Site icon Chandamama

పరిణామం – ఒక కథ

Indian Boy Photo by Yogendra  Singh from Pexels: https://www.pexels.com/photo/man-leanning-on-wall-2264291/
Reading Time: 2 minutes

పరిణామం – ఒక కథ

“సుధీర్ ఇలా రా ..ఎప్పుడూ ఈ చదువు నీకు ..ఇలా వఛ్చి కబుర్లు చెప్పు” అంటూ పిలిచింది అమ్మ. సుధీర్   చాలా మంచిగా చెదివేవాడు చిన్నప్పటి నుండీ. పెద్దయ్యాక పెద్ద ఇంజనీర్ కావాలన్న ఆశయం తో గట్టి పట్టుదలతో ఇంటర్ చదువసాగాడు. పదవ తరగతిలో మంచి మార్కులు సంపాదించాడు. అందరూ సుధీర్ తప్పక జీవితం లో  పెద్ద చదువులు చదువుతాడని మంచి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబంలో గుర్తింపు పొందుతాడని భావించారు. ఇంటర్ చదువుతుండగా తన తోటి విద్యార్థులు సినిమాకనో షికారుకనో వెళ్లే వాళ్ళు. కానీ సుధీర్ ఇంటి పట్టునే ఉండి చదువుకొనేవాడు. “సుధీర్ ఈ ఆదివారమన్నా మాతో క్రికెట్ ఆడదానికి రా ” అంటూ స్నేహితులు పిలిచినా వెళ్లే వాడు కాదు సుధీర్.

అవి పరీక్షల రోజులు. సుధీర్ తెల్లవారే లేచి తన సబ్జెక్టు అంటా చదువుకుని పరీక్షకు వెళ్ళాడు. పరీక్ష చాలా టఫ్ గా ఉండింది. తనకు తెలిసినవన్నీ రాసాడు సుధీర్. అలాగే మిగిలిన పరీక్షలన్నింటికీ అటెండ్ అయ్యాడు. తనకు తెలిసినంత వరకూ తాను తప్పక పాస్ అవుతాడని అనుకున్నాడు. హాలిడేస్ అయిపోయాయి. ఆ రోజు పేపర్ లో ఇంటర్ రిజల్ట్స్ వచ్చ్చాయి. మొట్టమొదటగా సుధీర్ పేపర్ చూసి తన నెంబర్ వెతికాడు. ఫస్ట్ క్లాస్ జాబితా, సెకండ్ క్లాస్ జాబితా లో తన నెంబర్ లేదు. చూస్తే తన నెంబర్ థర్డ్ క్లాస్ లో వచ్చింది. కళ్ళలో నీళ్లు  నిండాయి సుధీర్ కు. తాను ఆశించిన విధంగా తనకు ఫస్ట్ క్లాస్ రాలేదని చాలా దుఃఖం వచ్చింది.

ఇంట్లో ఏమీ చెప్పకుండా “నేను ఇప్పుడే వస్తానని చెప్పి ” తన స్నేహితుల ఇంటికి వెళ్లి  తన స్నేహితులతో చెప్పి భోరున ఏడ్చాడు సుధీర్. “ఏమీ పరవాలేదులే సుధీర్, మాకు కూడా సరిగ్గా మార్కులు రాలేదు. నీకే అలాంటి మార్కులు వస్తే మాకెలా వస్తాయి. ఏమీ బాధపడకు. మళ్ళీ ఈ పరీక్షలు రాయవచ్ఛులే. ” అని అతని బాధను తగ్గించే ప్రయత్నం చేశారు స్నేహితులు. సుధీర్ వారి మాటలు విని మౌనంగా ఉండిపోయాడు. అందరూ మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటే ఒంటరిగా దిగులుగా కూర్చొని వారిని చూస్తూ ఉండిపోయాడు. రాత్రి దాకా వాళ్ళు అలా ఆడుతూనే ఉన్నారు. సుధీర్ వారితో ” నేను వెళ్తున్నానని” చెప్పి అలా నడుచుకుంటూ ట్యాంక్ బండ్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.

Photo by Lucas Pezeta from Pexels: https://www.pexels.com/photo/man-wearing-black-and-brown-button-up-shirt-in-room-2112723/

రాత్రి తొమ్మిదయింది ఇంకా సుధీర్ ఇంటికి రాలేదెందుకు అని సుధీర్ తండ్రి అడుగగా, సుధీర్ తల్లి స్నేహితుల దగ్గరకు వెళ్లి వస్తానన్నది చెప్పింది. సుధీర్ కు తన తండ్రికి ఇలాంటి మార్కులు వచ్చ్చాయి ఆ విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ బాధపడుతూ, ఇంకా ఎందుకు ఈ జీవితం, నా మొహం వాళ్లకి చూపించలేను అనుకుంటూ నీళ్ల లోకి దూకబోయాడు. వెనుక నుండి “సుధీర్ ఆగు ” అంటూ తన తండ్రి పిలుపు వినిపించింది.    

“నాన్నా సుధీర్, ఒక్క క్షణం ఆగు.. “అంటూ వెనుక నుండి సుధీర్ భుజం పట్టుకొని ఆపాడు . వెను తిరిగి చూడగా అది సుధీర్ నాన్న. “మమ్మల్నందరినీ వదిలి వెళ్లి పోదామనుకున్నావు రా సుధీర్.. మేము ఏమై అయిపోవాలి. కేవలం నీకు తక్కువ మార్కులోచ్చ్చాయని నిరాశ పడితే ఎలాగా. ఇంకా  జీవితం చాలా ఉంది.. ఎన్నో ఒడిదుడుకులను  తట్టు కోవాల్సి వస్తే ధైర్యంగా వాటిని ఎదురుకున్న నాడే నీకు విజయం లభిస్తుంది. పద నాన్నా ఇంటికి పద. ప్రతీ అపజయానికి పర్యవసానం చావడం కాదు. కావాలంటే పరీక్షలు మళ్ళీ రాయవచ్చుఁ .

నీ స్నేహితుల ద్వారా నీవు ఇక్కడికి వఛ్చి ఉంటావని ఊహించాను  ” అంటూ ఇంటికి తీసుకు వచ్చ్చాడు సుధీర్ తండ్రి. సుధీర్ ఆ రాత్రంతా బాధ పడుతూ ఉన్నాడు. మరునాడు పేపర్లో వచ్చింది కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని రోల్ నంబర్లు తప్పుగా ప్రింట్ అయ్యాయని, కరెక్ట్ నెంబర్ లు ఆ రోజు పేపర్లో వచ్చ్చాయని. సుధీర్ తండ్రి పేపర్ చూడగా సుధీర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని తెలుసుకున్నారు. వెంటనే సుధీర్ తండ్రి సుధీర్ ని లేపి ఈ విషయం చెప్పాడు. సుధీర్ ఆనందంతో తండ్రిని హత్తుకున్నాడు. “చూసావా నీ తొందరపాటు వల్ల ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. ఏమైనా సరే నీ ధైర్యాన్ని వీడకు. కష్టాలను ఎదురుకున్ననాడే నీవు నా కొడుకు వనిపించుకుంటావు” అంటూ  సుధీర్ని ప్రశంసిస్తూ సుధీర్ భుజాన్ని తట్టాడు సుధీర్ తండ్రి.

Exit mobile version