అపాయంలో ఉపాయం
ఒక అడవిలో ఒక సింహం రాజుగా ఉంటుంది. దానికి తను రాజు అనే అహంకారం చాలా ఉంటుంది. అది తనకు సరితూగే వారు లేదా తనను పొగడ్తలతో ముంచెత్తే వారితోనే స్నేహం చేసేది. నక్కలు తోడేళ్ళు లాంటివి సింహాన్ని పొగిడేవి.
కానీ రాజుగా అన్నీ జంతువులను సరిగ్గా పాలించాలి అనే బాధ్యతను గ్రహించేది కాదు. ఒకనాడు ఒక చిట్టెలుక సింహం వద్దకు వఛ్చి తన స్నేహం కోరుతుంది. సింహం దానికి “నీకేమయినా పిచ్చి పట్టిందా. నువ్వు నా స్నేహం కోరడం ఏమిటి. నీ స్థాయి ఏమిటి నా స్థాయి ఏమిటి. నీకు తగ్గవాళ్లను చూసుకో పో. మరొక సారి ఇలా అడిగావంటే నిన్ను చంపేస్తాను ” అని తన పంజాతో కొట్టడానికి ప్రయత్నిస్తుంది.
చిట్టెలుక దానితో భయపడి ” నా సహాయం నీకు అవసరం రాకుండా పోతుందా. నీ స్నేహం నీకు పనికిరాదన్నావు…సరేలే నీకు ఎవరు పనికి వస్తారో చూద్దాము ” అని వెళ్లి పోతుంది.
కొన్ని రోజులకు జంతువులను పట్టే వేటగాడు వల పన్ని సింహాన్ని వలలో వేస్తాడు. సింహం వలలో కూర్చుని తన మిత్రులనుకున్న వారందరిని పిలిచి తనను వల నుండి తప్పించమంటుంది. కానీ జంతువులన్నీ ““ఆమ్మో నిన్ను కాపాడబోతే వేటగాడు మమ్మల్ని పట్టుకుంటాడు ” అని అక్కడినుండి పారిపోతాయి.
సింహం దిగులుగా బాధ పడుతూ ఉంటే అప్పుడూ చిట్టెలుక వచ్చి ” నా సాయం నీకు కావాలా. నేను వల నా పళ్లతో కొరికి నిన్ను కాపాడగలను. నువ్వు నా స్నేహాన్ని ఒప్పుకుంటేనే ” అని అంటుంది. సింహానికి బుద్ధి వచ్చి ” నేను నీ బలాన్ని తెలుసుకున్నాను.
ప్రతీ జంతువుకి వాటి విలువ వాటికే ఉంటుంది.. విలువలు తెలుసుకోకుండా ఒకరిని నిందించడం నా తప్పే . ని స్నేహాన్ని ఒప్పుకుంటాను ” అనగా చిట్టెలుక వలను కొరికి సింహాన్ని రక్షిస్తుంది.
కాబట్టి బలాబలాలను తెలుసుకోకుండా మరొకరిని తేలికగా తిరస్కరించవద్దు.