టమోటో కుర్మా

టమోటో కుర్మా
Reading Time: 2 minutes

టమోటో లేని కూరలు చాలా తక్కువ . ప్రతి ఒక్క కూర లో దీన్ని బాగా వాడతము. దీని వల్ల మనకి కొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది . ఐతే టమోటోని కూరలోనే వేసుకోవడమే కాకుండా, దీనితో కొత్త కొత్త వంటకాలను తయారు చేసుకోవచ్చు. అలాంటి వంటల్లో టమోటో కుర్మా ఒకటి. ఇది చాలా మందికి తెలియదు. కొంత మందికి ఐతే ఇది ఉంది అని కూడా తెలియదు. దీన్ని ఎలా చేయాలా అని బాగా ఆలోచించకండి. మీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. దీనికి అవసరమయ్యే పదార్థాలు, తయారి విధానాన్ని మీకు చెప్తాను. మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.


కావలిసిన పదార్థాలు :-

చిన్న టమోటోలు – 200 గ్రా చిన్న టమాటోలను తీసుకోవాలి, ఉల్లిపాయ – 1 సరిపోతుంది, పసుపు – పావు టీ స్పూన్,
కరివేపాకు – 3 రెబ్బలు, కొత్తిమీర – కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది, కారం పొడి – 1 టీ స్పూన్,
ధనియాల పొడి – 1 టీ స్పూన్ , గరం మసాలా పొడి- పావు టీ స్పూన్, కొబ్బరి పొడి – 2 టీ స్పూన్, గసగసాల పొడి – 1 టీ స్పూన్ , అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ , పెరుగు – పావు కప్పు ( ఉండలు లేకుండా చూసుకోవాలి ) ఉప్పు – సరిపడినంత తీసుకోవాలి, నూనె – 2 టీ స్పూన్ లు.


తయారి విధానం :-

ముందుగా నూనెని వేడి చేసుకోవాలి. వేడి ఐన తరువాత దానిలో సన్నగా తరిమిన ఉల్లిపాయలు వేసి కొంచెం ఎగే వరకు ఉంచాలి. మరి బాగా ఎంచకండి. ఈ మిశ్రమంలో లో పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ , కరివేపాకు , కారం పొడి వేసి 3 నిముషాలు పాటు వేపి , ఆ తరువాత చిన్న టమోటో లను తీసుకొని వాటిని కట్ చేయకుండానే వాటిలో వేసి బాగా కలిపి మూతను పెట్టాలి.


వేరే గిన్నెలో మిగిలిన పదార్థాలను తీసుకోవాలి.కొబ్బరిపొడి, ధనియాల పొడి, గస గసాల పొడి, గరం మసాలా పొడి తీసుకొని వీటితో పాటు అర కప్పు నీళ్ళు లేకపోతే పెరుగు తీసుకొని వాటిని అన్నిటిని కలిపి ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరలో వేసి బాగా కలిసేలా తిప్పాలి. తిప్పిన తరువాత సరిపడినంత ఉప్పును వేసి మళ్ళీ కలిపి గట్టిగా మూతను పెట్టాలి.ఇలా మూత పెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. రెండు నిముషాలు పాటు ఉంచి ఇంకా దింపేయండి.వేడి వేడి టమోటో కుర్మా రెడీ. దీన్ని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు.వెజ్ బిర్యానీ, చపాతీలో వేసుకొని తింటే చాలా బావుంటుంది .

Leave a Reply