Site icon Chandamama

మళ్లీ పల్లె బాట

మళ్లీ పల్లె బాట
Reading Time: < 1 minute

తనకు మెట్లెక్కడం భారమనుకుని , *లిఫ్ట్* ను కనుక్కుని ఎక్కడం
అలవాటు పడ్డాక , 
తద్వారా
పెరిగిన కొవ్వును
కరిగించు కోవడానికై
మళ్లీ
మెట్లెక్కుతున్నాడు !!!!

నడక కష్టమనీ, ఎంతో శ్రమపడి  కారు ను తయారు చేసుకుని,
వాడటం మొదలెట్టాక , 
లావెక్కిన తనను తాను.. తగ్గించు కోవడానికై, 
వాఁకింగ్ పేరుతో
*మళ్లీ* *రోడ్డున* *పడ్డాడు* *మనిషి* !!

హరిత విప్లవం అంటూ
అనేక రసాయనాల్ని వాడి, పంటలను పెంచుకున్నానని
గర్వపడేలోగా, వాటి
దుష్ప్రభావం తెలిసి
మళ్లీ ఆర్గానిక్ పేరు
జపిస్తున్నాడు!!

పారిశ్రామిక విప్లవంతో
ఏదో సాధించాననుకుని మిడిసిపడ్డ మనిషి,
తను నాశనం చేసిన 
ప్రకృతిని బ్రతికించు కోవడానికి   మళ్లీ పర్యావరణ మంత్రం పఠిస్తున్నాడు!!

పిజాలు, బర్గర్లు అంటూ వెంపర్లాడిన,
మనిషి కరొనా పుణ్యమా అని
మళ్లీ ఆరోగ్యకరమైన ఇంటి తిండికి అలవాటు
పడుతున్నాడు!!

ఇంగ్లీష్ మందులంటూ, జిమ్ములంటూ పరిగెత్తిన మనిషి  కరొనా నుంచి రక్షణ కై   మళ్లీ యోగా , ప్రాణాయామం, 
ఆయుర్వేదం అనడం నేర్చుకుంటున్నాడు!!!

ఉమ్మడి కుటుంబాలని చీదరించుకుని,
చిన్న కుటుంబాలతో సుఖపడదామనుకున్న, మనిషి మళ్లీ అంతా కలిసుందాం రా అంటూ పాత బంధాల వైపే మొగ్గు చూపు తున్నాడు!!!

పడచు పిల్ల లాంటి పట్నం మోజులో పడి తల్లి లాంటి పల్లెను మరచిన మనిషి, కరోనా  భయంతో , ఫామ్ హౌజుల పేరిట, 
పచ్చని ప్రకృతి కొరకై
*మళ్లీ* *పల్లె* *బాట* *పట్టాడు* !!

*ఓల్డ్  ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమోమరి*!!

Exit mobile version