కథ:-అడ్జెస్ట్ మెంట్
“హాయ్ నీరజ!”
“వనజ….నువ్వు….నువ్వేనా! వెంటనే పోల్చుకోలేకపోయాను సుమ!” 35 ఏళ్లకే ముసలమ్మలా తయారైన వనజని ఆపాదమస్తకం వింతగా చూడసాగింది నీరజ.
“బానే ఉన్నట్టు కనిపిస్తూనే ఉన్నావు! అయినా అడగటం ధర్మం కదా!హౌ ఆర్ యు!” పచ్చి కొబ్బరి లాంటి నీరజ వంటిని చూపులతోనే తడిమేస్తూ అడిగింది వనజ. అందుకు ఆమె గులాబీ పెదవులు నవ్వుతూ విచ్చుకున్నాయి,” ఫైన్ మరి నువ్వు!”
“నా విషయాలు ఎందుకులే ముందు మీ విశేషాలు చెప్పు!”
“ఈ ఊర్లోనే స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను పెళ్లై ఆరేళ్లయింది. ఆయన కూడా ఇక్కడే రెవెన్యూలో….ఇద్దరు పిల్లలు!” హుషారుగా చెబుతున్న నీరజకేసి నీరసంగా చూస్తూ “నీలాగా చెప్పుకునేందుకు నాకేమంతా పెద్దగా ఏమీ లేవు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్,ట్రాన్స్ఫర్ కారణంగా నాలుగు నెలల క్రితమే కర్నూలు నుంచి ఈ ఊరు వచ్చాను”అన్నది వనజ.
“అలాగా మరి మీ వారు పిల్లలు…!”తనలో పెళ్లయిన ఆనవాళ్ళ కోసం చూస్తున్న నీరజా కేసి చూడలేక తలదించుకుంది.
“అమ్మే కనుక నాతో కూడా లేకుంటే…ఏ కాకిని!”
“వాట్పె! పెళ్లి చేసుకో…లే….దా! లేదా కోరుకున్న వరుడు దొరకలేదా!”
“మొదట కారణం మాత్రం కాదు నీరజా!”అనేసి ఏదో చూస్తూ ఆలోచించ సాగిందామె.”మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఇద్దరం కలిసి చదువుకున్నాం. చదువయ్యాక చెరోవైపు వెళ్ళిపోయినా ఇరువురి నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా పోయాయి.దరిదాపు తిరిగి 15 ఏళ్ళు తర్వాత ఇదే కలవటం! కాలేజీ డేస్ లో చదువులోనే కాక అందం అలంకరణలో కూడా ఒకరికొకరం పోటీపడే తామిద్దరిని చూసి “పాలు నీళ్లు!” అనే వాళ్లంతా.నిజంగానే నీరజా జీవితం పాలవెల్లిలా ఉంది.తన బ్రతుకే ఇలా నీరుగారిపోయింది. సంతోషమే సగం బలం అన్న సామెతల ఇన్నేళ్లు వచ్చినా నీరజా అందం చెక్కుచెదరని కారణం సంతోషం!
కాస్తంత ఆలస్యమైనా పెళ్లి పేరంటం అయితేనే అందము ఆనందమును.తను అందుకు నోచుకొనకనే దిగులుతో ఇలా….!”అనుకుంది నిట్టూర్పు తోటి. “మాటల్లోనే మా ఇల్లు వచ్చేసింది.లోనికి రా వనజ!” ఆహ్వానిస్తున్న నీరజను అనుసరించింది వనజ.”మమ్మీ!”అంటూ తల్లిని చుట్టుకుపోయిన పిల్లలు కడిగిన ముత్యాలు లాగా ఉన్నారు.”మా వారు” భర్తని పరిచయం చేసింది.”నమస్తే”అంటూ ఉన్న విజయ్ ని చూసి ఆశ్చర్యపోయింది వనజ.
ఒకప్పుడు తనను పెళ్లాడేందుకు ఎంతగానో ప్రాకులాడినా విజయ్. ఆఫీసర్నే తప్ప నీలాంటి అదముడ్ని చేసుకోనంటూ అతని గడ్డి పోచకింది తృణీకరించింది తను. ఇప్పుడు అతడు తనకన్నా అధికురాలైన ఆఫీసర్ నీరజ భర్తగా…! స్వర్గంలా ఉన్న ఆ ఇల్లు వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కారణం! అడ్జస్ట్మెంట్ లేకపోవడం.అవును! అడ్జస్ట్మెంట్ లోనే ఆనందాన్ని వెతుకుంది నీరజ.
ఆ ఓర్పు నేర్పు లేక బ్రతుకంతా చీకటి చేసుకుంది తను.