Site icon Chandamama

ఎగ్ బజ్జీ

ఎగ్ బజ్జీ
Reading Time: < 1 minute

ఎగ్ బజ్జీ

ఎగ్ తో మనము ఇప్పటి వరకు కర్రీ మాత్రమే చూశాము. ఎగ్ తో కర్రీ ఏ కాదు అండి. ఎగ్ తో బజ్జీలు కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో తెలుసుకుందాము. అలాగే దీనికి కావలిసిన వస్తువులు, తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాము.

కావలిసిన వస్తువులు :-

కోడి గుడ్లు – 4 ,
ఓట్స్ – ఒక కప్పు తీసుకోవాలి,
ఉప్పు – సరిపడినంత తీసుకుంటే సరిపోతుంది,
మిరియాల పొడి – 1 టీ స్పూన్,
కోడి గుడ్డు – 1 ఉడకబెట్టనిది ,
నూనె – సరిపడినంత తీసుకోవాలి,
నిమ్మరసం – 1 టీ స్పూన్,
చాట్ మసాలా – 1 టీ స్పూన్.

తయారీ విధానం :-

ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సోన, మిరియాల పొడి, నిమ్మరసం, చాట్ మసాలా , ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఉడికించిన గుడ్డును తీసుకొని పైన కలుపుకున్న మిశ్రమంలో వేసి బాగా పట్టేలా తిప్పాలి. ఇప్పుడు కళాయి లో నూనె వేసుకొని తరువాత గుడ్డును వేసి , ఆ గుడ్డు గోధుమ రంగు లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత గుడ్డును తీసి ఒక ప్లేట్ లో తీసుకొని చాక్ తీసుకొని రెండు ముక్కలుగా చేసుకోవాలి.అంతే ఎగ్ బజ్జీ రెడీ.

Exit mobile version