మనుషుల్లో కొంత మందిక మాత్రమే మంచి మనస్సు ఉంటుంది. కొంత మంది అని ఎందుకు అన్నాను అంటే నేను ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. మీ స్నేహితుల్లో కూడా ఉండే ఉంటారు. మంచి మనస్సు ఉన్న స్నేహితులు.
మనము ఎవరికైనా మంచి చేస్తే మనకి కూడా చేస్తారు. మనము మంచే చేయకుండా మనకి ఎవరు చేస్తారు అండి. మనము ఏమైనా బాధలో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు మనము పిలవకపోయిన వచ్చి ఏమైంది అని అడుగుతారు. మనము అన్ని చేసిన వాళ్ళకి ఒక్కసారి కూడా తిరిగి చూడరు.
మనుషులకు, ఈ రోజుల్లో స్వార్ధం బాగా పెరిగిపోయింది. నా వాళ్ళు లేరు, మన వాళ్ళు లేరు అన్నట్టు ఉంటున్నారు.ఒక మనిషికి మీరు చేసింది నచ్చటలేదు అంటే అక్కడ తప్పు మీది కాదు. వాళ్ళది. మీరు చేసింది నచ్చక కాదు. మీరే నచ్చటలేదని?? ఇలాంటి వాళ్ళ గురించి బాధ పడటం కూడా సమయం వృధా చేసినట్లే ? కాబట్టి మీతో ఉండే వాళ్ళనే మీ వాళ్ళాగా చూడండి.
మంచి మనస్సును ఎదుటి వాళ్లలో చూడటం కూడా నేర్చుకోవాలి.
సాయం అందరు చేస్తారనుకోవడం మన అవివేకం. ఒక సంఘటన మనిషిని బలంగా తాకినప్పుడు మాత్రమే చేస్తారు. ఇది ఎవరో చెప్తే కూడా చేసేది కాదు. ఒక మనిషి మంచి మనస్సుతో కొలవచ్చు.
జీవితం ఎప్పుడు మనకి పరీక్షలు పెడుతూనే ఉంటాది. మనము తట్టుకొని ముందుకు వెళ్ళడమే నేర్చుకోవాలి. మన మనస్సు ని మంచి కోసమే తలవండి. అంతా మంచిగానే ఉంటుంది. ఈ రోజుల్లో మనస్సు ఉన్న మనుషులు దొరకడం చాలా కష్టం.