మన జీవితం ఆశ, అదృష్టానికి మధ్య తిరుగుతూ ఉంటుంది. మనము ఆశ పడతాం. కానీ అదృష్టం కూడా ఉండాలి కదా. ఇంకా చెప్పాలి అంటే కొంత మంది కులాలు , మతాలు కోసం కొట్టుకుంటూ , తిట్టుకుంటూ ఉంటారు. అస్సలు మనకి ఉండేదే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితానికి కులాలు, మతాలతో పెట్టుకోవడం అవసరమా ??వాటితో పెట్టుకొని ఏమి సాధించగలము ?? ఏమైన సాధించగలమా ?? ఏ ఒక్కటి కూడా సాధించ లేము.ఉదాహరణకు చెప్పాలంటే మన కులం వాళ్లే మనకి స్నేహితులు అవ్వాలనేది ఆశ.
మనము కోరుకున్న స్నేహితులు మన జీవితంలోకి రావడం అనేది అదృష్టం. మనము చేసే చిన్న తప్పు ఏంటో తెలుసా !! మనకి దగ్గరలో ఉన్నవి మనము అందుకోవడానికి ట్రై చేయము. మనకి అందని వాటి కోసం మన జీవితాన్ని కూడా పక్కకి నెట్టేసి వేచి చూస్తా ఉంటాము. సాధించేవి పక్కకి నెట్టి , సాధించ లేని వాటితో పెట్టుకోవడం అంత అవసరమా మిత్రమా !!!ఒక్కసారి ఆలోచించు. కాలం నీ చేతుల్లో ఉంటుంది.ఎవరి చేతుల్లో ఉండదు కదా. నీ జీవితానికి నువ్వే అన్ని. అది మాత్రం మర్చిపోకు.
మనిషి కలలు కంటుంటాడు !! అక్కడ కల అనేది ఆశ. ఆశ పడుతున్నారు కానీ దాన్ని నిజం చేసుకోవడంలో ఓడిపోతున్నారు. మీరే కదా కలలు కనేది మరి ఎందుకు వాటి గురించి ఆలోచించడం లేదు. మీరు కన్న కలలను నిజం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించటలేదు ?? ప్రయత్నంలో పోయేది ఏమి ఉండదు కదా ఒక్కసారి ప్రయత్నించండి !! ఓ మనిషి ఒకసారి విను .. నీది కానీ దాని కోసం నువ్వు తపిస్తా ఉంటావు !! నీది ఐన దానిని పక్కనే ఉన్నా పట్టించుకోవు ?? నీకు రాసి పెట్టి ఉంటే నువ్వు తపించక పోయిన నీ దగ్గరకే వస్తుంది !!
మనకి అదృష్టం కూడా రాసి పెట్టి ఉంటేనే వస్తుంది. రాసి పెట్టి ఉంటే ఎప్పటికైనా మన జీవితంలోకి వస్తుంది. మనము వేసే అడుగు జాగ్రత్తగా వేస్తున్నామో ? లేదో ? అనేది మాత్రమే చూసుకోవాలి. మనము ఏ సమయంలో ఆశ పడతామో కూడా మనకే తెలియదు. సమయాన్ని మాత్రం వృధా చేయకు.ఎందుకంటే వృధా చేసిన సమయాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేము. నువ్వు వృధా చేసే ప్రతి నిముషం నీ జీవితంలో నీ అదృష్టాన్ని తల్లాకిందుల చేస్తుంది.