Site icon Chandamama

మంచి మాటలు యొక్క విలువ !!

Reading Time: 2 minutes

1.ఒక మనిషిని కొలిచేది ఏదయినా
ఉంది అంటే అది ” మంచి మనస్సు ” .
మంచి మనస్సుతో మాత్రమే మనిషిని
కొలవగలము .

2. నీ అన్న వాళ్ళ దగ్గర తల వంచాలిసి
వస్తే వంచేయ్ !!!
ఎందుకంటె నువ్వు ఎంత కోప పడిన, తిట్టినా
నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి !!

3. మనస్సు ముక్కలు అయ్యే మాటలు
మనిషిని విన్నప్పుడు బాధ పడుతుంటాడు.
నిజానికి అక్కడ ముక్కలు అయ్యేది
మనిషి కాదు, మనస్సు కాదు ??
మనిషి మీద పెట్టుకున్న ” నమ్మకం “
మాత్రమే ముక్కలు అవుతుంది .

4. మనము ఎవరికైనా మంచి చేస్తే మనకి కూడా చేస్తారు…
మనము మంచే చేయకుండా మనకి
ఎవరు చేస్తారు అండి.
అలా కోరుకోవడం మన ” అవివేకం ” అవుతుంది.

5. జీవితంలో పైకి రావాలంటే
ఒకరిని తొక్కి రావడం కాదు ??
ఒకరితో ” ఢీ ” పెట్టుకొని రావాలి !!

6. కోపంతో ఏమి సాధించలేము ??
కోపంతో మన అన్న వాళ్ళను దూరం
చేసుకోవడం తప్ప ఏమి రాదు !!
కోపాన్ని మీరు ఎప్పుడు ఐతే జయించగలరో
అప్పుడు మీ ” జీవితానికి ” ఒక అర్థం ఉంటుంది .

7. ఒక ఆలోచన మనిషికి మారుస్తుంది అంటారు !!
మరి మనిషి ఎందుకు ఆలోచన దగ్గరే
ఆగిపోతున్నాడు ??
ఎదుటివాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తారో ??
అప్పుడు మీ ” ఆలోచన ” బయటికి వస్తుంది !!!

8. మనిషి కలలు కంటుంటాడు !!
కానీ వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించడు ??
ప్రయత్నంలో పోయేది ఏమి ఉండదు
ఒక్కసారి ప్రయత్నించండి !!

9. మన కోసం కాలం ఆగదని మనము తెలుసుకుంటే చాలా మంచిది.
కోట్లు సంపాదించిన మనిషి కూడా కాలాన్ని కొనలేరు.
కాలంతో మనము స్నేహం చేస్తే అన్ని కాకపోయినా కొన్ని ఐన గెలవగలుగుతాము.

గడియారంలో ఉన్న గంటల ముళ్ళు..
ఓ మనిషి నీకు 24 గంటల సమయాన్ని
ఇస్తున్నా …నువ్వు దాన్ని వృధా చేస్తున్నావు.

నువ్వు వృధా చేసే ప్రతి నిముషం
నీ జీవితంలో నీ అదృష్టాన్ని
తల్లాకిందుల చేస్తుంది.

కాలం చాలా విలువైనది .కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేము.

నిన్న అనేది మనకి చెప్పి వెళ్ళదు. రేపు అనేది మనకి చెప్పి పోదు. ఈ రోజు ఉన్నదే లెక్క.

10. ఏ బంధమైన ” మన ” అనుకుంటే
ఆ బంధానికి ఎక్కడికి వెళ్లినా
విలువ ఉంటుంది !!
” తన ” అనుకుంటే ఎంత దూరం
వెళ్లినా విలువ ఉండదు ???


11. నువ్వు ఇష్టపడినవి నీకే
దక్కాలి …. అని ఎవరికి రాసి పెట్టి ఉండదు ?
దక్కచ్చు ? దక్కక పోవచ్చు ?
అది అంతా దేవుడు ఆడించే
ఒక ” ఆట “
ఆ ఆటలో మనిషికి ఓపిక ఉన్నంత వరకు
ఆడాలిసిందే !!!


12.మనిషి కలలు కంటుంటాడు !!
కానీ వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించడు ??
ప్రయత్నంలో పోయేది ఏమి ఉండదు
ఒక్కసారి ప్రయత్నించండి !!

Exit mobile version