కూరగాయల వ్యాపారి విజయం
ఒక ఊరిలో రైతు బాగా కష్ట పడుతూ ఉండేవాడు. ఎంత కష్ట పడిన డబ్బులు వచ్చేవి కావు. ఇంక ఇలా కాదు లే గాని కూరగాయలు వ్యాపారం పెట్టుకుందాము అని అనుకుంటాడు. ఐతే కూరగాయలు పండించడానికి పొలం కావాలి .పొలం కోసం తిరగని ఊర్లు లేవు. ఐన కూడా ఎక్కడా దొరకదు. ఇంతలో ఒక ముసలి అవ్వ కనిపిస్తుంది. ముసలి అవ్వ నడవలేక కింద పడిపోతుంది. ఇంతలో రైతు చూసి మంచి నీళ్ళు తాగించి నెమ్మదిగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. జాగ్రత్తగా ఉండు అవ్వ.
వెళ్లి వస్తాను అని చెప్తాడు .అప్పుడు ముసలి అవ్వ ఈ విధంగా అంటుంది. బాబు నా దగ్గర పొలము చాలా ఉంది. దానిలో నవ్వు ఏమైనా పండిచగలవ అని. అప్పుడు రైతు చాలా సంతోష పడతాడు. ఇన్ని రోజులు నుంచి పొలము కోసం వెతుకుతున్నా ఎక్కడ కూడా దొరకలేదు. ఈ ముసలి అవ్వ కనిపించి నా జన్మ ధన్యం ఐనది అని ఇది అంతా మనసులో అనుకుంటాడు. అవ్వ నేను చాలా రోజులు కోసం పొలము కోసం వేతుకుతున్నాను. దేవుడు నీ రూపం లో వచ్చి ఇస్తున్నట్టు గా ఉంది. పండించ గలను అవ్వ అని చెప్తాడు.
మరుసటి రోజు నుంచి కూరగాయలను పండించి వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. కొన్ని రోజుల్లోనే రైతుకు చాలా ధనం వస్తుంది. నెల నెలకు అవ్వకు డబ్బులు ఇస్తూ అవ్వని కూడా రైతే చూసుకునేవాడు. ఈ విధంగా రైతు కూరగాయల వ్యాపారం విజయవంతమైనది. మనము కష్ట పడడం మొదలు పెడితే ఆ దేవుడు ఎదో ఒక దారిని చూపిస్తాడు. ఆ దారిని మనమే కనుక్కోవాలి.
మనము ఏదయినా బలంగా కోరుకుంటే అవి మన దగ్గరికి ఎదో ఒక రోజు వస్తాయి.