Site icon Chandamama

పొరుగింటి పోరు

Saree Girls Photo by RODNAE Productions from Pexels: https://www.pexels.com/photo/cheerful-women-in-traditional-clothing-7685591/
Reading Time: 2 minutes

పొరుగింటి పోరు

ఒక పట్టణంలో ఇద్దరు అమ్మలక్కలు ఉండేవారు. వారిరువురి ఇళ్ళు పక్క పక్కనే ఉండేవి. సరిత, వాణి వాళ్ళ పేర్లు. 

సరిత వాళ్ళింట్లో వాళ్ళు  చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాణికి అది కుళ్ళుగా  ఉండేది. సరిత వాళ్ళాయన ఒక ఆఫీస్ లో ఒక పెద్ద ఆఫీసర్. వాణి వాళ్ళ ఆయన కు పెద్ద ఉద్యోగం లేదు. అతడొక సోమరిపోతు. పని చేయాలంటే పెద్దగా ఇష్టం లేదు. కూర్చొని తినే రకం. ఏ పని చేయకుండా హాయిగా కాలు మీద కలుసుకొని డబ్బంతా ఖర్చు చేసేవాడు.

దానికి తోడూ  వాణి కూడా అబద్దాలు చెప్పుకుంటూ కాలం నెట్టుకొచ్చేది. వాఱింటి ఇళ్ల మధ్య ఇక చిన్న పిట్ట గోడ ఉండేది. సరిత   అమాయకురాలు. తనకు ఎదుటి వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేదు. తనకు కొంత కష్టమైనా వేరే వాళ్ళను మాత్రం కష్ట పెట్టేది కాదు. దానిని ఆసరాగా తీసుకోని వాణి సరిత దగ్గర ఇది కావాలని అది కావాలని ఇంటి సరుకులు అరువుగా తీసుకొనేది.

ప్రతీ రోజు ఎదో మాట వరసకు మాట్లాడుతున్నానంటూ  పిట్ట గోడ దగ్గరికి వచ్చ్చి “సరిత ఏమి చేస్తున్నావు..ఎలా ఉన్నావు.. ఈ రోజు ఏమి వంట చేసావు మీ ఇంట్లో ” అంటూ కాలక్షేపానికి మాట్లాడుతున్నట్టుగా రోజూ వాళ్ళింట్లో ఎం జరుగుతుందో తెలుసుకొని దాని ప్రకారం వాణి వాళ్ళింట్లో దాని తగ్గ పని చేస్తూ తన భర్తకు వాళ్ళింట్లో జరిగేవి అన్నీ చెప్పేది. దాన్ని వాణి ఇంట్లోవాళ్ళు వాడుకునే వాళ్ళు. ఎలాగంటే సరిత వాణి తనింట్లో ఆ రోజు పాలకూర పప్పు చేస్తుందంటే వెంటనే వాణి అనేది “మా అమ్మాయికి పాలకూర పప్పు అంటే ఎంత ఇష్టమో ” అని. వెంటనే సరిత అయ్యో పాపం అనుకొని వారికి కొంచం పప్పు ఇచ్చేది.

Photo by Anastasia Shuraeva from Pexels: https://www.pexels.com/photo/woman-in-red-and-gold-sari-dress-8750018/

ఒకరోజు సరిత “ఈ రోజు మా ఇంట్లో వాళ్లంతా సాయింత్రం బయటికి మా బంధువుల ఇంటికి వెళ్తున్నాము” అంటే వెంటనే వాణి దానికి ” మా ఇంట్లో టీవీ లేదు కదా.. సాయింత్రంమంచి ప్రోగ్రాం వస్తుంది. ఎక్కడా చూడాలో అనుకుంటున్నాము ” అన్నది. దానికి సరిత ” పోనీలే  వాణి మా ఇంటి తాళాలు నీకిస్తాను. టీవీ చూడండి. వచ్చ్చాక తీసుకుంటాను” అంది. అలా ప్రతీ రోజు ఎదో ఒక నెపం  తో వాణి సరితను వాడుతూ ఉండేది. ఒక రోజు సరిత “మా వారు చాలా బిజీ గా ఉన్నారు ఈ రోజు వల్ల ఆఫీస్ ఎదో పని వల్ల గొడవ అట. వాళ్ళకి ఆఫీసుకు  తక్కువ  ధరకుపని చేసే వాళ్ళు  కావాలట”  అంది వాణితో. “ఉహు ..” అంటూ వాణి ఆ విషయం  వెంటనే తన భర్తకు చేర వేసింది. వాణి భర్త తనకు తెలిసిన కాంట్రాక్టర్స్ కు ఆ విషయం తెలియజేసి జెఎసి వాళ్లకు పని వచ్చ్చేటట్లు చేసి వారి దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడు. సరితకు వాణి చేసే విషయాలు తెలియదు.

ఇలా కొన్ని రోజులు గడిచాక సరితకు వాణి చేసే పనులు అర్థం కాసాగాయి.ఎదో పక్కింటి వాళ్ళు కదా అని తమ స్వంత ఇంటి విషయాలు అన్నీ చెప్తే వాటిని తమ  స్వార్థానికి వాడుకునే వాళ్ళుంటారు.  ఇది గమనించాక సరిత ఒకరోజు వాణితో తెలివిగా ” మా వారు ఈ రోడ్డుపై దుమ్ము చెత్త చాలా వస్తున్నందున ఈ పిట్ట గోడను పెద్దగా అడ్డుగోడలా కడదామనుకుంటున్నారు. అలాగయితే మనం ఇలా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఏదైనా అరువు ఇవ్వడానికి కూడా మీరు మా ఇంటికి రావలసి వస్తుంది. అలాగయితే మా వారికి విషయాలన్నీ తెలుస్తాయి, మా వారికి అలా బదుళ్ళు ఇవ్వడం ఇష్టం ఉండదు” అని చెప్పింది. వాణి గుండెలో రాళ్లు పడినట్లయింది. వానికి కూడా తను చేసే పనులన్నీ సరితకు తెలిసి పోయాయని అర్థం అయింది. చూస్తుండగా పెద్దగా రెండు ఇళ్ల  మధ్య అడ్డు గోడ కట్టేశారు.

ఆ విధంగా వాణి చాడీలు బాధ సరితకు తగ్గి హాయిగా తన సంసారం తను చూసుకుంటూ సంతోషంగా కాలం గడిపింది.  

Exit mobile version