Site icon Chandamama

ఇపటి చైనా తగవుకు మనం చేయాల్సింది – చాణక్యనీతి!

Reading Time: 2 minutes

చాణిక్యుడు తన శిష్యులతో పాటు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళేవారు.ఆ దారిలో ఓ చిన్న  ముళ్ళచెట్టు ఉండేది. ఓరోజు చాణిక్యుడు ఏదో ధ్యాసలో ఉండి ఆ ముళ్ళచెట్టు త్రొక్కగా కాలికి ముల్లు గుచ్చుకుని రక్తం వచ్చింది. అది చూసి శిష్యులు ఆ ముళ్ళచెట్టు మీద కోపంతో దానికి పీకడానికి ప్రయత్నించారు.. చాణిక్యుడు వారిని వారించి కాస్త బెల్లం తీసుకురమ్మన్నారు.. శిష్యులు తెచ్చిన బెల్లం కు కొంచెం నీటిని కలిపి చిక్కగా చేసి ఆ ముళ్ళచెట్టు మొదట్లో కాండం కు వేసారు.. శిష్యులకు తమ గురువు గారు చేసిన పని అర్ధం కాలేదు.. చాణిక్యుడు వారి అవస్ధ చూసి చిన్నగా నవ్వుతూ ఇక పదండి సంధ్యావందనానికి కాలాతీతమవుతుంది అని నది వైపు కదిలారు.. 


మరుసటి రోజు చాణిక్యుడు మరలా సంధ్యావందనం కు శిష్యులతో కలసి నదికి బయలుదేరారు..దారిలో ఆ ముళ్ళచెట్టు ను చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు.. ఆ ముళ్ళచెట్టు కాండం ను చీమలు పూర్తిగా కొరికి చెట్టునుండి కాండంను వేరుచేసాయి.. ముళ్ళచెట్టు నిర్జీవంగా పడి ఉంది. అప్పుడు చాణిక్యుడు శిష్యులతో చూసారా అది మనకు మరియు మన వెనక వచ్చే వారికి కూడా నష్టం కలగజేస్తుంది. దాన్ని చంపడానికి మీరు కనీసం గ్రొడ్డలి వాడాలి, అది తీసుకురావడానికి, పని అయిన తరువాత మళ్ళీ దాన్ని యధాస్ధానం లో పట్టడానికి రెండుసార్లు తిరగాలి, దారిలో నిన్ను గ్రొడ్డలి తో ఉండగా అందరూ చూస్తారు, నీ ఉద్దేశం అందరికీ తెలిస్తుంది. చెట్టు కొట్టేటప్పుడు నీకు అక్కడక్కడ ముళ్ళు గ్రుచ్చుకోవచ్చు.. అలాకాకుండా మనకు ఇబ్బంది  కలిగించే వాటిని మనమీద అనుమానం రాకుండా, మనకు నష్టం కలగకుండా మట్టుబెట్టే విధానం గురించి  మనకు ముందు తెలిసి ఉండాలి. అంతిమంగా అది మంచికై ఉండాలి.. ఇదే చాణక్యనీతి! 

China Exports @pexels


ఈ ఉపోద్ఘాతం గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ..
ఈమధ్య మన పొరుగు దేశం చైనా కవ్వింపు చర్యలు ఎక్కువయ్యాయి.
మనదేశంలో ఉండే వారి దేశీయులు చైనీయులందరినీ వెనక్కిరమ్మని చెప్పిందని ఓ పుకారు హల్ చల్ చేస్తుంది. అంటే క్రమంగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని మనకు అర్థం అవుతుంది.. మనం డైరెక్ట్ గా యుద్ధం చేసి జన నష్టం, ఆస్తి నష్టం చేసుకునే ముందు ఈ సందర్భంలో మనం చాణక్యనీతి ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. 


ఆ వ్యూహం మనందరికీ తెలిసినదే.. 
అదే “చైనా వస్తు బహిష్కరణ “
ఇది అందరూ చెప్పేదే కదా.. అయినా  చైనా వస్తువులను మన దేశంలోకి రాకుండా అడ్డుకుంటే సరిపోతుంది కదా అనే ఆన్ లైన్ మేధావి వర్గం వాదన.. అది కరెక్ట్ కాదు. 


ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఏ దేశమైనా తమ దేశంలో మరో దేశ ఉత్పత్తులను అమ్ముకోడానికి నిరాకరించకూడదు..


కొనవద్దు అని బహిరంగంగా ప్రజలకు ప్రభుత్వం చెప్పరాదు.  అందువల్ల మన దేశంలోకి వచ్చే చైనా ఉత్పత్తులను ఆపలేం.. అలాగని ఖచ్చితంగా కొనవలసిందే అని నిబంధనలేమీ ఏ ప్రభుత్వం వారి ప్రజలకు పెట్టదు, కాబట్టి కొనడమా? మానడమా? అన్నది మన ఇష్టం.. కాదు అది మనకు కంటికి కనిపించని ఆయుధం.. చైనా తన ఉత్పత్తులు మనదేశంలో అమ్ముడుపోయినంతగా మరే దేశంలో అమ్మడుపోవు..

ఒకరకంగా చెప్పాలంటే చైనాకు మనదేశమే ప్రధాన ఆదాయ వనరు…ముళ్ళచెట్టు కాండం కు బెల్లం వేసినట్టు మనం అందరం ఏకతాటిగా నిలచి,  ఐకమత్యం గా సైలెంట్ గా చైనా వస్తువులను కొనడం మానేస్తే సరి.. చైనాను మనం ఆర్ధికంగా నష్టపరచినట్టే.. మనం మన దేశానికి ఎంతో మేలు చేసినట్టే..

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పై అణుబాంబు వేసినప్పుడు జపాన్ దేశానికి అపార జన, ఆస్తి నష్టం వాటిల్లింది, కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది, అందుకు కోపంగా జపాన్ ప్రజలు ఈరోజు వరకు అమెరికా ఉత్పత్తులు కొనడం మానేసారు.. అమెరికా కు జపాన్ తో వాణిజ్య సంబంధాలు ఈరోజుకు కూడా చక్కబడలేదు అంటే అది జపాన్ ప్రజల ఐక్యత..  

ఓ చుక్క రక్తం చిందించకుండా అమెరికా పై నైతికంగా, ఆర్థికంగా గెలిచి చూపించారు.. మనం ఆ పని చేయలేమా? అంతటి దేశభక్తి మనలో లేదా? ఆ ఐక్యత మనకు లేదా? ఆలోచించండి ఫ్రెండ్స్… 

మేరా భారత్ మహాన్! 

Exit mobile version