Site icon Chandamama

కథ – ఓ అశాంతి వేళ

Indian Train Photo by RAJAT JAIN from Pexels: https://www.pexels.com/photo/train-by-trees-against-blue-sky-325200/
Reading Time: 4 minutes

కథ – ఓ అశాంతి వేళ

ఏమైందో తెలియదు.చాలా సేపటి నుంచి ట్రైన్ ఆగిపోయింది.బోర్ గా అనిపించి ఏం తోచక పర్సు తీసి చూశాను.ఈ ప్రయాణానికి కారణమైన ఆ ఉత్తరం మళ్ళీ చేతికి తగిలింది.

డియర్ శృతి……

నీకు ఉత్తరం రాసి చాలానాళ్ళు అయిపోయింది కదూ…పది రోజుల క్రితం కండోలెన్సెస్ చెబుతూ మీ ఉత్తరం వచ్చేసరికి నేను మనుషుల్లో లేను.చాలా సివియర్ హార్ట్ ఎటాక్ తో అపోలో లో ఉన్నాను.నిన్న ఇంటికి వస్తూనే నా టేబుల్ మీద ఉన్న నీ ఉత్తరం చూడగానే ఏ ఆధారం లేకుండా నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ అంచు దొరికినంత రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. ఎప్పుడు లేనిది మూర్తి ఇలా ఎందుకు రాస్తున్నాడు అనుకుంటున్నావు కదూ…నలభై దాటిన ఈ మిడిల్ ఏజ్ ఎంత చెడ్డదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చాలా విషయాలు సమస్యలుగా మారిపోయి బాధిస్తున్నాయి. ఎవరితోనైనా చెప్పుకోవాలంటే ఆత్మాభిమానం అడ్డుస్తోంది. భార్యకు కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు నా గుండెను పిండేస్తున్నాయి. బరువెక్కిపోయిన హృదయాన్ని తేలిక పరుచుకోవడానికి నీకీ ఉత్తరం.

శృతి…ఈ సోర్ ఫుల్ మూడ్ లో ఏదో ఎమోషన్ తో వ్రాస్తున్నా అనుకోకు! నా చిన్ననాటి నేస్తానివి నా బలహీనతలతో సహా నన్ను అర్థం చేసుకున్న దానివి నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. చివరికి క్లబ్లో కూడా నా పోలీస్ ఆఫీసర్ వేశానికి స్నేహితులు ఉన్నారు తప్ప నాకు నాకుగా లేరు. నా వాళ్లంతా నా ఖీకీ బట్టల కరుకుతనాన్ని చూస్తారు కానీ,నా హృదయపు ఆర్ద్రతని అవలోకించారు

నిజానికి నీకు ఉత్తరం వ్రాయడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరం లేదు కానీ,ఈ వయసులో బావురమని ఏడ్చేయాలనిపిస్తుంది. నన్ను పిచ్చివాడు అనుకుంటావేమోనని ఇదంతా రాస్తున్నాను. 

Banarasi silk Saree with Blouse : Rs 1481 https://www.chandamama.com/index.php?route=product/product&product_id=24930

శృతి క్రితం నెల ఇదే రోజున మా అమ్మ నన్ను విడిచి వెళ్లిపోయింది నన్ను పెంచడానికి చదివించడానికి ఆమె ఎంత కష్టపడిందో నీకు తెలుసు. నన్ను కన్న మరుసటి రోజే భూమి తగాదాల్లో భర్తని భూమిని పోగొట్టుకొని ఈ లోకంలో ఒంటరి పోరాటం చేసింది. ఒక్కగానొక్క బిడ్డనని నాకు ఏ లోటు కలగకూడదని ఆమె రక్తాన్ని నీరుగా మార్చి చెమటోడ్చింది. అలాంటి అమ్మను నేనేం చేశాను వార్ధక్యంలో ఆ పల్లెలో ఒంటరిగా వదిలేశాను. కోటీశ్వరుడి కూతురిని చేసుకొని డబ్బుతో పాటు నా స్టేటస్ ని పెంచుకున్నాను అనుకున్నానే తప్ప… నా కన్నతల్లికి అన్యాయం చేసి నేను వీళ్ళకి శాశ్వతమైన బానిసగా మారిపోయాను అనుకోలేదు.

ఏడాదికి ఒకసారి ఆమెను చూడటానికి వెళ్లిన నన్ను… చూడగానే ఆమె కళ్ళల్లో వెలిగే కోటి దీపాల కాంతితో నా అహాన్ని పెంచుకున్నాను తప్ప ఆమె పట్ల ఆత్మీయతను పెంచుకోలేకపోయాను.

