పిల్లల తెలివి

పిల్లల తెలివి
Reading Time: 2 minutes

ఒక ఊరిలో ఒక చింత చెట్టు ఉంది. అక్కడికి ఆడుకోవడానికి రోజు చిన్న పిల్లలు చాలా మంది వస్తారు. అయితే అక్కడ ఒక రోజు వాళ్ళకి ఒక దొంగ కనిపిస్తాడు.చిన్నపిల్లలు దొంగ వున్నాడు అని చూసుకోకుండా వాళ్ళు చింతకాయల కోసం చూస్తూనే ఉంటారు.ఇంతలో దొంగే చిన్న పిల్లలను చూస్తాడు. హే పిల్లలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు.ఇది నా చెట్టు నా చింత కాయలను ఎవ్వరికి ఇవ్వను. దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి .లేదంటే మిమ్మల్ని అందరిని నాతో పాటు తీసుకెళ్తానని చిన్నపిల్లల అందరని భయపడతాడు.అయితే పిల్లలు ఆ దొంగని అస్సలు పట్టించుకోరు వాళ్లే ఆ దొంగకి బుద్ధి పిల్లలు ప్లాన్ చేసుకుంటారు.ఇంక దొంగ ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళి పోతాడు.



అయితే రెండు రోజు ఆ దొంగ కన్నా ముందే ఒక పిల్లవాడు చెట్టు మీద ఎక్కి దాక్కొని ఉంటాడు . ఆ దొంగ చెట్టు కింద పడుకుని ఉంటాడు.లేచిన తరువాత ఈరోజు పిల్లలు రాలేదులే,
పిల్లలు వచ్చేలోపు చింతకాయలను కోసుకుని అమ్ముకోవచ్చని అనుకుంటాడు.పిల్లలు ఉంటే కోసుకొనివ్వరు అని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాడు. అతనికి ఈ విషయం తెలియదు ఒక పిల్లవాడు చెట్టు మీద దాక్కొని ఉన్నాడు అని.చింత కాయలు కోయడానికి కర్ర తీసుకొని సిద్ధంగా ఉంటాడు . మొదటి సారి కర్ర పట్టుకొని కొట్టినప్పుడు యపిల్ పండు కింద పడుతుంది. ఐతే ఆ దొంగ భయపడతాడు. రెండోసారి మళ్ళీ కొడతాడు ఈ సారి సపోటా కింద పడుతుంది. పట్టించుకోకుండా మూడో సారి కర్ర పట్టుకొని కొట్టినప్పుడు పిల్లవాడు చింతకాయలు విసురుతాడు . అప్పుడు దొంగ మొహంలో చిరునవ్వు వస్తుంది. చింత కాయను ఏరుకునే లోపు పిల్లలు అందరూ చెట్టు దగ్గరకి వచ్చి దొంగను బాగా కొడతారు.


ఆ తరువాత పిల్లలు ఈ విధంగా చెప్తారు. నీకు మూడు అవకాశాలు ఇచ్చాము నీ తప్పు నువ్వు తెలుసుకోవాలని, ఐన నువ్వు మారలేదు. తెలుసుకోలేదు. ఒకసారి యాపిల్ పండు విసిరాము ,నువు భయపడి పారిపోవాలని, రెండోసారి సపోటా విసిరాము అప్పుడైన ఇది ఏంటి అని తెలుసుకుంటావని, ఐన తెలుసుకోలేదు.


మూడో సారి కావాలనే చింత కాయలను కింద పడేసాము. నీ బుద్ది మాత్రం మారలేదు. అందుకే నిన్ను బాగా కొట్టాము.ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మారు అని పిల్లలు చెప్తారు. అప్పుడు దొంగ మీకు ఉన్న బుద్ధి కూడా నాకు లేదు. నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటాడు .పిల్లలు ఇంకా ఆ దొంగని మంచి మనిషిగా మారుస్తారు.


తప్పు చేసేటప్పుడు తప్పు అని తెలిసిన తరువాత ఇంక చేయకండి. ఎందుకంటే ఆ తరువాత ఎంత దాచిన దాగదు.

Leave a Reply