Site icon Chandamama

” ప్రేమ” కంటే ” జీవితం” గొప్పది

” ప్రేమ” కంటే ” జీవితం” గొప్పది
Reading Time: 1 minute

మర్చిపోవటం అనేది ఒక విషం లాంటిది. ఈ మర్చిపోవటం ఎంతటి మనిషిని ఐన క్రుంగతీస్తుంది. చాలామంది అమ్మాయిలు , అబ్బాయిలు కు కూడా ఇది చాలా కష్టంగా ఉంటుంది. కానీ కష్టం గా ఉన్నా కూడా అలవాటు చేసుకుంటే మీ జీవితం బావుంటుంది. ప్రేమ వల్లే చాలామంది జీవితాలు పాడుచేసుకుంటున్నారు. ప్రేమ మనిషిని క్రుంగ తీస్తుంది. కాబట్టి ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండండి. నేను వాళ్ళకి చెప్పపానుకున్నది ఒక్కటే. ప్రేమ ఒక్కటే కాదు గొప్పది.. ప్రేమ కంటే జీవితం గొప్పది.ముందు మనము ఇది తెలుసుకోవాలి. అలాగే అమ్మానాన్న లను గౌరవించాలి. ఈ ప్రపంచంలో… ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు. ఒక్క అమ్మానాన్న ని కోల్పోతే ఇంకో జన్మ ఎత్తాలిసిందే.కాబట్టి మీ అమ్మానాన్నలను బాధ పెట్టకండి. మీరు వాళ్ళని సుఖ పెట్టకపోయినా పర్వాలేదు. వాళ్ళ కళ్ళల్లో బాధను మాత్రం ఎప్పటికి రానివ్వకండి.



ప్రేమ లో గెలవచ్చు .లేదా ఓడిపోవచ్చు.అదే ప్రేమలో ఓడిపోతే జీవితంతో రాజీ పడటం తప్ప చేసేది ఏమి లేదు.” ప్రేమ” అంటే రెండు మనసులు కలిసి చేసే ప్రయాణం . రెండు మనసులు కలిసి , రెండు వేరు వేరు ప్రపంచాలని దగ్గరగా చేస్తాయి. అలాగే ఒకరినొకరు తెలుసుకోవడం లో నే అంతా ఉంటుంది.ప్రేమ మీద సినిమాలు, పాటలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.దీని బట్టి అర్థం అవుతుంది . ప్రేమ ఎంత గొప్పదో. ” ప్రేమ ” అంటే అర్థం ,’ ప్రే ‘ అంటే ప్రేమించి , ‘మ’ అంటే మనసును గెలుచుకోవడం. ప్రేమించి మనసును గెల్చుకోవడం. దానికోసం ఏమైనా చేసేలా ఉండాలి కానీ ప్రేమించిన వాళ్ళని బాధ పెట్ట కూడదు.




ఎంత ప్రేమ ఉంటే అంత ప్రేమను మీరు ప్రేమించిన వాళ్ళకి తెలియబరుస్తూ ఉండండి.దీని వల్ల ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ విలువ తెలుస్తుంది. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం చేసుకొని ఉండాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎవరికి దొరకదు. మీరు ప్రేమించిన వాళ్లకోసం మీరు ఏమైనా చేసేలా ఉండండి.కాబట్టి అమ్మానాన్న ల ను బాధ పెట్టకండి. మనము వాళ్ళని గౌరవించాలి. మనము వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తామో అంత పైకి వస్తాము. దేని మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. తరువాత బాధ పడాలిసి వస్తుంది.

Exit mobile version