Site icon Chandamama

RIP – సద్గతి ప్రాప్తిరస్తు

Cremation @pexels.com
Reading Time: < 1 minute

RIP – సద్గతి ప్రాప్తిరస్తు

“RIP”  అంటే అర్థం ఏంటి? ఎందుకు ఎక్కడ వాడాలి??

మనం ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు watsapp లో లేదా social media లో జనాలు గుంపులో మందలాగా RIP అని రాసి పెడుతుంటారు. బాగా చదుకున్నామనుకున్న వాళ్ళు… చదువుకోని వాళ్ళు కూడా ఆ పదానికి అర్థం ఏమిటో  తెలుసుకోకుండానే RIP అని పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. కాని ఈ పదాన్ని ఎవరు ఉపయోగించాలి ఎవరి కోసం ఉపయోగించాలో చూద్దాం.

అసలు ఎవరిదైన మరణ వార్త విన్నప్పుడు RIP అనే పదం వాడటం మన సంస్కృతి లో లేదు పాశ్చాత్య మతాలైన క్రైస్తవం, ఇస్లాం ఆచారల నుంచి పుట్టింది. హిందూధర్మం గురించి మరిచిపోవడం వల్ల జనాలకు ఈ పదం వాడుక దాని అర్థం మీాద అవగాహన లేకుండా పోయింది.

RIP అనే పదానికి అర్థం “Rest in Peace” (శాంతిగా శయనించి శాశ్వత నిద్రను పొందు ) ఈ పదం కేవలం ఎవరినైతే గొయ్యి తవ్వి పాతిపెడతారో వాళ్ళ కోసం మాత్రమే వాడాలి అంటే ముస్లిం లేదా క్రైస్తవులు మరణించినప్పుడు ఈ పదం వాడొచ్చు ఎందుకంటే వారి ఆచారం ప్రకారం వారు మరణానంతరం ఆ వ్యక్తిని పాతిపెట్టి పడుకోమని చెప్పి ఎప్పుడైనా “judgement day” లేదా “కయామత్ కే దిన్”  వచ్చినప్పుడు ఈ శవాలన్నీ పునర్జీవులౌతాయని వారు నమ్ముతారు. అంటే అప్పటి వరకు విశ్రాంతిగా శయనించమని RIP అని రాస్తారు లేదా కోరుకుంటారు.

కానీ హిందూ ధర్మం సాంప్రదాయాల ప్రకారం శరీరం భౌతికమైనది, ఆత్మ అమరమైనది,అందుకే హిందూ ధర్మంలో మరణించిన వ్యక్తిని కట్టెలు నెయ్యితో యథాశక్తి కాలుస్తారు. అంటే ఒక హిందూ చనిపోతే RIP(Rest In Peace) అని రాయడంలో అర్థమే లేదు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ వేరొక దేహంలోకి వెళుతుందని పునర్జీవం పొందుతుందని నమ్ముతారు. ఆ ఆత్మకు కొత్త దిశ/సద్గతి ప్రాప్తించాలనే శ్రాద్ధకర్మలు శాంతిపాఠాలు చేస్తారు.

అంటే హిందూ ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరాలని లేదా వినమ్ర శ్రద్ధాంజలి లేదా శ్రద్ధాంజలి లేదా సద్గతి ప్రాప్తిరస్తు అని మాత్రమే రాయాలి. Fashion కోసమో style గా ఉంటుందనో లేదా తెలియకుండానో లేదా గుంపులో మంద లాగా RIP అని రాయకూడదు.

అదే క్రైస్తవం లేదా ముస్లింలు మరణించినప్పుడు RIP అని రాయవచ్చు.

ఈ మధ్య శ్రద్ధాంజలి అని రాయడానికి కూడా బద్దకించి shortcutలు వెతుక్కుంటున్నాం. ఆ క్రమంలోనే ఈ RIP మనకు అంటుకుంది. అవివేకంతో ఒకరు చేసారని దానినే గుడ్డిగా follow అవుతున్నాం. ఈ విషయం ఎవరినీ ఉద్దేశించినది కాదు కేవలం వాస్తవాలు తెలియచెప్పడం కోసమే.

అందుకే ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఈ విషయం తెలియని చాలామందికి తెలియపరుస్తారని కోరుకుంటున్నాం.

Exit mobile version