కరోనా వచ్చాక ఇంచు మించు ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక డిస్కషన్ వస్తోంది… రావు గారింట్లో కూడా వచ్చింది…
రావు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి… ఈ మధ్యనే రిటైర్ అయ్యారు… వారు,వారి శ్రీమతి జానకి, వారి కొడుకు, కోడలు, మనవడు ఇంకా మనవరాలు అందరు కలిసే వుంటున్నారు…
ఈ కరోనా దెబ్బ వార్తలు పెడితే చాలు పెద్దవాళ్ళు, పిల్లలు జాగ్రత్తగా వుండండి అని చెప్పిందే చెప్పి తినేస్తున్నారు… దానికితోడు ఈ వాట్సాప్ మెసేజెస్ కూడా అదే సోది… ఇంతలో మనవడు వచ్చాడు…
మనవడు: కరోనా చేతులు మాత్రమే కాదు కాళ్ళు కూడా శనితీసేరు వేసి కడగాలట… ముఖ్యనగ పెద్దవాళ్ళు మరీ జాగ్రత్తగాఉండాలట… అని తాత వంక ఒక చూపు చూసాడు…
రావు గారు: ఏమిట్రా?? నాకే జాగ్రత్తలు చెప్తున్నావా??? నా అనుభవం అంత లేదు నీ వయసు… అసలు మా కాలం లోఇలాంటివి ఎప్పుడు ఎందుకు రాలేదో తెలుసా??
మనవడు: ఏమో వచ్చాయేమో?? అప్పుడు మీడియా ఇంత బాగా లేదు కదా..
రావు గారు: నీ మొహం.. నీకు, ఆ వాతసప్ లో వెర్రి మెసేజ్లు పంపించే వాళ్లందరికీ కొన్ని విషయాలు ఈ రోజు తేల్చిపడేస్తాను.. కూర్చో…
1. ఇందాక ఏమ్మన్నావ్ రా… బయటి నుంచి వచ్చాక చేతులు మాత్రమే కాదు కాళ్ల్లు కూడా సోనిట్స్ చేసుకోవాలి…
అసలు పాత కాలం లో ఇంటి బయట ఒక బకెట్, దాని నిండా నీళ్లు, ఒక చెంబు పడేసే వాళ్ళు… బయటి నుంచి ఎవరువచ్చినా, వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా , కాళ్ళు శుభ్రంగా కడగనిదే లోపలికి వచ్చేవారు కాదు…
2. యోగ, ప్రాణాయామము చేయాలి – ఇప్పటి తరం ఎలా ఉందంటే.. ఇంట్లో పనులకి పనిమనిషి ఉన్నట్టు… ఈ యోగాలు, ఎక్సర్సీసీలు కూడా చేసేవాళ్ళు దొరికితేవీళ్ళ బదులు వాళ్ళని చేయమంటారు… అసలు ఇంట్లో పనులు సరిగా చేసుకుంటే ఎవరికీ ఏ నొప్పులు ఉండవ్…ఇంకా ప్రాణాయామం అంటావా… అసలు స్వచ్ఛమైన గాలి ఏది… ఇంటి బాల్కనీ లో కూర్చుని చేద్దాం అంటే పక్కఅపార్ట్మెంట్ వాడు ఒకడు సిగరెట్ కాలుస్తాడు, రోడ్ మీద పక్క షాప్ లో పాలు తీసుకురావటానికి కూడా సైలెన్సర్ లేనిబండి ఒకటి ఉంటుంది దాని తీసుకుని గుడు గుడు మని గుండెలు హవిసిపోయేలా శబ్దాలు చేస్తూ వెళ్తాడు ఇంకొకడు… ఇంకొకడు అర్ధం పర్ధం లేని పిచ్చి పాటలు చెవుల్లో సీసం పోసినట్టు పెడతాడు… ఇంకా ఎక్కడ రా.. ప్రశాంతమైన ధ్యాసశ్వాస మీద…
3. స్పైసెస్ తినండి…అవే మిరియాలు, యాలకులు,దాల్చిన చెక్క, వగైరా…
మీరు ఇలా బయట రెస్టవురంట్లు మూసేస్తే అప్పుడు తింటున్నారు రా ఇంటి తిండి… మేము రోజు మిరియాల రసం, యాలకులు, అల్లం బాగా వేసి మరిగించిన టీ, ధనియాలు,ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క వేసి మంచి రోటి పచ్చడి రోజు తినే వాళ్ళం… అంతేనా మధ్య మధ్యలో వేరుశెనగ ఉండలు, నువ్వుల ఉండలు, అలా పంటికింద పడేసే వాళ్ళం…
ఇప్పుడు చెప్పరా…. ఎవరు జాగ్రత్తగా ఉండాలి??? ముసలి వాళ్ళా?? లేక టీవీ ముందు కూర్చుని అసలు ఎం తింటున్నారోకూడా… తెలియకుండా తింటారు.. మీరా??
మా తరానికి లేని ఒక్క గుణం మటుకు ఈ తరం అదే మీ తరం లో వుంది… అదేమిటో తెలుసా…
మనవడు: ఏంటి??
రావు గారు: పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే దానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించే వాళ్ళం… మీరు దాన్నిపాటించకుండా ఉండాలి అని ముందే డిసైడ్ అయ్యి అప్పుడు ఆలోచిస్తారు…
ఆ విషయం తెలుసుకునే ఓపిక లేదు తెలుసుకోవాలి అనే కోరిక లేదు…
జానకమ్మ రావు గారి వంక చూసి ఒక నవ్వు నవ్వి… ఒక మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తుంది ఆయనకి….