కలిసి ఉంటే కలదు సుఖం
ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతను గ్రామస్తులనుద్దేశించి “గ్రామం కానీ దేశం కానీ బాగుపడాలంటే అందరూ సంఘటితంగా ఉండాలని లేకపోతే పొరుగు దేశం వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకుంటారని ” చెప్పాడు.
అతని సమావేశంలో సారయ్య సంగమయ్య అనే యువకులు కూడా ఉన్నారు. సాధువు మాటలు వారికి అర్ధం కాలేదు.
వారు ఆ సాధువు ను సమీపించి సంఘటింగా ఉండడం వల్ల వారికి ఎలా దోహదపడుతుందో వివరించమని కోరారు.
దానికి సాధువు ” దీనికి నేనొక ఉదాహరణగా తెలియజేస్తాను..కొన్ని దృఢమైన కట్టెలు తీసుకు రావలసిందిగా ” చెప్పాడు. తర్వాత ఒక్కొక్కటిగా సారయ్య సంగమయ్యలకు ఇచ్చి విరవమన్నాడు. వాళ్ళు వాటిని అవలీలగా విరిచేసారు.
సాధువు వాళ్ళను ఒక నాలుగైదు కట్టెలను కలిపి ఒక్కసారికిగా విరవమని చెప్పాడు. వాళ్ళు వాటిని విరవలేకపోయారు. అప్పుడు సాధువు చెప్పాడు “చూసారా నాయనలారా. ఎంత అవలీలగా మీరు ఒక్క కట్టెను విరిచేయగలిగారో.. అదే చాలా కట్టెలను ఒకటిగా చేసి విరవడానికి ప్రయత్ని స్తే ఎంత కష్టమో..
అలాగే మనమందరమూ ఒక్కరుగా ఉంటే అదేవిధంగా సులభంగా ఎవరైనా గెలిచేయవచ్చుఁ . అదే మనము సంఘటితంగా కలసికట్టుగా ఉంటే గొప్ప శక్తిమంతుడుకూడా మనల్ని ఏమి చేయలేదు..” అన్నాడు. దానితో వారిరువురికి సాధువు మాటలు అర్థం అయ్యాయి.