చిన్నోడి తెలివి

చిన్నోడి తెలివి
Reading Time: < 1 minute

ఒక ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు మరియు తల్లి ఉండే వాళ్లు. ఐతే ఒక రోజు అమ్మ పనికి వెళ్తుంది. కొంత సేపటికి పెద్ద వాడికి ఆకలి వేస్తాది. చిన్న వాడు అన్నం ఉంది ఏమో చూడటానికి వెళ్తాడు .అక్కడ అన్నం ఉండదు. పెద్ద వాడికి బాగా కోపం వస్తాది. అన్నం కూడా వండకుండా పనికి ఎలా వెళ్ళింది అని చిరాకు పడుతూ ఉంటాడు . చిన్న వాడు ఏంటి అన్నయ్య అమ్మ మనకోసమే కదా పనికి వెళ్ళింది. నువు అది తెలుసుకోకుండా అమ్మని తిడుతున్నావ్. నీకు చేతనైతే నువ్వు కూడా వెళ్లి అమ్మకి సాయం చేయి. ఏ పని పట్టనట్టుగా ఇంట్లో ఉంటావ్. బాధ్యతలు ఇంకా ఎప్పుడు తెలుసు కుంటావ్ అన్నయ్య.

Smart Kids


అప్పుడు అన్నయ్య ఈ విధంగా మాట్లాడతాడు.నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. మరి నువ్వు కూడా పనికి వెల్లచ్చు కదా. నేను కూడా రోజు పనికి వెళ్తున్నా అన్నయ్య. అప్పుడప్పుడు నీకు అవసరమైనప్పుడు డబ్బులు కూడా ఇస్తున్నా కదా అన్నయ్య. అవి అమ్మ ఇచ్చినవి కాదు. నేను కష్ట పడి పని చేసిన డబ్బులు అన్నయ్య. నన్ను క్షమించు తమ్ముడు . వయసులో చిన్న వాడు ఐన నా కళ్ళు తెరిపించావు.ఇంట్లో నేను తీసుకోవాలిసిన బాధ్యతలు నువ్వు ,అమ్మ తీసుకుంటున్నారు. ఇక నుంచి నేను పనికి వెళ్తాను .నిన్ను, అమ్మని బాగా చూసుకుంటాను.అలాగే నిన్ను పెద్ద చదువులు కూడా చదివిస్తాను తమ్ముడు అని చెప్తాడు.ఈ మాటలన్నీ తల్లి వింటుంది. చాలా సంతోష పడుతుంది.

చిన్న వాడు ఐన మీ అన్నయ్యకి బాధ్యతలు చెప్పావు. నువ్వు గొప్ప వాడివి అవుతావు బాబు అంటూ ఆ కొడుకుతో తల్లి చెప్తుంది . నీ తెలివికి ఎంత మెచ్చుకున్నా సరిపోదు బాబు. జన్మ జన్మ లకు నువ్వు నా కొడుకు గానే పుట్టాలి అని వాళ్ళ బాబుతో చెప్తుంది . మాట ఇచ్చినట్టు గానే వాళ్ళ తమ్ముడిని బాగా చదివిస్తాడు. పెద్ద వాడు సంపాదించిన వాటితో చిన్న ఇల్లు కూడా కట్టుకుంటారు. ఆ ఇంట్లో పెద్ద వాడు అమ్మ, తమ్ముడు అందరూ ఆనందంగా కలిసి మెలిసి ఉంటారు.

ఎవరినైనా ఏదయినా చెప్పినప్పుడు వినాలి. చెప్పిన వాడు చిన్న , పెద్ద అని చూస్తే మీరు ఎప్పటికి ఏమి సాధించలేరు.

Leave a Reply