
నిజాయితీ విలువ
ఒకానొక ఊరిలో సరళ విరళ అనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. వారిరువురూ ఒకే తరగతి లో చదువుకునే వారు. సరళ చాలా సున్నితమైన స్వభావం కలది. విరళ కొంచెం దుడుకు స్వభావం కలది. సరళ చాలా బాగా చదువుకునేది. సరళ చాలా అభిమానవంతురాలు చాలా కష్ట పడి మంచిగా చదువుకోండి. విరళ అన్నీ చూచి కాపీలు కొట్టి మార్కులు తెచ్చుకుంది. ఇద్దరూ క్రమంగా ఒకే తరగతుల్లో చదువుకుంటూ పెద్ద చదువులు చదువుకున్నారు.
పట్టణాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించారు. సరళ నిజాయితీగా ఉద్యోగం సంపాదించింది. విరళ ఉద్యోగాల గురించి డబ్బు పరపతిని ఉపయోగించి పెద్ద ఉద్యోగంలో స్థిరపడింది. పెద్దయ్యాక కూడా అన్నీ దొంగ మార్గాలలో వెళ్లి తప్పుడు పద్ధతులు అవలంబించి నగరంలో పెద్ద ఉద్యోగం సంపాదించుకొంది. సరళకు మాత్రం చిన్న ఉద్యోగమే రాగలిగింది. సరళ మాత్రం చాలా ముక్కు సూటి గా వెళ్లే మనస్తత్వం కల్గినందు వల్ల మరియు న్యాయమైన మార్గాలలో వెళ్ళేది. కాబట్టి తనకి పెద్ద ఉద్యోగం రాకపోగా చాలా చిన్న ఉద్యోగం మాత్రమే సంపాదించగలిగింది. కానీ సరళ జీవితంలో చాలా సంతోషంగా ఏ దాపరికం లేకుండా ఉండ గలిగింది.
ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పని చేసేవారు. విరళ పెద్ద ఉద్యోగంలో సరళ చిన్న ఉద్యోగంలో పని చేసే వారు. సరళ తన చక్కగా తన పని చేసుకొని సాయింత్రం కల్లా ఇంటికి చేరి హాయిగా తన భర్త తో బాబు తో చక్కగా సంతోషంగా గడిపి హాయిగా ఏ సమస్యా లేకుండా హాయిగా నిద్ర పోయేది. విరళ డబ్బు ఉన్నదే కానీ ఇంటికి వెళ్ళగానే సమస్యలు. ఏ మాత్రం సంతోషంగా ఉండలేకపోయింది. కారణం నిద్ర పోగానే రాత్రంతా నిద్రలో తాను చేసిన దారుణాలు గుర్తుకు రావడం…వాటి కారణంగా నిద్ర లేక పోవడం వాటి కారణంగా తాను బాధ పడడం జరగ సాగింది. దాని కారణంగా తనకు మానసిక శాంతి లేకపోయింది. ఫలితంగా తాను కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయింది. దాని వల్ల తనకు తన వాళ్లకు కూడా మానసిక బాధలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దానివల్ల చాలా ఖర్చులు అయ్యాయి.
దానికి విరళకు బుద్ధి వచ్చి ప్రతి రోజు దేవుడి కి దండం పెట్టి తాను చేసిన తప్పులకు పాపాలకు పశ్చాత్తాప పడసాగింది. చూసారా తప్పుడు పనులు చేసి పెద్ద ఉద్యోగాలు సంపాదించినా అక్రమంగా సంపాదించిన డబ్బు ఎప్పుడూ నిలవదు. సరళ తన జీవితంలో న్యాయంగా సంపాదిస్తూ కాల క్రమేణా పెద్ద ఉద్యోగం సంపాదించి చాలా సంతోషంగా ఉంది. న్యాయంగా సంపాదించేదానికే విలువ ఉంటుంది అలాంటి డబ్బు నిలవగలుగుతుంది కూడా.. మొదట అక్రమంగా సంపాదించడం బాగానే అనిపించినా తరువాత వాటి బాధలు కష్టాలు మొదలవుతాయి. కాబట్టి నిజాయితీగా బ్రతుకడం ఎప్పటికైనా మంచిదని విరళ గ్రహించింది.