చికెన్ డ్రమ్ స్టిక్స్

చికెన్ డ్రమ్ స్టిక్స్
Reading Time: < 1 minute

చికెన్ డ్రమ్ స్టిక్స్

ఆదివారం వస్తుందంటే చాలు చాలా మంది చికెన్ కోసం వేచి చూస్తా ఉంటారు. చికెన్ తో కర్రీ ఒక్కటే కాదు అండి. ఇంకా చాలా కొత్త కొత్త వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఐతే చాలా మందికి ఎలా చేయాలో తెలియదు. కొంత మంది యూట్యూబ్ లో చూసి చేస్తూ ఉంటారు. మరి కొంత మంది ఫోన్ పట్టుకొని గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి అంత కష్ట పడకండి. వాటిలో వాడేవి తెలుసుకుంటే మనము కూడా తేలికగా చేసుకోవచ్చు.ఇప్పుడు చికెన్ తో కొత్తగా ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారా ?? తేలికగా చేసుకొని తినే వంటకం చికెన్ డ్రమ్ స్టిక్స్ అండి . దీనికి కావలిసిన పదార్థాలు , తయారు చేసే విధానము తెలుసుకుందాము.



కావలిసిన పదార్థాలు :-

చికెన్ లెగ్స్ – 5,
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్లు,
ధనియాల పొడి -1 టేబుల్ స్పూన్,
బియ్యపు పిండి – 1 టేబుల్ స్పూన్,
కారం – 1 టేబుల్ స్పూన్,
శెనగపిండి – 1 టేబుల్ స్పూన్,
పెరుగు – 1 టేబుల్ స్పూన్,
ఉప్పు – సరిపడినంత వేసుకుంటే చాలు,
నూనె – 250 గ్రా,
మసాలా – 1 టీ స్పూన్,
పసుపు – చిటికెడు తీసుకుంటే సరిపోతుంది.


తయారీ విధానం :-

ఒక గిన్నె తీసుకొని , దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్ ,ధనియాల పొడి ,శెనగపిండి, కారం,పెరుగు, బియ్యపు పిండి,మసాలా, ఉప్పు, పసుపు వేసి, దానిలో కొద్దిగా నీళ్లు పోసి వాటిని బాగా కలుపు కోవాలి. తరువాత చికెన్ లెగ్ ముక్కలను తీసుకొని లైట్ గా కట్ చేసినట్టు చాకుతో గీతలా కట్ చేయండి చాకుతో. తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్ లెగ్ ముక్కలకు బాగా పట్టించి గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత నాన్ స్టిక్ పెనం లో మసాలా వేసి చికెన్ లెగ్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. అంతే ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ.

Leave a Reply