Site icon Chandamama

ఆస్తులు, అంతస్తులకి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వటలేదు ??

Reading Time: < 1 minute

జీవితంలో మనుషులు రెండే రెండు సార్లు మారుతారు. అది ఎప్పుడంటే !!ఆస్తులు, అంతస్తులు వచ్చినప్పుడు !! ఆస్తులు , అంతస్తలు కాదు మనిషికి కావాలిసింది. అనుబంధాలు, ఆత్మీయతలు . ఆస్తులు కరిగిపోయిన బ్రతకగలము . అనుబంధాలు దూరమైతే జీవించలేము. మీకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను , సహాయం చేసే వాళ్ళను ఎప్పుడు దూరం చేసుకోకండి. ఒకరితో బంధం అనేది మన చేతుల్లో ఎప్పుడు ఉండదు . ” ఒకరితో మన బంధం మంచిగా ఉంటే నిన్నటి గొడవలు నేటి సంబంధాలను గాయపరచలేవు “.


బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది అని మన పెద్ద వాళ్ళు చెప్తారు. దాని గురించి మాట్లాడుకుంటే దానిలో పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే . ఒక పొరపాటు జరిగితే మనము తెలుసుకొని మార్చుకోవాలి కానీ ..!! మొత్తం మన జీవితాన్నే నాశనం చేసుకోకూడదు. “సంబంధాలు ఎప్పుడూ మాములుగా చంప పడవు. ఒకరి చేసే పనులు అవి ఇంకొకరికి నచ్చవు. వారి ప్రవర్తన వలన మాత్రమే చంపబడతాయి” . నిన్ను భారం అనుకొనే మనుషులతో మీరు ఉండకండి. వాటికి దూరమైతేనె మీకు మంచిది. మీరు ఒంటిరిగా బ్రతకడమే అది మీకు సంతోషం. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో అంటే .ఒకరిపై ఇంకొకరు విపరీతంగా ప్రేమ చూపిస్తారు….అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేసేస్తారు. ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఇప్పటికైనా తెలుసుకోండి. ఆస్తులు , అంతస్తులు కాదు మనిషికి కావాలిసింది. ప్రేమ ఆప్యాయతలు .

Exit mobile version