Site icon Chandamama

రైతు కష్టం

రైతు కష్టం
Reading Time: < 1 minute

రైతు కష్టం

రైతు లేనిదే మనము లేము. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నిజానికి వాళ్ళు చాలా కష్ట పడితేనే మనము తినడానికి బియ్యం, కూరగాయలు కొనుక్కోగలుగుతున్నాము. ఐన ఈ రోజు నాడు రైతులను గుర్తించడం లేదు. ఈ దేశంలో అందరి కన్నా ఎక్కువ కష్టపడేది రైతే. వాళ్ళు పండించడం మానేస్తే మనకి చివరికి అన్నము కూడా దొరకదు. కాబట్టి అలాంటి రైతులను మనము గౌరవించాలి.చాలా మంది రైతును చిన్న చూపు చూస్తారు.ఎంత మంది చిన్న చూపు చూసిన ఐన ఏ రోజూ కూడా రైతు కూర్చొని బాధ పడలేదు. రైతులు పండించే పంటను కొన్ని లక్షల మంది కొనుక్కుంటారు. ఎప్పటికైనా రైతు రాజు ఏ. రైతు గురించి ఎంత చెప్పినా తక్కువే.



రైతుకి కష్ట పడటం మాత్రమే తెలుసు. ఉదయాన్నే పొలానికి వెళ్లి ..మళ్ళీ సాయంత్రం ఇల్లు చేరుకుంటాడు. ఎండ వచ్చిన సరే తట్టుకొని నిలబడి పొలంలో పని చేస్తూనే ఉంటాడు. మనము రైతుల కష్టాన్ని గుర్తించి మనకి తొంచినంత సహాయాన్ని చేయాలి. మన కోసం ఎండానక, వనానక కష్ట పడుతూనే ఉంటారు.


ఏదయినా కష్టంగా ఉంది అనుకుంటే తేలికగా ఉన్నవి కూడా కష్టంగా ఐపోతాయి !!అలా అనడం మానేసి , కష్టంగా ఉన్నవి తేలికే అని అనడం నేర్చుకోండి . అలా అనుకొనే రైతు తన పంటని పండించుకుంటాడు. పెద్ద పెద్ద ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఇది తెలుసుకోలేక పోతున్నారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించిన అవి ఏమి తినలేరు. వాటిలో అన్నం మాత్రమే తినగలరు. ఇంకేమి తినలేరు.సంపాదన కూడా తిండి కోసమే అని ఇంకా తెలుసుకోలేక పోతున్నారు. ఆ అన్నం రైతు పండిస్తేనే కదా వాళ్ళు తినేది. మనము రైతులను గౌరవిద్దాము. రైతు నష్టాన్ని చూసే వాడు నాయకుడు. రైతు కష్టాన్ని గుర్తించే వాడు నిజమైన దేవుడు.

Exit mobile version