జీవితం అంటే ఏంటి? మనము ఎందు కోసం బ్రతుకుతున్నాము? దేనికోసం ఈ భూమి మీద ఉన్నాము అని కొంచం కూడా లేదు. చాలా మంది ప్రేమే జీవితం అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఒక అనుభూతి మాత్రమే. ఈ రోజుల్లో ప్రేమ అనే మాట మనము చాలా చోట్ల వింటూనే ఉంటున్నాము. దీని వల్ల మనం కొంతమంది బాధ పడతారు. దకొంత మంది ప్రాణాలను తీస్తున్నారు, ఇంకా కొంత మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ, వాళ్ళ ప్రాణాలను తియ్యకూడదు అండి.ఒకటి మాత్రం నిజం.నిజమైన ప్రేమ ఎవరికి అంత సులభంగా దొరకదు.మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టమే ..కానీ అంతకన్నా ముందు మనము మన అమ్మానాన్న లను హ్యాపీ గా చూసుకోవాలి. వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు.వాళ్ళని బాధ పెట్టె హక్కు కూడా మనకి లేదు. మనకి అమ్మా నాన్నల తరువాత ఎవరైనా . అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి.
చాలామంది గొడవలు పడుతుంటారు. అస్సలు గొడవలు పడటం వల్ల ఏమి వస్తుంది అంది. వాళ్ళని దూరం చేసుకోవడక్ తప్ప. గొడవలు పడటం, పడకపోవడం అది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. గొడవలు పడేటప్పుడు చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తారు. ఒకటి గుర్తు పెట్టుకోండి. తప్పు ఎవరిది ? ఎవరి వైపు ఉంది ..అని తెలుసుకొని మాట్లాడండి.అలాగే ప్రతి సమస్యకు ఎక్కడో ఒక చోట పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. పరిష్కరించకుండా చాలా మంది తప్పులు చేస్తుంటారు. దయచేసి గొడవలు పడకండి. పెద్ద పెద్ద గొడవలు పడి మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. గొడవలు పడిన వెంటనే మాట్లాడి పరిష్కరించకోండి.
అన్నింటి కన్నా జీవితం చాలా గొప్పది . జీవితం విలువ తెలిసిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు. ప్రేమ లో గెలిచే వాళ్ళు ఉంటారు…కదానటలేదు , ప్రేమను పోగొట్టుకొని జీవితంలో గెలిచే వాళ్ళు ఉంటారు.. ప్రేమ పోయినంత మాత్రాన మీ జీవితం ఎక్కడికి పోదు. ఇది దేవుడి ఇచ్చిన జన్మ .దానిని మధ్య లొనే నాశనం చేసుకోకండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరే మార్చుకోవాలి. మార్చుకోవాలిసిన అవసరం కూడా మీకే ఉంటుంది.