శృతి! ఎవరి విలువైన వాళ్లు అందుబాటులో ఉంటే తెలియదు. ఇకమీద ఆ కోటి దీపాల కాంతి ఎవరి కళ్ళలో చూడను ఈ భూమి మీద నేను మొదటి శ్వాస తీసుకునేటప్పుడు నా నోట్లో పాలు పోసిన నా తల్లికి ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు ఆమె నోట్లో నీళ్లు అయినా పోయలేకపోయిన దౌర్భాగ్యున్ని నేను. ఈ బాధ నన్ను జీవితాంతం విడిచిపెట్టదు. ఎవరో ధర్మాత్ములు టెలిగ్రామ్ ఇచ్చి ఇంత దూరం నుంచి నన్ను పిలిచే వరకు అనాధ ప్రేతంలా ఆ పల్లెలోని పాత ఇంటి వాకిట్లో మిగిలిపోయిన మా అమ్మను చూశాక కానీ నా తప్పు నాకు తెలిసి రాలేదు. నా అంత దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? ఈ ఉత్తరం మీద పడి అక్షరాలని చెరిపేస్తున్న… ఇవి కన్నీటి చుక్కలు కావు నా గుండెను ముక్కలు ముక్కలుగా కోస్తున్న రక్తపు చుక్కలు.ఈ దుఃఖం తీరేలా అమ్మ ఒడిలో తలవాల్చి ఏడవాలని ఉంది కానీ అమ్మెక్కడుంది. అమ్మ తాలూకు సంస్కారాలన్నీ చేసి వచ్చి నాలుగు నాళ్లయినా కాలేదు.

ఆ మూడు నుంచి నేను ఇంకా కోలుకోనే లేదు. మా స్రవంతి తను ప్రేమించిన వాడిని రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నానంటూ నా గుండెల్లో డైనమైట్ పేల్చింది. ఆ రోజే నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వాళ్ళు అడిగినదల్లా ఇస్తూ అపురూపంగా పెంచినా… ఈ పిల్లలు ఎందుకింత కఠినంగా ఉంటారు. నా ప్రమేయం ఏమీ లేకుండా అది తన పెళ్లి తను చేసేసుకోవాలి అనుకుంది. ఇదేమైనా న్యాయమేనా?

న్యాయాలు దానికి ఎందుకులే అది నా కూతురు కదా!

ఇక వ్రాసే ఓపిక లేదు ఉంటాను. మరి నిజానికి నాకు చచ్చిపోవాలనిపిస్తోంది 

 నీ మిత్రుడు
సత్యమూర్తి.

Banarasi silk Saree with Blouse: Rs 1462 https://www.chandamama.com/index.php?route=product/product&product_id=28305

ఆరోజు ఉత్తరం చదవటం ముగిసే సరికి ఆర్తితో నా కళ్ళు చమ్మగిల్లాయి. నా దృష్టిలో సత్యమూర్తి ఉత్త ప్రాక్టికల్ మ్యాన్. ఇంతటి భేళతనం అతనిలో ఉందని నేనెప్పుడూ ఊహించలేదు.

సత్యమూర్తి,నేను ఒకే ఊళ్లో పుట్టి పెరిగాం. చిన్నతనం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కలిగే సాగింది మా చదువు. ఆ తరువాత అతను సివిల్ సర్వీస్ కి మద్రాసు వెళ్ళటం, పి హెచ్ డీ కోసం నేను విశాఖలో ఉండిపోవడం మమల్ని ఇద్దరినీ విడదీసింది. అంతకన్నా అతని ప్రాక్టికాలటీ మమ్మల్ని విడదీసిందంటే బావుంటుంది. ఇన్నేళ్ల పరిచయంలోనూ అతని నుంచి ఇలాంటి ఉత్తరాలని నేనెప్పుడూ అందుకోలేదు. కష్టకాలంలో స్నేహితులు మరింత ఆత్మీయులుగా కనిపిస్తారు కాబోలు… అతనిని వెంటనే చూడాలనిపించింది.చూసి… ఓదార్చాలి అనిపించింది. ఉత్తరం మీద తారీకు చూశాను.పది రోజులైంది పోస్ట్ చేయబట్టి. పోస్టల్ డిపార్ట్మెంట్ కు ఒక నమస్కారం.

నేను ఇంకా ఆలస్యం చేయలేదు.

