జీవితంలో ” కాలం ” పాత్ర !!!

time @pexels
Reading Time: 2 minutes

జీవితంలో ” కాలం ” పాత్ర !!!

జీవితంలో కాలం పాత్ర చాలా ఎక్కువుగా ఉంటుంది. జీవితం అనేది ప్రతి యొక్క మనిషిలో తిరిగే ఒక గడియారం లాంటిది. బ్యాటరీ ఉన్నంత కాలం గడియారం తిరుగుతూనే ఉంటుంది. బ్యాటరీ ఆగిపోయిన రోజు గడియారం చలనం లేకుండా ఉంటుంది. అలాగే మనిషి కూడా అంతే . మన జీవితంలో అందరూ ఉంటారు. ఏది కూడా వెంటనే నమ్మకూడదు. నిజమో ? కాదో ? అని తెలుసుకొని ముందుకు అడుగు వేయాలి. మన జీవితంలో ముంచే వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనమే తెలుసు కోవాలి. కింద రాస్తున్న మంచి మాటలు అందరూ చదవండి.కింద రాసిన మంచి మాటలు నాకు అనిపించి రాసినవి.మనకి తెలిసిన నాలుగు మాటలను ఇతరులకు కూడా పంచాలి.


★ మంచి వాళ్ళు ముంచే వాళ్ళు అని అనడం కరెక్టా ? లేక
ముంచే వాళ్ళు మంచి వాళ్ళు అని నమ్మిచడం కరెక్టా ?

పైన చెప్పిన దానిలో ముంచే వాళ్ళు, మంచి వాళ్ళు ఇద్దరు కూడా మనుషులే అండి. మనకి పరిచయం ఐనప్పుడే తెలియదు కదా. వాళ్ళు మంచి వాళ్ళా ?ముంచే వాళ్ళా అని ?

★ నీ అన్న వాళ్ళ దగ్గర తల వంచాలిసి
వస్తే వంచేయ్ !!!
ఎందుకంటె నువ్వు ఎంత కోప పడిన, తిట్టినా
నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి !!!

★ కోపంతో ఏమి సాధించలేము ??
కోపంతో మన అన్న వాళ్ళను దూరం
చేసుకోవడం తప్ప ఏమి రాదు !!
కోపాన్ని మీరు ఎప్పుడు ఐతే జయించగలరో
అప్పుడు మీ ” జీవితానికి ” ఒక అర్థం ఉంటుంది.

★ ఒక ఆలోచన మనిషికి మారుస్తుంది అంటారు !!
మరి మనిషి ఎందుకు ఆలోచన దగ్గరే
ఆగిపోతున్నాడు ??
ఎదుటివాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తారో ??
అప్పుడు మీ ” ఆలోచన ” బయటికి వస్తుంది !!!

మన జీవితంలో కాలం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాలం చెప్పినట్టు మనమే వినాలి. దారి చూపిస్తుంది. ఆ దారిలో అందరూ నడవాలిసిందే.

• మన కోసం కాలం ఆగదని మనము తెలుసుకుంటే చాలా మంచిది.
• కోట్లు సంపాదించిన మనిషి కూడా కాలాన్ని కొనలేరు.
• కాలంతో మనము స్నేహం చేస్తే అన్ని కాకపోయినా కొన్ని ఐన గెలవగలుగుతాము.
• గడియారంలో ఉన్న గంటల ముళ్ళు..

Clock showing Time

ఓ మనిషి నీకు 24 గంటల సమయాన్ని
ఇస్తున్నా …నువ్వు దాన్ని వృధా చేస్తున్నావు.

• నువ్వు వృధా చేసే ప్రతి నిముషం
నీ జీవితంలో నీ అదృష్టాన్ని
తల్లాకిందుల చేస్తుంది.

• కాలం చాలా విలువైనది .కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేము.

• నిన్న అనేది మనకి చెప్పి వెళ్ళదు. రేపు అనేది మనకి చెప్పి పోదు. ఈ రోజు ఉన్నదే లెక్క.

Leave a Reply