Site icon Chandamama

చింతకాయ పచ్చడి

Reading Time: < 1 minute


చింతకాయలు అంటే చాలామందికి ఇష్టం.
వీటిని బాగా తింటారు కూడా. చింతకాయతో పచ్చడి చేసుకోవడం ఎలానో తెలుసుకుందాము.
దీనికి కావలిసిన వస్తువులు , తయారీ విధానం గురించి తెలుసుకుందాము.

కావలిసిన వస్తువులు :-

చింతకాయలు – 2500 గ్రాములు,
ఉప్పు – ఒక సోలా సరిపోతుంది,
మెంతులు – 100 గ్రాములు,
పసుపు – సరిపడినంత.


తయారీ విధానం :-

ముందుగా చింతకాయలను బాగా శుభ్రపరచు కోవాలి. శుభ్రపరిచిన తరువాత వాటిని తుడిచి పెట్టుకోవాలి. తరువాత చింతకాయలు, ఉప్పు, మెంతులు, పసుపు రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. తొక్కిన తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిలో పీచు పదార్థాలు ఉంటే తీసి వేసుకొని ఒక జాడీలో పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొనేటప్పుడు కొంచం కారం వేసుకోవాలి. అంతే చింతకాయ పచ్చడి రెడీ.

Exit mobile version