కథ: ఏకాంతం

Indian Woman Photo by Samarth Singhai from Pexels: https://www.pexels.com/photo/photo-of-woman-wearing-blue-dress-1193942/
Reading Time: 3 minutes

కథ: ఏకాంతం

“అరెరే!అదేమిటి మీరా!అలా చేస్తున్నారు? అతను మీ భర్త కాదు కదా…”

“భర్త అని ఎవరు అన్నారు?”

“మరి స్నేహితుడి కోసం..”

“ఆయన నాకు స్నేహితుడు అనిమాత్రం ఎవరంటారు?”

“మరి…..”

“ఆయన నా శరీరంలో ఒక భాగం నా మనసుకు ఒక చైతన్యం నా అంతరాత్మకు ఒక ఆలంబన….”

ఆ తరువాత మీరా మళ్లీ పూలు పెట్టుకోవడం కానీ కాటుక దిద్దుకోవటం కానీ నేను చూడలేదు.అప్పుడప్పుడు కనబడుతుండేది ఒంటరిగాను, స్నేహితురాళ్ళతో కలిసి నన్ను చూడగానే పలకరింపుగా నవ్వేది.ఆ నవ్వులో చెప్పలేని వెలితి కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉండేది.మీరాని చూడగానే నాకు కరుణ గుర్తు వచ్చేవాడు.ఒక కంచంలో తినకపోయినా ఒక మంచంలో పడుకోకపోయినా ఇద్దరు ప్రాణ స్నేహితులం. వాడు గుర్తుకు రాగానే మనసు గతంలోకి చూస్తూ బాధగా ములుగుతోంది.

ఆరోజు ఆఫీసు అయిన తరువాత ఇద్దరం బస్సు కోసం ఎదురుచూస్తూ స్టాఫ్ లో నిలుచున్నాము.పక్కనే కిలకిలలాడుతూ నలుగురు అమ్మాయిలు భుజాలకి బ్యాగులు తప్ప చేతుల్లో పుస్తకాలు లేవు. కాబట్టి వాళ్ళు స్టూడెంట్లు కాదు అని తేల్చుకున్నాం.ఏదో విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు.ఎప్పుడు వెళ్లాడో ఏమో కరుణ కూడా మొఖం ఎర్రగా చేసుకొని వాళ్ళతో చర్చలో తీవ్రంగా వాదిస్తున్నాడు. ఇంతలో బస్సు రావడంతో వాడిని నాతో పాటు లాక్కొని వెళ్ళిపోయాను.

ఆ తరువాత ఆ నలుగురిలో ఒక అమ్మాయి మీరాతో వీడికి పరిచయం బాగా పెరిగింది.వారానికి కనీసం రెండుసార్లన్న వాళ్ళు కలుసుకునే వాళ్ళు.దాపరికం లేకుండా మీరా కబుర్లు నాతో చెబుతూ ఉండేవాడు కరుణ.

“ఆ అమ్మాయిని చూస్తుంటే నీకంటే కొంచెం పెద్దది లాగా అనిపిస్తుంది రా”

 “అనిపించని”

“ఎన్నేళ్లు”

“ఏమో ఎప్పుడూ అడగలేదు”

“ఎంత మందట అక్క చెల్లెలు అన్నదమ్ములు”

 “తెలియదు”

“తల్లిదండ్రులు ఉన్నారా”

“అడగలేదు”

“వాళ్లది ఈ ఊరేనా లేకపోతే ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటుందా”

“ఏమో”

“పెళ్లయిందా”

“అడగలేదు”

“మెడ వంక చూడలేదా”

“చూశాను”

“మరి ఏమీ కనిపించలేదా”

“కనిపించింది”

“ఏమిటి”

“మెడ”

“వెధవ…జోకులు వేయకుండా నిజం చెప్పరా” మరి ఏమీ అడగకుండా ఏమీ చూడకుండా ఏమిటిరా మీరు మాట్లాడుకునేది.

“బోలెడు విషయాల మీరెవరు చూడలేనివి నేను విడమర్చి చెప్పలేనివి.

Photo by Tran Huynh Nam from Pexels: https://www.pexels.com/photo/woman-closing-eyes-in-seashore-2974920/

ఇలా సాగేది మా సంభాషణ. మీరా పేరెత్తగానే అతడి కళ్ళల్లో మెరుపు తప్పించి విషయం ఇదమిద్దం అని నాకు తెలిసేది కాదు.చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకుండానే కాలగర్భంలో మరొక ఏడాది కలిసిపోయింది.

