చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు.కొంత మంది మాటి మాటికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్లు బాధపడటం కన్నా మంచిగా ఆరోగ్యం గా ఉండటం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే మీ మొహం రంగు కూడా మారుతుంది. ఎండ, దుమ్ము, ధూళి ,బయట మన చర్మానికి పడనవి అన్ని కలిసి మన రంగును కూడా మార్చేస్తాయి. అయితే అలాంటి సమస్య ఉన్న వారు ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోండి.చర్మం.. చాల సున్నితమైనది.మన చర్మాన్ని మనమే కాపాడుకోవాలి.
1) నిమ్మకాయ రసం
వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవడంలోఎక్కువుగా మనము నిమ్మరసం ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు మనము ఊహించని ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లగుణం అధికంగా, పిహెచ్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని ఒకేసారి మీరు మీ మొహం పై ఉపయోగించినప్పుడు ఇది చర్మంలో కొన్ని భాగాలకు బాధను కలిగిస్తుంది.దీని వల్ల మన చర్మం దెబ్బతింటుంది.
2) సున్నితమైన చర్మం
అందం విషయానికి వస్తే సున్నితమైన చర్మం కాబట్టి మన చర్మాన్ని మనమే కాపాడుకోవాలి. మనకి నిమ్మరసం కొన్ని విధాలుగా మాత్రమే పనిచేస్తుంది.అన్ని విధాలుగా పనిచేయదు . నిమ్మరసంను చర్మంపై ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. చర్మంలోని నిమ్మరసం తరచుగా వాడటం వల్ల చర్మంపై ఎర్రటి-గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. దీని వల్ల మన చర్మం దెబ్బతింటుంది.సున్నితమైన చర్మం ఉన్నవారు దీనికి ఎక్కువ అవకాశం ఉంది.