ప్రాణ ” స్నేహితులు “

Friendship @pexels
Reading Time: 2 minutes

ప్రాణ స్నేహితులు

ఇద్దరు స్నేహితులు చాలా స్నేహంగా ఉండే వాళ్ళు . వాళ్ళు ఇద్దరు పేర్లు దేవ్, సత్య .ఐతే ఒక రోజు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంకో స్నేహితుడు రిషి వస్తాడు. దేవ్, సత్య చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదవుకున్నారు. ఇద్దరు ఎప్పుడు కలిసి మెలిసి ఉండే వాళ్ళు. ఒక రోజు సత్య తెలియక తప్పు చేస్తాడు. అప్పుడు స్కూల్ టీచర్ సత్య ని కర్ర తో కొడుతుంది. ఆ సమయం లో దేవ్ చూస్తూ అలానే ఉండి పోయాడు. స్కూల్ ఐపోయిన తరువాత దేవ్, సత్య చేయి పట్టుకొని ఈ విధంగా అడుగుతాడు. నిన్ను టీచర్ ఎందుకు కొట్టారో తెలుసా ? కనీసం నువు చేసిన తప్పు ఐన నీకు తెలుసా అని అడుగుతాడు. అవును నేను చేసింది తప్పే .నేను అలా చేసి ఉండకూడదు.


ఇంకెప్పుడు తప్పు చేయను అని దేవ్ కి మాట ఇస్తాడు.

Friendship

సత్య చేసిన చేసిన తప్పు ఏంటా అని ఆలోచిస్తున్నారా ? రిష సత్య దగ్గరికి దేవ్ గురించి చెడుగా చెప్తాడు. సత్య కోపం వచ్చి రిషిని బాగా కొడతాడు. రిషి వెళ్లి టీచర్ కి చెప్తాడు. టీచర్ ఇంకా సత్య ని కర్రతో కొట్టింది . అప్పుడు దేవ్ సత్య కి ఈ విధంగా చెప్తాడు . నా గురించి ఎంత మంది చెడుగా మాట్లాడితే అంత మందిని కొట్టుకుంటా వస్తావా ? అలా కొట్టడం తప్పు సత్య. ఎదుటి వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు , నీకు తప్పు అనిపిస్తే మొహం మీదే చెప్పాలి …నువ్వు మాట్లాడేది తప్పు అని. వినకపోతే రెండో సారి అర్థం అయ్యేలా చెప్పు. మూడోసారి వాళ్లే నీ దగ్గరికి మేము ఆ సమయంలో చేసింది తప్పే అని ఒప్పుకుంటారు.

Friendship

అలాగే మన ఇద్దరు స్నేహన్ని ఎవరు విడదీయలేరు. స్నేహ బంధాలకు కావాలిసింది నమ్మకం . అది మన స్నేహ బంధంలో కావలిసినంత ఉంది. కొన్ని స్నేహ బంధాలకు ఎప్పటికి తెగిపోవు. అందులో మన స్నేహ బంధం కూడా.

ప్రాణ స్నేహితులు మధ్యలో ఎవరు వెళ్లిన వాళ్లే మధ్యలో వెళ్లిపోవాలిసిందే !!!

Leave a Reply