ఆ రోజల్లా కరుణాకరం నాకు  కనపడలేదు.నాతో చెప్పకుండా ఊరికి వెళ్లడు.అంత అర్జెంటుగా వెళ్లిన ఒక కాగితం ముక్కైనా నాకు వదలి వెళతాడు తను ఫలానా చోటుకు వెళుతున్నట్లు.ఎక్కడికి వెళ్లి ఉంటాడు కనీసం ఆఫీసులో అయినా చెప్పకుండా.మరో రెండు రోజులు గడిచాయి. నాకు కంగారు పుట్టింది. మీరా కి ఫోన్ చేశాను.మీరా రెండు రోజుల కిందట ఏదో వర్క్ షాప్ కి వెళ్ళినట్లు మరో రెండు రోజుల తరువాత వస్తున్నట్లు వాళ్లు చెప్పారు.పిచ్చెక్కినట్లు అయింది.ఏం చేయాలో అని ఆలోచిస్తూ సాధారణంగా మీరా కరుణాకరం కలుసుకునే చోటికి వెళ్లాను.నన్ను చూడగానే వీర్రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు.అక్కడికి వచ్చినప్పుడల్లా నేను,కరుణాకరం,మీరా వీర్రాజు స్టాల్ లోనే టీ తాగే వాళ్ళం. అవసరమంటే ఒకటి,రెండు సార్లు కరుణాకరం 100, 50 వీర్రాజుకి అప్పు కూడా ఇచ్చేవాడు.”కరుణాకరం బాబు రాలేదేం రఘుబాబు”ఊరు వెళ్ళారా అంటూ ఆత్రంగా అడిగాడు.”లేదు మూడు రోజుల నుంచి వాడి జాడెం తెలియటం లేదు” అన్నాను బాధగా.

అంటే….అయ్యయ్యో…ఎంత పని జరిగిపోయింది అంటూ నిలుచున్న చోటే కూలబడిపోయాడు వీర్రాజు.ఏమిటి ఏం జరిగింది?కరుణాకరం విషయం నీకు ఏమైనా తెలుసా?కంగారుగా అడిగాను నేను.

మొన్న మూడు రోజుల నాడు ఆయమ్మ, కరుణాకరం బాగా చీకటి పడే వరకు ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నారు. 9:30 అవుతుండగా నాకు బాగా తలనొప్పిగా ఉండటంతో మా మామని కూర్చోబెట్టి నేను ఇంటికి బయలుదేరా.నా కళ్ళముందే ఆ అమ్మ టాటా…చెప్పి బస్సు ఎక్కేసింది. కరుణాకరం బాబు సిగరెట్ల కోసం కాబోలు మళ్ళీ మా కొట్టు వైపుకు వెళ్లారు.తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు ఆగి ఆగి చెబుతూ.”ఇంతకీ” సందేహంగా ఆపేశాను నేను.మరుసటి రోజు నిద్ర లేవగానే మా మామ ఆ కబురు ఈ కబురు మాట్లాడుతూ రాత్రి మా కొట్టుకి 50 గజాల దూరంలో పెద్ద యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు.రాత్రి వాళ్ళు వెళ్లే సమయానికి రోడ్డుమీద పెద్దగా రద్దీ లేదు.దాంతో వాడు చెప్పిన కబురు విని నా గుండె గుబేలుమంది.”ఏం చెప్పాడు…మీ మామ” తొందరగా చెప్పు  వీర్రాజు.

“ఆ బాబు కరుణాకరం గారు కాకూడదని నేను కోరుకుంటున్నాను.కొట్లో సిగరెట్టు కొనుక్కొని వెళుతున్న ఒక వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.అర్ధనాదాలు చేస్తూ ఆ వ్యక్తి పడిపోయాడట.లారీ ఆగకుండా వెళ్ళిపోయిందట.అప్పుడు రోడ్డుమీద ఒకటి రెండు వాహనాలు.ఒకరు ఇద్దరికీ మించి పాదాచారులు వెళ్లడం మించి రద్దీ ఏమీ లేదట.

“అమ్మ…నొప్పి” అంటూ అతడు నూతిలోంచి వచ్చినట్టుగా మూలుగుతున్నాడట.

కేసు అవుతుందని పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుందని భయపడి మా పిరికోడు గమ్మున ఊరుకున్నాడట.

పది నిమిషాల తర్వాత అతను బలవంతంగా లేచి కూర్చున్నాడట.”నేను బ్రతకాలి బ్రతికి తీరాలి.తనకి చెప్పకుండా నేను ఏమీ చేయను.చివరికి చావును కూడా.. చావను అంటూ గొనుక్కున్నాడట. తర్వాత చొక్కా విప్పి పగిలిన తలకి బిగించి కట్టుకున్నాడట తూలుతూ కొంటుతూ అరమయిలు దూరంలో ఉన్న జనరల్ ఆస్పత్రి వైపు నడిచాడట.అంత రక్తం పోయి తల బద్దలైన మనిషి అంత దూరం ఎలా నడిచాడు ఆయనకే తెలియాలి అంటూ ముగించాడు వీర్రాజు.

