Site icon Chandamama

నిఖార్సయిన భారతీయుడికీ తెలియవు

Spy @pexels.com
Reading Time: < 1 minute

నిఖార్సయిన భారతీయుడికీ తెలియవు

ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ తను గూఢచర్యం చేస్తున్నానని ఒప్పుకోవడం లేదు … ఆఫీసులోని ఓ సెల్‌లో పారేశారు… తరువాత ఓ ఆఫీసర్ ఇంటరాగేషన్‌కు వచ్చాడు… ఎదురెదురుగా కూర్చున్నారు… ఆ గూఢచారి భయాన్ని, వినయాన్ని నటిస్తున్నాడు…



ఆఫీసర్ :: చెప్పు, నీతోపాటు ఇంకా ఎందరు పనిచేస్తున్నారు ఇక్కడ..? ఎవరెవరు..? ఎక్కడెక్కడ ఉంటారు..?
స్పై :: సార్, నన్ను నమ్మండి సార్, నేను ఇండియన్‌నే… కావాలంటే నా జేబులో డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు చూడండి, వదిలేయండి సార్…

ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే
స్పై :: ఎలా నమ్మించాలి సార్, మన రాష్ట్రపతుల పేర్లు వరుసగా చెబుతాను, ఇవిగో పేర్లు, వాళ్ల పుట్టినరోజులు, వర్ధంతులు…

ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే
స్పై :: అయ్యో సార్, ఇదుగో మన ప్రధానుల పేర్లు, జయంతులు, వర్ధంతులు… 

ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే
స్పై :: కాదు సార్, నేను ఇండియన్‌నే అని ఎలా నమ్మించాలి ఇక..? వందేమాతర గీతం, జాతీయ గీతం పాడుతున్నాను, వినండి, ఎవరు రాశారో చెబుతున్నా, జెండా రూపకర్త ఎవరో చెబుతున్నా…
ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే

స్పై :: మన రాజ్యాంగ పీఠికలో ఇలా రాసి ఉంది, చదువుతున్నా వినండి, మన మొత్తం రాష్ట్రాలు, రాజధానుల పేర్లు ఇవిగో…
ఆఫీసర్ :: నేను నమ్మను, నువ్వు గూఢచారివే,,
ఇక గూఢచారికి చిరాకెత్తింది, మొండి ధైర్యం వచ్చేసింది…
‘‘అవును, నేను గూఢచారినే, ఇంతకీ నేను ఇన్ని చెప్పినా నువ్వు నమ్మలేదేమిటి..?’’

‘‘పిచ్చోడా, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన వివరాలేవీ నిఖార్సయిన ఏ భారతీయుడికీ తెలియవు… ఇన్ని చెబుతున్నావు అంటే, ప్రిపేర్డ్, ప్లాన్డ్ అనీ,,,,, నువ్వు ఇండియన్ కాదనీ అర్థం కావడం లేదా నాకు..?’’ 

Exit mobile version