ఆలోచనతో స్కూల్ కి వెళ్లిన తనకి యాధృచ్చికంగా వరుణ్ సైన్స్ మాస్టర్ ఆ గులాబీ గురించి చెప్తాడు అది ఊరికి ఉత్తరాన వున్న కొండపైన వున్నది అని సమాచారం ఇస్తాడు . అలానే అక్కడికి వెళ్ళినవాళ్ళు ఎవరు తిరిగిరాలేదు అని కూడా సైన్స్ మాస్టర్ చెప్తాడు. (ముఖ్యంగా ఆ సాయంత్రం ఆరు సంగతి )
కానీ వరుణ్ ఎలా అయినా వాళ్ళ అమ్మకి ఈ రోజు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నిశ్చయంచి కొని ఇంటర్వెల్ నుండి ఒంట్లో బాలేదు అని అబద్దం చెప్పి ఆ పర్వతం పైన వున్న సప్త వర్ణ గులాబీ తేవాలని బయలు దేరాడు. వరుణ్ కొంచెం సంకోచించిన ఆ ఆరు సంగతి గుర్తొచ్చి కానీ తాను అప్ప టికల్లా తిరిగొస్తాను అనే నమ్మక్కంతో బయలు దేరాడు . అందం, అపాయం రెండు పక్కపక్కనే ఉంటాయి. వరుణ్ కొండెక్కు క్రమంలో ప్రకృతి సోయగాన్ని చూస్తూ తననుతానే మర్చిపోయాడు . తనకి అలసటే తెలియలేదు కొండ పైకి ఎక్కేసాడు రంగు రంగుల తూనీగలను , సీతాకోకచిలకలను , కమ్మని కోయిలమ్మ పాటను మధ్యలో నెమలమ్మల నాట్యాన్ని చూస్తూ . సీతాకోకచిలుకలైతే పింక్ చీర కట్టుకొని ఉన్నటు వున్నాయి అంతేకాదు ఆ చీరపైనా నల్లని గుండ్రాటి చిన్న చుక్కలు . ఈ పింక్ రంగు సీతాకోకచిలకల సమూహంగా ఒక అలలా ఎగురుతూ వరుణ్ ని సప్త వర్ణ గులాబీ వుండే తోట కి తీసుకు వెళ్లాయి . అప్పటికి సమయం 6 అయ్యింది . ఆ తోట ని కావలి కాచే పిల్ల దయ్యం ఎవరు నువ్వు అని వరుణ్ ని తన వింత అరుపులతో , నవ్వులతో భయపెడుతూ ప్రశ్నించింది .
భయంతో వణుకుతూ వరుణ్ ఆంజనేయ దండకాన్ని మనసులో స్మరించుకుంటూ నువ్వు ఎవరు అని అడిగాడు పిల్ల దయ్యాన్ని. అప్పుడు పిల్ల దైయ్యం ప్రత్యక్షమైంది . దాని రూపం చూడటానికి కోతి ముఖంతో రెండు కొమ్ములు కలిగి వుంది , దానికి కాళ్ళు లెవ్వు గాల్లో తేలుతూ వుంది .
ఎవరివి నువ్వు ఎందుకు వచ్చావ్ అని వరుణ్ అడిగింది . అపుడు వరుణ్ తను వాళ్ళ అమ్మకి సప్త వర్ణ గులాబి పుట్టినరోజు కానుకగా ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు పిల్ల దైయ్యం నేను నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను నువ్వు సమాధానం చెప్తే కరెక్టుగా గులాబి ఇస్తా లేదా నిన్ను తినేస్తా అని హెచ్చరించింది .
వరుణ్ సరే అన్నాడు ..
పిల్ల దైయ్యం : అన్నింటికన్నా వేగంమైనది ఏది ?
వరుణ్ : మనసు . (అది ప్రతీచోటకి వెళ్లకలదు వేగంగా.. )
పిల దైయ్యం : విలుకట్టలేనిది ఈ విశ్వంలో
వరుణ్ : తల్లి ప్రేమ ( చాల నిస్వార్ధమైనది .. కోప్పడ్డా ఏమి చేసిన మన మంచి కోసమే అని చెప్పి వాళ్ళ అమ్మ తనకి చేసిన సేవ తనని ఎలా ప్రేమిస్తుందో అని చెప్తాడు )
పిల్ల ధైయం వరుణ్ మాటలకి సంతోషించి తను చేసిన తప్పు వాళ్ళ అమ్మ విషయంలో తెలుసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది . వరుణ్ సప్త వర్ణ గులాబీ తీసుకొని ఇంటికి బయలు దేరుతాడు . పిల్ల దైయ్యం వాళ్ళ అమ్మకి సారీ చెప్పి జరిగినదంతా చెప్తుంది . అప్పుడు వెంటనే తల్లి,పిల్ల దయ్యాలు వరుణ్ దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పి తమ భుజాల పైన ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తాయి .
వరుణ్ జరిగినదంతా వాళ్ళ అమ్మ కి చెప్తాడు. తరువాత తల్లి , పిల్ల దయ్యాల్ని పరిచయం చేశాడు . మొదట భయ పడిన వాటి మంచితనానికి ఆమె కూడా వాటిని కుటుంబ సభ్యులుగా ఆదరించడం మొదలు పెట్టింది . వాటి మ్యాజిక్ తో అవి వరుణ్ వాళ్ళ అమ్మకి అన్ని పనుల్లో సహాయం చేస్తుండేవి .
వరుణ్ వాళ్ళ అమ్మ , వరుణ్ ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి కూడా చెప్పకుండా ఒక రహస్యంగా ఉంచారు ఆ తల్లి , పిల్ల దయ్యాల మంచి కోసం ..
వరుణ్ ఈ విధంగా వాళ్ళ అమ్మకి మర్చిపోలేని పుట్టినరోజు కానుక ఇచ్చాడు . అలానే అమ్మ ప్రేమ గొప్పతనం చెప్పి విడిపోయిన దైయ్యం వాటి పిల్లని కలిపి ఎవరికైనా తల్లి ప్రేమ గొప్పది అని .
అమ్మ ప్రేమని మించింది లేదు అని నిరూపించాడు .
Author: Prapulchand prapulmuntha at gmail.com