
కింద రాస్తున్న మంచి మాటలు అందరూ చదవండి.
కింద రాసిన మంచి మాటలు నాకు అనిపించి రాసినవి.మనకి తెలిసిన నాలుగు మాటలను ఇతరులకు కూడా పంచాలి.
• ముందు కష్ట పడు !! ఆ తరువాత
ఫలితాన్ని కోరుకో..
అస్సలు కష్ట పడకుండా ఫలితం కావాలంటే
ఆ ” దేవుడు ” కూడా ఒప్పుకోడు !!!
• జీవితంలో మీరు ఒకటి కోరుకుంటే
జీవితం మీకు ఇంకోటి ఇస్తుంది !!
అంత మాత్రాన మీరు బాధ పడాలిసి అవసరం లేదు ??

• నీది కానీ దాని కోసం నువ్వు తపిస్తా ఉంటావు !!
నీది ఐన దానిని పక్కనే ఉన్నా పట్టించుకోవు ??
నీకు రాసి పెట్టి ఉంటే నువ్వు తపించక పోయిన
నీ దగ్గరకే వస్తుంది !!
• చెప్పడం ఒక వంతు ఐతే చెప్పిన దాన్ని
చేసి చూపించడం ఒక వంతు !!
మాట్లాడటం వచ్చు కదా అని ఎక్కడిబడితే అక్కడ మాటలు జారకూడదు ??
అందుకే నోరు అదుపు , మాట పొదుపు.
• కోపానికి ఆవేశం తప్ప ఏమీ తెలీదు !!
దీని వల్ల మనకి ఇష్టమైనవి కూడా మనకి
తెలియకుండానే దూరం అవుతాయి !!!
• ఓ మనిషి …!!!
” రోజు ” ఏమో నేను రోజూ వస్తున్నా వెళ్లిపోతున్నా ?
అని అంటుంది ,
” సమయం ” ఏమో నువ్వు బ్రతికి ఉన్నతవరకు నీతోనే
ఉంటాను అని అంటుంది !!
మరి మనిషి ఏమో రోజును, సమయాన్ని చూస్తూ
వృధా చేస్తున్నాడు.