కడుపు తీపి
ఒక ఊరిలో ఒక బాతుల గుంపు ఉండేది. వాటిలో బంటి మరియు బఠాణి అనే మొగ బాతు ఆడ బాతు ఉండేవి. వాటికి సంతానం కావాలని చాలా ఇష్టంగా ఉండేది. చాలా ప్రయత్నించగా లేక లేక ఒక మొగ బాతుని బఠాణి ప్రసవించింది. దానికి బచ్చు అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచ సాగారు బాతు దంపతులు.
అవి రోజూ ఊరంతా తిరిగి పంట పొలాల దగ్గర పడిన గింజలను ఏరుకొని తినేవి. ఒక్కోరోజు బాతులకు ధాన్యం దొరకపోయేది. కానీ బఠాణి కానీ బంతి కానీ వాటికి కాసిన్ని గింజలు దొరికినా వాటిని ఆ చిన్న బచ్చ్చు కు పెట్టేవారు. దానికి ఒకవేళ తినరాకపోతే బఠాణి తన ముక్కుతో పట్టుకుని బచ్చ్చు కి తినిపించేది. ప్రతీ రోజూ వాటికి తమ ఆహరం కోసం వెతుకులాడటమే పనిగా ఉండేది. ఆహారం గురించి అవి రోజంతా ఇటూ అటూ తిరిగేవి.
ఒకనాడు వాటికి ఆహారం అస్సలు దొరక లేదు. రోజంతా పొలాల మధ్య తిరుగసాగాయి. పొలాల మధ్య లో అక్కడక్కడా రైతులు పొలాల కోసం ఎరువుగా తయారుచేయడానికి కొన్ని గోతులు తవ్వి పెట్టారు, రైతులు పొలాలలో పని చేసి సాయింత్రముకల్లా ఇళ్లకు వెళ్లి పోయారు. తరువాత బాతులు ధాన్యం ఏరుకోవడానికి పొలాల దగ్గరకు వచ్చ్చాయి. వాటిలో బచ్చ్చు బాతుల మందలో కలిసిపోయింది. బఠాణి బంటీలు బచ్చ్చు గురించి వెతుకుతుండగా , అక్కడ గోతులు తవ్వి ఉన్నాయని తెలియక తన తల్లిదండ్రుల వద్దకు వస్తూ వస్తూ ఒక పెద్ద లోతైన గోతిలో బచ్చ్చు పడిపోయింది.
బచ్చ్చు గురించి వెతికి అలిసిన బాతు దంపతులకు బచ్చ్చు కేవు కేవు అని కీచు గొంతుతో గోతిలో నుండి అరవడం సన్నగా వినిపించింది. వాడి అరుపు విన్న బాతు దంపతులు బచ్చ్చు గోతిలో నుండి అరవడం తెలుసుకున్నారు. ఆ దంపతులకు ఏమి చేయాలో పాలు పోలేదు. చూడగా ఆ గొయ్యి చాలా లోతుగా కనిపించింది. బాతుల మంద తమ నుండి దూరంగా వెళ్లి పోవడం గమనించారు. బఠాణి బచ్చ్చును చూస్తుండగా బంటి పరిగెత్తు కెళ్ళి తమకు సహాయం చేయమని బాతుల మందను కోరాడు.
బచ్చ్చు గోతిలో పడిన సంగతి విన్న బాతులు బచ్చ్చు ను కాపాడడానికి గోతి వద్దకు వచ్చ్చాయి. గోతి చాలా లోతుగా ఉండడం వల్ల అవి అనుకున్న విధంగా బచ్చ్చు చేయి పట్టుకుని బయటికి తీయలేకపోయాయి. బచ్చ్చు ఏడుపుకు బఠాణి కూడా ఏడుపు లఘించుకుంది. కన్న కడుపు తీపి అంటే ఇదే ఏమో అనే విధంగా ఏడవ సాగింది. అప్పుడు ఆ బాతుల మందకు ఒక ఆలోచన తట్టింది. ఆ పొలాల వద్ద కట్టెలు ఉండడం గమనించిన బాతులు ఒక్కొక్కటిగా ఆ కట్టెలను తమ ముక్కులతో పట్టుకు వఛ్చి ఆ గోతిని నింపడం ప్రారంభించాయి.
చూస్తుండగా ఆ గోతి అంతా సన్న కట్టెలతో నిండి బచ్చ్చు తన చిన్న కాళ్ళ తో బలాన్ని కూడా దీసుకొని పైకి ఎక్కడం ప్రారంభించింది. రైతులు వచ్ఛే లోపుగా బచ్చ్చు మొత్తానికి ఆ గోతి నుండి పైకి రాగలిగింది. ఈ విధంగా బాతులు సంఘటితంగా పనిచేయడం వల్ల బచ్చ్చు ను కాపాడగలిగాయి. బఠాణి బంటీల ఆనందానికి అవధులు లేవు. బచ్చ్చు ను రక్షించినందుకు మిగిలిన బాతులకు ధన్యవాదాలు తెలియజేశాయి.