రాకుమారి అమాయకత్వం
ఒకానొక రాజ్యం లో ఒక మహారాజు ఉండేవాడు. అతనికి ఒక అందమైన అమ్మాయి జన్మిస్తుంది. ఆమెకు రత్నకుమారి అని నామకరణం చేసి ఆమెను అతి గారాబంగా పెంచుతాడు. ఆమె యుక్త వయస్సురాలై అతి సౌందర్యవంతిగా మారుతుంది. ఆమెకు తాను చాలా అందంగా ఉంటుందని గర్వం ఉంటుంది.
ఒకనాడు ఒక మహర్షి వారి రాజ్యానికి వచ్చాడు. మహారాజు అతనిని సగౌరవంగా తన రాజ్యానికి ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేసాడు. తర్వాత రాకుమారిని చూపించించి ” స్వామీ మీరు మా అమ్మాయి రాకుమారి రత్నకుమారిని దీవించండి” అన్నాడు. ఆ మహర్షి రాకుమారిని దీవించి “రాకుమారి నువ్వు నీ వివాహం జరిగే వరకు ఎక్కడైనా కానీ ముఖ్యం గా మీ ఉద్యానవనం లో ఉన్న సరస్సులోని నీటిని తాకవద్దు.. దాని వల్ల నీకు ప్రమాదమున్నది..” అని చెప్పి వెళ్ళిపోయాడు.
రాకుమారిలోని తనను తాను నియంత్రించుకునే , తన మనసును స్థిరపరచుకునే శక్తి కి అలవాటు కావాలనే ఆ మహర్షి అలాంటి షరతును తన తపశ్శక్తి చేత పెట్టి వెళ్ళిపోయాడు. రాకుమారి కొన్ని రోజుల వరకు నీటిని ముట్టుకొనలేదు.. చాలా రోజులైన తరువాత తనకున్న అహంకారంతో “ నేను ఈ రాజ్యానికే రాకుమారిని. ఒకరు నన్ను నియంత్రించడం ఏమిటి అని “ నీటిని తాకి నీటిలో బంతి వేస్తూ ఆడడం మొదలు పెట్టింది. . వెంటనే రాకుమారి అంద వికారంగా మారిపోయి మామూలు మనిషి లాగ మారిపోయింది.
దానితో ముని శాపం కారణంగా రాజు రాకుమారిని ఒక గ్రామంలోకి పంపించాడు. ఆ మహర్షి శాపం పోవాలంటే ఒక మంచి మనిషి రత్నకుమారిని రాకుమారిని అని తెలుసుకోకుండా అంద వికారమైన సరే తనను వివాహమాడే మంచి మనసు కలిగినవాడు ఎవరైనా ఎదురైతేనే మహర్షి శాపం వీడుతుంది.
అక్కడ రాకురారికి సుబాహుడు అనేవాడు తారసపడతారు. అతను అందరి లా కాకుండా రాకుమారిని మామూలు మనిషిగా భావించి ప్రేమిస్తాడు. రాకుమారిని వివాహమాడాలని నిశయించుకొని ఆ విషయం రాకుమారి చెబుతాడు. అతను కేవలం పైపై ఆకర్షణలకు లోను కాకుండా తన మనసు తెలుసుకొని తనను ప్రేమించాడని తెలుసుకుంటుంది. రాకుమారి కూడా అతనంటే ఇష్టం కలిగి తనతో అతనిని రాజాస్థానానికి తీసుకువెళ్లి రాజుకు పరిచయం చేయడంతో ఆమె శాపం వీడి అందమైన రాకుమారిగా మారిపోతుంది. సుబాహుడు ఈ వింతకి ఆశ్చర్య పడగా రాకుమారి జరిగిన సంగతి చెబుతుంది. తనకు ఈ విధంగా యోగిపుంగవుల ఆజ్ఞలను అనుసరిస్తూ స్థిర మనస్కురాలు ఎలా అవ్వాలో తెలుసుకున్నానని చెబుతుంది.
సుబాహుడు ఏమైతేనేం రాకుమారి ఇష్టపడినందుకు సంతోషించి రాకుమారిని ఘనంగా పెళ్లి చేసుకుంటాడు.