జనరల్ ఆస్పత్రికి పరిగెత్తాను.ఎవరు వివరంగా ఏమీ చెప్పలేకపోయారు.”

మూడు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో తల బద్దలైన ఒక యువకుడు ఆసుపత్రికి వచ్చాడని”ఒక ముసలి తోటి కొన్ని వివరాలు చెప్పాడు.

గేటు దగ్గర అతను పడిపోయాడట.గేట్ మెన్ సహాయంతో డ్యూటీలో ఉన్న తోటీలు అతడిని వరండాలోకి చేర్చారు.నైట్ డ్యూటీ డాక్టర్ వచ్చి చూసి కంగుతిన్నాడు.అంత పెద్ద దెబ్బ తగిలి అతనెలా నడిచి వచ్చాడు. అర్థం కాలేదు.ఏది ఏమైనా పోలీసులకు తెలియపరచడం మంచిది అనుకొని వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు.అతను బాధగా మూలగడంతో ఎవరో కాసిని నీళ్లు అతని ముఖం మీద చల్లారు.చల్లటి నీటికి అతను కదిలి కళ్ళు తెరిచాడు.ఇంతలో డాక్టర్ బయటికి వచ్చాడు.”డాక్టర్ నా తల బద్దలైంది చూస్తున్నారుగా రక్తం ఎలా కారిపోతుందో ఆపరేషన్ థియేటర్ ఎక్కడ నేను బతకాలి మీరాకి తెలియకుండా… మీరాకీ చెప్పకుండా…నేను చచ్చిపోను.తనకి చెప్పకపోవడం అంటే ఆత్మ ద్రోహం చేసుకున్నట్లే.నాకు ఆపరేషన్ చేయండి” అంటూ అతను లేవబోయాడు.డాక్టర్ నర్సులు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కొయ్య బొమ్మల అయిపోయారు.పోలీసులు రానిదే కేసు టేకప్ చేయడం డాక్టర్ కిష్టం లేదు.మీరు ఇక్కడే ఉండండి.నర్స్ ఆపరేషన్ కి రెడీ చేయి అంటూ మళ్ళీ ఫోన్ చేసేందుకు లోపలకెళ్లాడు డాక్టర్. కూర్చోలేక అతడు గోడకి చేరిన పడ్డాడు.10 నిమిషాల్లో పోలీసులు వచ్చారు.డాక్టర్ పరిస్థితి వివరించాడు.”అతడిని ఆపరేషన్ థియేటర్ కి తరలించండి”ఆజ్ఞాపించాడు డాక్టర్.

దగ్గరికి వెళ్లి ఎత్తబోయిన తోటీల చేతిలో తల వాల్చేశాడు ఆ యువకుడు.గొల్లమనేందుకు ‘నా’ అన్న వారెవరు లేరు అతని చుట్టుపక్కలు.ఎక్కడ రెండు మూడు రోజులపాటు పోలీసులు తీవ్రంగా గాలించారు అతడి వివరాలు సేకరించేందుకు.లాభం లేకపోయింది.అది అనాధ శవంగా నిర్ధారించబడింది.అనాధగా నిర్ధారించగానే శవం మాయమైంది. చెప్పకుండా చచ్చిపోవటం అంటే ఆత్మ ద్రోహం చేసుకున్నట్లే అన్నమాటలను బట్టి ఆ యువకుడు కరుణాకరం అనే నిర్ధారణకు వచ్చేసాను నేను.కరుణాకరం అప మృత్యువు నన్ను కలిచివేసింది.కుళ్ళి కుళ్ళి ఏడ్చాను మరుసటి రోజు మీరా కి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే చోటికి రమ్మన్నాను.కరుణాకరం గురించి అడిగింది. వినబడనట్లుగా ఫోన్ పెట్టేశాను.సాయంత్రం మీరా వచ్చింది.ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా విషయం చెప్పాను.మీరా తల కొట్టుకుంటూ ఏడవలేదు.కనీసం పర్సులో ఉన్న కర్చీఫ్ తీసి కళ్ళయినా ఒత్తుకోలేదు. అంతా విని “ఇకమీదట నేను ఒంటరిగా బ్రతకాలి అన్న మాట అంటూ” గాఢంగా నిట్టూరుస్తూ తలలో పూలు తీసి పక్కన పారేసింది.చీర కొంగుతో కాటుక తుడిచి వేసుకొని మెల్లిగా నడిచి వెళ్లిపోయింది.

Leave a Reply