కథ:- అద్భుతం ఖరీదు ఎంత?
అమ్మ నాన్న మాట్లాడుకోవడం ఎనిమిదేళ్ల కీర్తి విన్నది. తమ్ముడు రమేష్ కి బాగా జబ్బు చేసింది.”నాలుగేళ్లకే నా కొడుక్కి నూరేళ్లు నిండుతున్నాయా బ్రతికే మార్గమే లేదా “అని తల్లి జానకి ఏడుస్తోంది.”ఏం చేయను వాడి మందులకి నా దగ్గర డబ్బు లేదు వాడిని అద్భుతం ఒకటే రక్షించాలి”అన్నాడు తండ్రి శ్రీరామ్.
తన పుస్తకాల గూడు దగ్గరికి పరిగెత్తింది కీర్తి.
తండ్రి అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దాచుకున్న మట్టికుండ హుండీని బయటికి తీసింది. అటు ఇటు ఊపితే ఉండి గలగల లాడింది.దొడ్లోకి వెళ్లి పగలగొట్టింది. చిందరవందరగా పడిన చిల్లర డబ్బులు అన్ని పోగేసి తన చేతిగుడ్డలో మూట కట్టింది. దొడ్డి వైపు నుంచే బజారు వైపుకు పరిగెత్తింది. మందుల షాపు వాడు ఏదో టెలిఫోన్ లో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు.
వచ్చింది పేద పిల్ల….మరి అర్జెంటు లేదన్నట్టుగా చూస్తూ తన పనిలో తను ఉన్నాడు. అయ్యా! మా తమ్ముడికి ప్రమాదంగా ఉంది. తొందరగా మందివ్వండి అంది షాపు వాడు వినిపించుకోలేదు. నిజంగా మా తమ్ముడికి చాలా జబ్బుగా ఉంది అయ్యా! కొంచెం అద్భుతాన్ని ఇవ్వండి అని కీర్తి ప్రాధేయపడింది. “ఫోన్లో మాట్లాడుతుంటే మధ్య నీ గోల ఏమిటి” అని షాపు వాడు చిరాకు పడ్డాడు. అప్పుడే అక్కడికి వచ్చినాయనా వాళ్ళ మాటలు విన్నాడు. “ఏం కావాలమ్మా” అని ఆధారంగా అడిగాడు. “మా తమ్ముడికి చాలా ప్రమాదంగా ఉందండి ఆపరేషన్ చేయాలట నాన్న దగ్గర డబ్బు లేదు అద్భుతం ఒక్కటే బ్రతికిస్తుందట నా దగ్గర ఉన్న డబ్బుతో అద్భుతాన్ని కొందామని”….
ఆ పిల్ల కళ్ళలోని అమాయకత్వానికి అతని కళ్ళు చమరచాయి. నీ దగ్గర ఎంత డబ్బు ఉందమ్మా అని ఆమె భుజం మీద బుజ్జగింపుగా చేయి వేశాడు. చేగుడ్డముడి విప్పి అక్కడ బల్లమీద చిల్లర గుమ్మరించి గబగబా లెక్కపెట్టి ఏడు రూపాయల 75 పైసలు అంది కీర్తి. “ఓహో! నా దగ్గర అద్భుతం ఉంది దాని ఖరీదు సరిగ్గా ఏడు రూపాయలు. మీ తమ్ముడికి సరిపోతుందేమో చూద్దాం. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు అతను.” ఆమె డబ్బుని జేబులో పెట్టుకుంటూ. కీర్తి ఉత్సాహంగా అతని చెయ్యి పట్టుకొని దగ్గర్లోనే ఉన్న వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. ఆయన దగ్గర అద్భుతముందట అని తల్లిదండ్రులకు చెప్పింది.
తమ పిల్ల ఏదో చిక్కు తెచ్చి పెట్టిందని కీర్తి మీద చిరాకు పడ్డారు తల్లిదండ్రులు. వాళ్ళని వారిస్తూ నిజంగానే నా దగ్గర ఆ అద్భుతం ఉంది. నాతోపాటు మా హాస్పటల్కి రండి అన్నాడు అతను. అతనితోపాటు ఓ పెద్ద హాస్పటల్లో అడుగుపెడుతున్నప్పుడు కానీ ఆయన ప్రఖ్యాత సర్జన్ పరంధామని వాళ్లకు తెలిసిరాలేదు . వాళ్ళు తమ ఆశ్చర్యం నుంచి చేరుకునేలోగా ఆయన రమేష్ ని పరీక్షించటం…వెంటనే ఆపరేషన్ కి ఏర్పాటు చేయటం జరిగిపోయాయి.
ఆపరేషన్ చేసి చిరునవ్వుతో బయటికి వచ్చిన డాక్టర్ పరంధాముతో “మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు గారు” అన్నాడు శ్రీరామ్. డాక్టర్ గారు అద్భుతం ఇచ్చారుగా తమ్ముడికి నయమైంది.
“ఆపరేషన్ కి ఎంత అయిందో” అని తనలో తను గొనుక్కుంది జానకి. “డాక్టర్ గారు నాతో చెప్పారు అమ్మ అద్భుతం ఖరీదు ₹7 అట… అవును కదా డాక్టర్ గారు” అందుకు పరంధాం దగ్గరికి వచ్చి “అవునమ్మా మరిచిపోయాను నా దగ్గర ఇంకా 75 పైసలు నీవి మిగిలాయి ఇందా తీసుకో” అని ఆ పిల్ల చేతుల్లో పెట్టాడు డాక్టర్ పరంధామ్. ఆ పిల్ల కళ్ళల్లో మెరుస్తున్న అద్భుతమైన తృప్తిని గుర్తించగలిగిన ఆ డాక్టర్ కళ్ళల్లో ఆనందభాష్పాలు చిలిపిచ్చాయి.
Chandamama Kids Collection link