ప్రిన్సిపాల్ గా నేను పనిచేస్తున్న కాలేజీలో బాధ్యతలు ఎక్కువే.. వాటన్నింటినీ ఒక వారం పాటు వైస్ ప్రిన్సిపాల్ కి అప్పగించి టికెట్ రిజర్వ్ చేయించుకున్నాను. ఆరోగ్యం బాగాలేదు కదా స్టేషన్కు రమ్మని అతన్ని ఎందుకు శ్రమ పెట్టాలి. మూర్తికి స్రవంతి తప్ప కొడుకులు కూడా లేరు. స్టేషన్ నుంచి డైరెక్ట్ గా అన్నయ్య ఇంటికెళ్లి వెళ్ళిపోయాను. ఆ సాయంత్రం నేను ఎక్కిన టాక్సీ మూర్తి ఇంటి ముందు ఆగేసరికి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.షామియానాలో సన్నాయి మోగుతోంది. ఇల్లు చాలా రిచ్ గా అలంకరించబడి ఉంది. ఒరిజినల్ ఫ్లవర్ డెకరేషన్ తాలూకు పరిమళం గాలిలో ఎండిపోయి గాలిలో నిండిపోయి ఆహ్లాదంగా ఉంది. సీరియల్ లైట్స్ తో దసరాకి అలంకరించిన మైసూర్ ప్యాలెస్ లా ఉంది ఇల్లు.

వీధంతా నిండిపోయిన కార్లు పార్కింగ్ ప్లేస్ కోసం దిక్కులు చూస్తున్నాయి. వేరే అడ్రస్ కొచ్చానా అని నేను సంశయిస్తుండగా గేట్లోంచి గబగబా నడుచుకుంటూ వస్తున్నాడు మూర్తి. పంచ కట్టుకొని పొడుగు చేతుల లాల్చి పై… జరీ కండువాను సవరించుకుంటూ కారులోంచి తొంగి చూసి.. వచ్చేసావా శృతి! రాత్రి టెలిగ్రామ్ ఇచ్చాను అందుతుందో లేదో… వస్తావో రావో అనుకుంటున్నాను. స్రవంతి పెళ్లి ఇంటి దగ్గరే జరిపి చేస్తున్నాను. దాని ఇష్టం ఎందుకు కాదనాలి? ఏమంటావ్ అంటూ నుదుటికి పట్టిన చమటను అద్దుకున్నాడు. ఇంతలో మా వెనక వచ్చి ఆగిన మరో కారును రిసీవ్ చేసుకుంటూ శృతి… నువ్వు లోపలికి వెళ్ళు. సరోజా లోపల ఉంది అంటూ అటూ నడిచాడు.

మూర్తి భార్య సరోజ ఎదురొచ్చి నన్ను పలకరించింది. పెళ్ళి టైం కావటంతో నన్ను ఒకచోట కూర్చోబెట్టి హడావిడిగా వెళ్లిపోయింది. ఎవరో తెచ్చిన కూల్ డ్రింక్ ని సిప్ చేస్తూ కూర్చున్నాను. నా కళ్ళు మాత్రం మూర్తినే గమనిస్తున్నాయి.ఎక్కడ చూసినా తనే అయి‌ మూర్తి ఒకటే హడావిడిగా తిరుగుతున్నాడు. పక పక నవ్వుతున్నాడు. మధ్య మధ్యలో సరోజా దగ్గరికి వెళ్లి ఏదో సలహా అడుగుతున్నాడు. పది రోజుల క్రితం నాకు ఉత్తరం రాసిన మూర్తి ఇతనేనా అని డౌట్ వచ్చింది నాకు. నా ముందు కూర్చున్న ఎవరినో పలకరించడానికి వచ్చాడు మూర్తి. ఆయన మూర్తి చేయందుకొని “హలో ఏంటి! ఈ మధ్య హార్ట్ ఎటాక్ వచ్చిందట అపోలో ఆస్పత్రిలో ఉన్నారట. నేను ఊళ్లో లేను బిజినెస్ టూర్ కి అలా వెళ్లాను” అంటున్నాడు.

“అవునండి అమ్మాయి పెళ్లి కదా ఎటాక్ అని పడుకుంటే ఎలాగా” పెద్దగా నవ్వుతున్నాడు మూర్తి.

“పాపం ఈ మధ్యనే మీ అమ్మగారు పోయారట ఇంతలోనే ఈ పెళ్లి పెట్టుకున్నారు.

మూర్తి ముఖంలో నవ్వు చెరగలేదు. “చూడండి రామారావు గారు!పెద్దావిడ కాలం తీరిపోయింది వెళ్ళిపోయింది పుణ్యాత్మురాలు. గతించిపోయిన కాలం కోసం భవిష్యత్తును ఆపుకుని కూర్చుంటామా కాదు కదా!”

“అవునవును” అంటున్నాడు ఆయన.

నాకు అర్థమైంది మూర్తి నాకు ఉత్తరం రాసేసరికి స్మశాన వైరాగ్యం నుంచి బయటపడలేదు. ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయిపోయాడు. అతని కోసం పరిగెత్తుకొచ్చిన నా సెన్సిటివ్ నెస్ కి చికాకనిపించింది నాకు. ట్రైన్ కదిలి స్పీడు అందుకుంది ఉత్తరాన్ని చింపి బయటకు విసిరేసాను.

Complete Saree Shop from Chandamama

Exit mobile version