నక్క మోసం
ఒక ఊరిలో ఒక నక్క ఒక కుక్క ఉండేవి. నక్క చాలా జిత్తుల మారిది. కుక్క చాలా సాధువు. చాలా అమాయకంకా ఉండేది. ఎదో స్నేహం పేరున నక్క కుక్కతో మాట్లాడుతూ అది ఆ రోజు ఎలా ఎక్కడ తిండి సంపాదించిన సంగతులన్నీ తెలుసుకునేది. కుక్క అమాయకంకా నిజమైన స్నేహితుడనుకొని అన్నీ చెప్పేసేది. అలా విషయాలన్నీ తెలుసుకుని నక్క తను కూడా అక్కడి కెళ్ళి ఆహారం సంపాదించేది.
కుక్క చాలా నమ్మకంగా ఉంటూ ఆ ఊళ్ళో ఒక యజమానికి దుకాణానికి కావలి కాసింది. దానికి ఆ యజమాని సంతోషపడి కుక్కకు కడుపునిండా ఆహారం పెట్టాడు. మాసంహారం తో బాటు బ్రెడ్ ఇంకా రొట్టెలు లాంటివి కూడా ఇచ్చ్చాడు. కుక్క హాయిగా తృప్తిగా కడుపు నిండా తిని ఇంకా తనకు కావాల్సినవన్నీ తనతో బాటు తెచ్చుకుంది. కానీ నక్క జిత్తులమారి వేషాలు వేయడంతో ఊళ్ళో వాళ్ళు దానికి ఏమి ఇచ్చ్చే వారు కారు. దానికి ఆ రోజు ఏ మాత్రం ఆహారం దొరక లేదు.
తిండి కోసం వెదుకుతూ వెదుకుతూ కుక్క దగ్గరకు చేరుకుంది. కుక్క దగ్గర ఉన్న ఆహారాన్ని చూసి గుటకలు వేస్తూ కుక్కను అడిగింది ఇంత తిండి ఎలా సంపాదించావు అని. దానికి కుక్క “నేను ఒక యజమానికి దుకాణానికి కావలి కాసాను. దానికి ఆ యజమాని సంతోషించి నాకు ఈ ఆహారం ఇచ్చ్చాడు అని చెప్పింది. కానీ ఈ ఆహారం అంతా ఈ వారం నేనే తింటాను. ఎవ్వరికీ ఇవ్వను ” అని అంది. నక్కకు ఆహారం చూసి నోరూరింది. ఎలాగైనా కుక్క దగ్గర ఆహారం సంగ్రహించాలని అనుకుంది.
నక్క కుక్కతో ఆ మాసం ముక్క రుచి ఎలా ఉందొ చెప్పు అనగా కుక్క మాంసం ముక్క నోట్లో పెట్టుకుంది. వెంటనే నక్క కుక్కతో ” బావా బావా నేను ఊళ్ళో అందరూ చెప్పుకోవడం విన్నాను. నువ్వు చాలా బాగా పాడతా వట కదా. ఏది పాట పాడు. నా కోసం ఒక్క పాట పాడవా. నువ్వెంత బాగా పాడతావో చూస్తాను” అనడం తో కుక్క నక్క మాటలకు బోల్తా పడి పాట పాడ నారంభించింది.
వెంటనే ఆ మాసం ముక్క దాని నోట్లో నుండి కింద పడడం తో నక్క దానిని స్వాహా చేసింది. నక్క కుక్క పాడినంత సేపు సేపు చక్కగా దాని ఆహారం అంతా తినేసింది. కుక్క పాట అయిపోగా తన ఆహారం అంతా నక్క తినేసిందని గ్రహించి దానికి కరవబోయే వరకు నక్క అక్కడి నుండి పారిపోయింది.
కాబట్టి నక్క జిత్తులు చూపించే వారితో జాగ్రత్తగా ఉండాలి. కేవలం మాటలతో బోల్తా పడించేందుకు ప్రయత్నిస్తే ఆ పొగడ్తలకు లోను కాకుండా ఉండాలి. ఈ సందర్భంతో కుక్క జిత్తులమారి నక్కతో ఈ గుణపాఠం నేర్చుకుంది.
Shop with confidence for quality products with Chandamama