పెసర పప్పు వడియాలు
పెసర పప్పుతో వడియాలు కూడా
కూడా చేసుకోవచ్చు అండి. పెసర పప్పుతో వడియాలు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా?
మీరూ ఈజీ గా చేసుకునేలా చెప్తాను .దానికి కావలిసిన వస్తువులు, తయారీ విధానం గురించి
తెలుసుకుందాము.
కావలిసిన వస్తువులు :-
పెసర పప్పు – 200 గ్రాములు,
గోరుచిక్కుళ్ళు – 200 గ్రాములు,
పచ్చిమిర్చి – 50గ్రాములు,
జీలకర్ర – 2 టీ స్పూన్లు,
ఉప్పు- సరిపడినంత తీసుకోవాలి.
తయారీ విధానం :-
ముందు పెసర పప్పును గంట సేపు నానబెట్టుకోవాలి. గోరు చిక్కుళ్ళు ను మిక్సీ లో తీసుకొని , ఈ మిశ్రమంలో పెసర పప్పు ను కూడా వేసి పట్టుకోవాలి . పచ్చిమిర్చి ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని వాటిలో పచ్చిమిర్చి పేస్ట్ , జీల కర్ర , ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . పలచటి దుస్తువు తీసుకొని దాని మీద చిన్న చిన్న ముద్దలుగా దుస్తువు మీద పెట్టి ,ఎండలో ఎండ పెట్టుకోవాలి. బాగా ఎండిన తరువాత వీటిని తీసుకోవాలి. అంతే పెసర పప్పు వడియాలు రెడీ. వీటిని వేడి వేసి సాంబార్ అన్నం లో తింటే చాలా బావుంటాయి.