చెట్లను కాపాడుకుందాము !!

చెట్లను కాపాడుకుందాము !!
Reading Time: 2 minutes

వేసవికాలంలో మనిషికి ఆక్సిజన్ చాలా అవసరం. ఎండలు ఎక్కువగా వచ్చే సమయం ఇదే.ఒక మనిషి ఆహారం తీసుకోకపోయిన కొన్ని గంటలు పాటు ఉండగలరు. కానీ ఆక్సిజన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఆక్సిజన్ కావాలంటే చెట్లు ను పెంచాలి. మనుషులు ఏమో చెట్లను నరికేస్తున్నారు.అలా నరుక్కుంటూ పోతే ముందు ముందు మనకి ఆక్సిజన్ కూడా కరువు అవుతుంది.కాబట్టి చెట్లను నరక కండి. ఒక చెట్టు మాత్రమే మనిషికి అన్ని విధాలుగా సహాయపడగలదు. ఎలా అంటే మీకు ఆకలి వేసినప్పుడు పండ్లు అవుతాయి. దాహం వేసినప్పుడు కొబ్బరి బోండ రూపంలో మీ దాహాన్ని తీరుస్తాయి. మీరు అలిసిపోయినప్పుడు అమ్మ లా చెట్టు మీకు నీడనిస్తుంది. చెట్టు నేను నీకు నీడ ఇవ్వను వెళ్లిపో అని ఎప్పుడు అనదు. ఒక చెట్టు మనిషికి చేసే మేలు ఎవరు కూడా చేయలేరు ఏమో !!


దేవుడు చెట్టుకి కూడా మాటలు ఇచ్చి ఉంటే బావుండేది. మనుషులందరికి తన ఆవేదనంతా చెప్పుకొనేది. (చెట్టు యొక్క ఆవేదన ఓ మనిషి నేనేమి పాపం చేశాను.నన్ను నరికేస్తున్నారు.) చెట్టు మనకి సహాయం చేస్తుంటే మనము ఏమో జాలి కూడా పడకుండా నరకేస్తున్నాము.
పూర్వ కాలంలో అశోకుడు నాటించిన చెట్లు వలన ఇప్పుడు ఎంత ఉపయోగం ఉందో తెలుసా !! మనము బయటికి వెళ్ళినప్పుడు రహదారి పక్కన మనల్ని ప్రతి యొక్క ఆక్సిజన్ తో పలకరిస్తూనే ఉంటాయి.మరి అలాంటి చెట్లను మనము ఏమి చేస్తున్నాము ?? ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు.మీరు వాటికి నీళ్ళు పోయక పోయిన పర్వాలేదు. మీరు వాటిని అలానే బ్రతకనిస్తే చాలు. చెట్లను నరికేస్తే మనకే నష్టం. చెట్లకి ఏమి కాదు. మనిషి ప్రతిది స్వార్ధంగా ఆలోచించ కూడదు. మనిషి సొమ్ము చేసుకోవడానికి చెట్ల ప్రాణాలను తీసి వేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించు .చెట్ల వల్ల నువ్వు ఎంత లాభం పొందుతున్నావో ? అప్పుడు నీకె అర్థం అవుతుంది.



ఏ నిముషం లో ఏమి జరుగుతుందో కూడా మనకి కూడా తెలియదు. ఎందుకంటే అది భగవంతుని చేతిలో ఉంటుంది కాబట్టి. ఉన్నంత కాలం ఐన మంచి మనిషిలా బ్రతుకుదాము .ఒక చెట్టును పెంచుకోండి. మన ఇంట్లో అమ్మ మన కోసము ఎంత కష్ట పడుతుందో అలాగే చెట్టు కూడా మన కోసం అంతే కష్ట పడుతుంది. ఇప్పటినుంచి ఐన చెట్లను నరకడం ఆపేసి, మన ప్రాణాలను మనమే కాపాడుకొందాము. వాటిని స్వేచ్ఛగా బ్రతనివ్వండి.
మనము ఒక చెట్టును నాటి, మనము బ్రతుకుతూ వాటిని కూడా బ్రతకనిద్దాము.




Leave a Reply