దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా?
అది ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు వచ్చి “అన్నా! అమ్మ పది ఇడ్లీలు తీసుకురమ్మన్నది డబ్బులు రేపు ఇస్తాను అన్నది” అని చెప్పాడు”
ఆ హోటల్ యజమాని ఇప్పటికే అమ్మ చాలా బాకీ ఉన్నది అమ్మతో చెప్పు
సరే ఇప్పటికి మాత్రం తీసుకువెళ్ళు గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు
ఇడ్లీలు పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు
సరే అన్నా వెళ్ళొస్తాను అమ్మకు చెప్తాను అని చెప్పి బయల్దేరాడు
అదే హోటల్ లో టిఫిన్ తింటూ ఇదంతా గమనిస్తున్న ఓ వ్యక్తి తాను తినడం పూర్తయ్యాక ఆ యజమాని దగ్గరకు వెళ్లి అడిగాడు
“ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు కదా మళ్ళీ ఎందుకండీ ఇచ్చి పంపారు అని”
దానికి ఆ యజమాని “ఆహారమే కదండీ నేను ఇస్తున్నది”
పెట్టుబడి పెట్టే నేనూ ఈ హోటల్ నడుపుతున్నాను కానీ ఇలాంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు
ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి అయితే కాస్త లేటుగా ఇస్తారు అంతే
అందరికీ డబ్బు అంత సులభంగా దొరకదు బిడ్డ ఆకలితో అడిగుంటుంది అందుకే పంపారేమో!
అడిగితే నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను
నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు కదండీ ఎలాగైనా నాకు వస్తుందండి నన్ను మోసం చేయరు
కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండీ! అది ముఖ్యం
నేను ఇప్పుడు ఇవ్వను పొమ్మంటే ఆ బిడ్డ తన తల్లికోసం దొంగతనం చేయొచ్చు లేదా
ఆ తల్లి ఆ బిడ్డను భిక్షమెత్తడానికి పంపవచ్చు లేదా ఆ తల్లి తన బిడ్డ ఆకలి తీర్చడానికి ఏదైనా తప్పుడు మార్గమూ ఎంచుకోవచ్చు
ఇప్పటికైతే నేను ఎంతోకొంత నష్టపోవచ్చు కానీ సమాజంలో జరిగే మూడు తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు
ఇంత బాగా ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి
దేవుడు లేడని ఎవరండీ చెప్పేది ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి
_ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం కచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు_
మనకు మించిన సహాయం చేయమని చెప్పడంలేదు మనకు ఉన్నదాంట్లో చిన్న సాయం అయినా చాలు
గుర్రం జాషువా గారి “అనాధ” లోని పద్యం
పరుల దుర్గతి గని గుండె కరగి వగచు
సదయ హృదయుల వీక్షణాంచలము నుండి
పుట్టు చుండును కన్నీటి బొట్టు వోలె ఏడి భగవంతుడని సంశయింప నేల?