Site icon Chandamama

చర్మ సమస్యలకు చిట్కాలను తెలుసుకోండి!!

చర్మ సమస్యలకు చిట్కాలను తెలుసుకోండి!!
Reading Time: < 1 minute

చర్మ సమస్యలు మనల్ని బాగా బాధ పెడతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది కొత్త కొత్తవి క్రిమ్స్ వాడుతున్నారు.మనము రోజూ వివిధ చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిలో డ్రై స్కిన్, మొటిమలు, ముడుతలు మరియు దద్దుర్లు ఇలా చెప్పుకుంటూ పోతే మనల్ని బాధ పెట్టె చర్మ సమస్యలు చాలానే ఉన్నాయి. ఇలాంటి చర్మ సమస్యలు మిమ్మల్ని తొందరగా వదిలి వెళ్ళాలి అంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని చదివి అలానే పాటించండి. ముఖానికి ఏమైనా ఐతే చాలు వెంటనే పార్లర్ కి వెళ్ళిపోతారు.


1) స్క్రబ్ ఎక్కువ చేయడం

చర్మాన్ని స్క్రబ్ చేయడం అవసరమే. కానీ మరి స్క్రబ్ చేస్తే మన చర్మ అంత తట్టుకోవాలి కదా .ఎందుకంటే స్క్రబ్బింగ్ వల్ల చర్మంలో చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. మీ ముఖం మీద మొటిమలు ఉంటే, మీరు స్క్రబ్బింగ్ చేయకుండా వుండటం మంచిది. ఎందుకంటే స్క్రబ్బింగ్ పరిస్థితి మరింత ఎక్కువుగా ఉండకూడదు. కొన్ని సమయాల్లో మొహాన్ని మీరు ఫేస్ వాష్ చేసుకోండి.



2 ) చేతితో మొహం మీద మొటిమలను గిల్లడం

ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు, అద్దంలో చూస్తున్నప్పుడు చాలా మంది వాటిని చేతితో గిల్లడం వంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల మొటిమల్లోని చీము చర్మంలోనే కాకుండా మన శరీరంలో వేరే ప్రదేశం లోకి కూడా చేరుతుంది. కాబట్టి మీరు ముఖం మీద మొటిమలు ఉంటే, వాటిని పదే పదే గిల్లడం మానేయండి.ఇలా చేస్తే మొటిమలు తొందరగా తగ్గు ముఖం పడతాయి.


3 ) ముఖాన్ని చేతులతో కడుక్కోవడం

మీరు మీ ముఖాన్ని పదే పడే కడుక్కోవడం వల్ల ముఖంలోని దుమ్ము కొంత వరకు పోతుంది. ముఖం శుభ్రంగా ఉందని మీకు అనిపించవచ్చు. కానీ ఐన మీరు మళ్ళీ కడుగుతూనే ఉంటారు. కానీ మీరు ముఖాన్ని పదే పదే కడుక్కోవడం వల్ల ముఖం మీద మొటిమలు వస్తాయి. ఎందుకంటే మీరు మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మంలో నీరు తగ్గిపోతుంది. మొటిమలు మరింత బాగా పెరుగుతాయి .

Exit mobile version