కథ – ప్రక్షాళన
ఒక ఊళ్ళో ఒక పేరుమోసిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పద్దతులను పాటించేవాడుగా సంకుచిత్వం కల, మూర్ఖత్వం గలవానిగా ఉండేవాడు. అతను ఒకనాడు బయట కూర్చొని భోజనము చేస్తున్నాడు. విసనకర్రను తీసుకొనేందుకు ఇంటి లోపలి వెళ్ళాడు. అప్పుడే ఒక కాకి వచ్చి అతని పళ్ళెములోని అన్నం కొద్దిగా తిని వెళ్ళిపోయింది. ఆ విషయం బయట ఆడుకొంటున్న ఒక బాలుడు చూసాడు. మరల బ్రాహ్మణుడు వచ్చ్చి భోజనము చేస్తుండగా ఆ బాలుడు వచ్చ్చి బ్రాహ్మణునకు చెప్పాడు కాకి వచ్చ్చి కొంత అన్నం తినిపోయినట్లుగా . బ్రాహ్మణునకు మతి పోయినంత పని అయింది. తాను అన్ని ధర్మ గ్రంధాలు ఆచార గ్రంధాలు తిరుగవేసి తనకు కాకి ఎంగిలి తిన్న పాపము చుట్టుకొనినదని, తను పాతకం పోవాలంటే కాశీకి వెళ్లి పూజలు చేసి నది స్నానాదికములు జరిపిన కానీ తన పాపము పోదని తలచి కాశీకి ప్రయాణమయ్యాడు.
ప్రయాణములో మార్గ మద్యములో పూటకూళ్ళ ఇంట బస చేయవలసి వచ్చింది. అక్కడ భోజనము ముగిసిన తరువాత వారికి తాంబూలం వక్క ముక్క ఇచ్చ్చి తాంబూలం స్వీకరించి వక్క బద్దను మాత్రం చప్పరించి ఇచ్చ్చి వేయమన్నారు. బ్రాహ్మణుడు మిగిలిన అతిథుల్లాగానే వారు చెప్పిన ప్రకారమే చేసి వక్కను మాత్రం చప్పరించి ఇచ్చ్చాడు. తరువాత వారిని “వక్కను మాత్రమే ఎందుకు అడిగి తీసుకున్నారు” అని అడుగగా ఆ పూటకూళ్ళ మనిషి “మేము వక్క బద్దలను మరల కడిగి మళ్ళీ వచ్చ్చిన అతిథులకు ఇస్తామని” చెప్పింది. బ్రాహ్మణునికి ఆ మాట విని కళ్ళు తిరిగినై.ఈ ఎంగిలి పాపం కూడా తనకు చుట్టుకొనినదని భావించి తను తన ప్రాయశ్చిత్తానికి కాశి బ్రాహ్మణులకు దానమును కూడా ఇవ్వదలిచి తిరిగి కాశీకి ప్రయాణమయ్యాడు.
మార్గములో ఒక యాత్రికుల కుటీరంలో తన శ్రమకు అలసట తీర్చుకోవడానికి ఒక రెండు రోజులు ఉన్నాడు. అక్కడ తను ఉన్నప్పుడు ఒక చాకలి వాడు బట్టలను తీసుకొని ఉతకడానికి ఆ కుటీరానికి వచ్చ్చాడు.. బ్రాహ్మణుడు తన మంచం మీద నున్న గొంగళిని తదితర బట్టలను ఇస్తుండగా చాకలి వాడు వాటిని తీసుకోదలచలేదు, కారణం అడుగగా అక్కడి కుటీరం నిబంధనల ప్రకారం మంచం మీద బట్టలను ఒక నెల వరకు ఉతకరు అని చెప్పఁగా బ్రాహ్మణుడికి పరుల వస్త్రాలపై పడుకున్న కారణంగా వస్త్ర పాతకం చుట్టుకుందని తనకిక ఆత్మహత్యనే శరణమనుకున్నాడు.
తన పాపాన్ని కడిగి వేసుకోవడానికి ఆత్మహత్య చేసుకునేందుకు ఒక నది వద్దకు బయలుదేరాడు. నదిలో పడి మునిగుదామనేసరికి, అతనికి ఈత వచ్చ్చిన కారణంగా నీటిలో మునగలేక పోయాడు. దానికి తోడు ఒక చిన్న చేప అతని నోటిలో దూరి అతను నీటి బయటికి వచ్చ్చిన తరువాత బ్రాహ్మణుని నోటినుండి బయటికి వచ్చింది. చేప నోటిలో దూరిన కారణంగా బ్రహ్మహత్యా పాతకము చుట్టుకోవలసిన పని అయినందున బ్రాహ్మణుడు మరల ప్రయాణం ప్రారంభించ దలచుకోలేదు.
ఇంకా కాశి చేరడానికి మరల ప్రయాణిస్తే ఇంకా ఏమేమి చూడవలసి వస్తుందో ఏ పాతకములకు లోనవుతాడో అని అనుకొని బ్రాహ్మణుడు బ్రతుకు జీవుడా అని. ఇక ఇలా లాభం లేదనుకొని భగవన్నామస్మరణము చే తన పాపములను పోగొట్టుకునేందుకు నిర్ణయించుకున్నాడు. తన ఇంటికి తిరుగు ప్రయాణం పట్టాడు
Shop Chandamama Merchandise : Link
.