స్వర్గమా! నరకమా! ఏది సులభం?

Clouds Photo by Magda Ehlers from Pexels
Reading Time: < 1 minute

స్వర్గమా! నరకమా! ఏది సులభం?

వాకింగ్కి నడుచు కుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి ధర్మ జాగరణనప్పుడు  నా పక్కన ఉన్న మితృడు “ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి” అన్నాడు. కాసేపు ఆలోచించి …

“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి” అన్నాను… 
*ఆశ్చర్యంగా అతను నా వంకచూసి అదెలా? అన్నాడు, నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను,

జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి,సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి,పాపాలతో పయనించడానికి   డబ్బుకావాలి. ఔనా…!!

ఇలా ఇంకా, ఇంకా .. కానీ,
ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు,
దేవుణ్ణ ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు.

సేవచేయడానికి డబ్బు అవసరం లేదు.
అప్పుడప్పుడు ఉపవాసం ఉండడానికి(ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం డబ్బు అవసరం లేదు.

క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు.

మన చూపులో కరుణ,
సానుభూతి, మానవత్వం
చూపడానికి పెద్దగా డబ్బు ఆవసరంలేదు ..(వీటికి)
దేవుడిపై నమ్మకం ఉండాలి.

మనపై మనకు ప్రేమ, ఆత్మ విశ్వాసం ఉండాలి.

ఇవి భూమిపైనే స్వర్గాన్ని
సృష్టించడానికి రాజ మార్గాలు.

ఇప్పుడు చెప్పండి .. డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ….

Leave a Reply