అపాత్రదానం
మగధదేశపు రాజు తన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉండాలనుకునే వాడు. ఒక రాత్రి తన మంత్రికి మారు వేషాలలో తన ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి నగరంలో తిరుగుతుండగా సోమసుందరుడు భీమసుందరుడు అనే ఇద్దరు యువకులు తమకు జీవించడానికి సరైన ఉద్యోగాలు లేవని సంపద లేదని బాధ పడుతున్నారని గ్రహించారు.
రాజు దానికి మంత్రితో వీరిరువురికి రెండు వందల వరహాలు ఎదో విధంగా ఇప్పించి వారిని సంతోషపెడదామన్నాడు. దానికి మంత్రి ” రాజా మీ ఉద్దేశ్యం మంచిగానే ఉండవచ్చు. కానీ నా అభిప్రాయంలో భీమసుందరుడికి మాత్రమే డబ్బి ఇవ్వవ్సలసింది గా “ సలహా ఇస్తాడు. ఎందుకంటే భీమసుందరుడికి కష్టపడడం, దానికి తగ్గ భత్యం రాకపోవడం గమనించాడు మంత్రి.
అదే సోంససుందరుడు కష్టపడి కుండా తనకు డబ్బు రాబడి లేదని కేవలం బాధ పడడం మాత్రమే చూసారు.
దానికి రాజు అయినా సరే తన రాజ్యంలో ఎవరూ బాధ పడవద్దని వారిద్దరికీ డబ్బు సహాయం చేసాడు. కొన్న రోజులకు మళ్ళీ నగరంలో రాజు మంత్రి మారు వేషాలలో తిరుగుతుండగా భీమసుందరుడు ఒక మంచి ఇల్లు కట్టుకొని తన భార్యా బిడ్డలతో సంతోషంగా కాపురం చేసుకుంటూ కనిపించాడు.
అదే సోమసుందరం మొదట్లో లాగే అలాగే డబ్బు లేదని బాధ పడడం గమనించారు. కారణం రాజు మంత్రిని అడుగగా ” మహారాజా నేను అప్పుడు మీకు చేప్పాను. సోమసుందరానికి డబ్బునివ్వద్దని, కారణం పాత్ర నెరిగి దానం చెయ్యాలి.
దానం శ్రేష్ఠమే అయినా దానికి విలువ దానిని సద్వినియోగ పరచినప్పుడే. సోమసుందరం డబ్బంతా హాయిగా ఇష్టం వఛ్చిన ఖర్చులు చేసాడు. భీమసుందరుడు మీరిచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలు పెట్టి కష్టపడినందులకు అతడు ఈనాడు పెద్ద వ్యాపారి అయి ఇల్లు కొని తన కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు. ” అన్నాడు.
అప్పటి నుండి రాజు పాత్ర ననుసరించి దానాలు చేయడం ప్రారంభించాడు.