కోడలు సోకు… అత్త షాకు

Indian Lady Photo by  Anastasia  Shuraeva from Pexels: https://www.pexels.com/photo/women-putting-on-a-red-shawl-8750027/
Reading Time: 2 minutes

కోడలు సోకు… అత్త షాకు

ఒక ఊరిలో లచ్చమ్మ , పూజ అనే అత్తా కోడళ్ళు ఉండే వాళ్ళు. లచ్చమ్మకు తినడం పడుకోవడమే మాత్రమే తెలుసు అలాగే మతిపరుపు కూడా ఉంది. పూజకు సోకులు ఉంటే చాలు. తిండి కూడా మరిచిపోతాది. ఇలాంటి లక్షణాలు ఉన్న అత్తా కోడళ్ళు ఎదో ఒక విషయంలో మాట మాట అనుకొని రోజూ గొడవలు వరకు వెళ్ళేవాళ్ళు.

ఒక రోజు అత్తా కోడళ్ళు గొడవ పడే సమాయనికి కొడుకు కూడా వస్తాడు. లచ్చమ్మ తన బాధను చెప్పుకుందామని కొడుకు దగ్గరకి వెళ్తుంది. అప్పుడు… లచ్చమ్మ :- చూసావా నీ ముందే నన్ను అన్నేసి మాటలు అంటుంటే నువ్వు చూస్తా ఉరుకుంటున్నావ్… కొడుకు :- చూస్తూనే ఉన్నాను అమ్మా… నువ్వు ఏమైనా తక్కువ ..నువ్వు చేసే పని ఇంట్లో ఒక్కటేగా … లచ్చమ్మ :- అంటే నీ ఉద్దేశం ఏంటి రా… నేను నీ పెళ్ళాన్ని రాచి రాంపాన పెడుతున్నానా ?? కొడుకు :- అబ్బా అమ్మా… నీ కాకి ముచ్చట్లు వినడానికి నేను ఇక్కడ కూర్చోలేదు… బయట కూరగాయలు వచ్చాయి అంట .. వెళ్ళి వాటిని ఐన సరిగా తీసుకో..??

కూరగాయలు బండి దగ్గరకు వెళ్ళి లచ్చమ్మ బేరం చేస్తూ ఉంటుంది. ఎమ్ అమ్మా వంకాయలు ఎలా ఇస్తున్నావ్… కిలో యాబై బామ్మ ..! ఏంటి కిలో యాబై రూపాయలా… వామ్మో వామ్మో రేట్లు చూస్తుంటే చేటంతా ఉన్నాయి !! ఎమ్ కావాలి బామ్మ …నీకు …నాకా ….ఇక్కడ ఉన్న కూరగాయలు అన్ని రెండేసి చొప్పున ఇవ్వు….ఆ మాటకు కూరగాయలు ఆమె కరెంట్ షాక్ కొట్టినట్టు ఐపోయిన్ది… ఆమె అడిగిన కూరగాయలు ఇచ్చి అక్కడ నుంచి జంప్ ఐపోతుంది.

లచ్చమ్మ :- ఆ కూరగాయలను తీసుకొని వంట గదిలోకి వెళ్తుంది. అదే సమయంలో పూజ తనకి నచ్చినవి వండుకుంటూ ఉంటుంది. అప్పుడే వంట గదిలోకి వచ్చిన లచ్చమ్మ ….పూజని చూసి అమ్మో అమ్మో నా కొంపంతా ఈ రోజే కొల్లేరు చేసేటట్లు ఉంది. దీని పీడ ఎప్పుడు పోతుందో అంటూ గొణుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కోడలు :- ఇప్పుడు ఏమైందని ఎందుకు అట్లా గొణుగుతున్నారు . లచ్చమ్మ :- ఇంకా ఏమైందని అడుగుతున్నావా… ఇక్కడ నీ వాలకం అంతా చూస్తూనే ఉన్నా… కోడలు :- కళ్ళు బాగా పెట్టుకొని చూడండి .. చికెన్ టిక్కా చేసుకుంటున్నా.. లచ్చమ్మ :- చికెన్ తో టిక్ ఏంటే… కోడలు :- అయ్యో టిక్ కాదు టిక్కా…చికెన్ టిక్కా… లచ్చమ్మ :- ఎమ్ టిక్కులో ఏంటో ..ఎర్ర చీరలో ఉన్న డబ్బులు తీసావా…కోడలు :- హ అవును ఆ డబ్బులే తీసా.


లచ్చమ్మ :- అయ్యో అయ్యో అవి నా పింఛను డబ్బులే… అవి ఎందుకు తీసావే… కోడలు :- అవి మీరు కష్టపడి సంపాదించారా…అవి కూడా…ఊరికే వచ్చినవేగా…అందుకే తీసా…లచ్చమ్మ :- నిన్ను జాతర చెయ్యా… అవి నాకు నెల రోజు ఖర్చులకు వచ్చేవి. కోడలు :- హ హ అందుకే మిమ్మల్ని అందరూ మతిపరుపు లచ్చమ్మ అనేది… డబ్బులు చీరలో పెట్టి ఎవరు మర్చిపోమన్నాని చికెన్ టిక్కా తీసుకొని కోడలు బయటి వెళ్తుంది. లచ్చమ్మ కోడలు దగ్గరికి వచ్చి :- నీకు ఏమైనా పట్టిందా….ఏంటే ?? ఓసి నిన్ను ఏదయినా వచ్చి మింగా… ఎప్పుడు చూడు కూర్చొని సోకులు పడతా ఉంటావు … కోడలు :- అబ్బాచా… మీరు ఏమైనా కష్ట పడినట్టు …వచ్చి నాకు నీతులు చెబుతున్నారు… లచ్చమ్మ :- దీని సోకులు చూడబోతుంటే ఈ సంవత్సరంలోనే ఆకులు , చిప్పలు మిగిలేటట్లు ఉన్నాయి… ఎలాగైనా దీనికి బుద్ది చెప్పాలసిందే అని పెద్దగా అంటుంది.. చాటుగా అది విన్న కోడలు :- అమ్మానా మతిపరుపు అత్తో.. నీకు ఇస్తా చూడు నా కాకినాడ కాజా…అంటూ మనసులో అనుకుంటాది.

Leave a Reply