బంధాలు అవే తెగిపోవు ?? తెగింప బడతాయి. ఈ రోజుల్లో అందరికి బాగా అలవాటు ఐపోయినది వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడటం, నచ్చనప్పుడు మాట్లాడకుండా ఉండటం జరుగుతుంది. వాళ్ళకే చెప్తున్న.. మీరు వేరే వాళ్ళని బాధ పెట్టె ముందు మీకు కూడా అలాంటి బాధలు వస్తాయని అని మాత్రం మర్చిపోకండి. ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కొంతమంది మిమ్మల్ని ద్వేషించుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి కూడా బాధ పడకండి. కొన్ని మనము మార్చుకుంటే సరిపోతుంది. వాటిలో మీకు ఉన్న కొన్ని అలవాట్ల వల్లే ఇతరులు మిమ్మల్ని ఇష్టపడకపోవటానికి కారణమవుతాయని మీకు తెలుసా? ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకోండి…
1) సెల్ ఫోన్ వాడకం
మీరు ఎవరితో ఫోన్ లో మాట్లాడటం ప్రారంభించినప్పుడు, మీకు అవతలి వారి మాటలపై ఏదైనా విషయంలో కోపం వస్తే, వారు కోపంగా మాట్లాడిన సమయంలో మీరు కూడా అలాగే మాట్లాడితే, ఇతరులు కూడా మీపై కోపం తెచ్చుకుంటారు.కొంత మంది ఫోన్ లో మునిగిపోయి ఫోన్ లో మాట్లాడతారు. అలాంటి వాళ్ళు పక్కన పిలుస్తున్నా పట్టించుకోరు. కారణం ఏమైనప్పటికీ, ఇలా చేయడం వల్ల ఇతరులకు మీపై గౌరవం తగ్గిపోతుంది. ఆశ్చర్యకరంగా అగౌరవం పెరుగుతుంది. కానీ మీరు శత్రువులను గౌరవిస్తే మాత్రం వారు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు.
2)క్లారిటీ లేకుండా ఉండటం
మీరు ఏదైనా విషయం గురించి ఇతరులతో చర్చించే సమయంలో మీరు క్లారిటీ లేకుండా ఉంటే, మీ అభిప్రాయాన్ని ఎవ్వరూ గౌరవించరు. చాలా మంది ఏమి మాట్లాడతారో కూడా వాళ్ళకే తెలియదు. అంటే క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. దీని వల్ల ఎదుటి వాళ్ళ దగ్గర నమ్మకాన్ని కోల్పోతారు.ఎందుకంటే ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీరు ఎప్పుడైతే క్లారిటీగా ఉంటారో అప్పుడే మీ మాటను ఇతరులు గౌరవిస్తారు. మీ మాటలను వింటారు. అయితే ఇతరులు చెప్పే దానిలో ప్రతిది ఆలోచించాలిసిన అవసరం లేదు. కానీ మీరు ఎదుటి వాళ్ళ మాటలను వినడం మంచిది. ఇలా చేయకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఇష్టపడరు.
3) గాసిప్స్
మీరు తరచుగా పుకార్లను, గాసిప్స్ ని అందరికి అస్తమానం చెప్తూ ఉంటే అది మీకు మంచిది కాదు. మీరు వేరే వాళ్ళ గురించి ఎలా చెప్తారో?? వాళ్ళు కూడా మీ గురించి అలానే చెప్తారని మర్చిపోకండి. గాసిప్స్ కు కూడా ఒక పరిమితి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పరువు మీరే పొగిట్టుకోవాలిసి వస్తుంది. పెద్దవారు అయితే వాటి గురించి కొంత ఆలోచించి మాట్లాడతారు. మిగిలిన వ్యక్తులు ఇలాంటి సంఘటనలను చాలా కోపంగా తీసుకుంటారు. అందుకే మీరు ఇతరుల గురించి గాసిప్స్ చెప్పడం వల్ల కూడా మిమ్మల్ని ద్వేషిస్తారని మాత్రం మర్చిపోకండి.