Site icon Chandamama

విలువైన ” స్నేహ బంధం “

Reading Time: 2 minutes

స్నేహం అనేది ఒక అందమైన రహదారి లాంటిది. రహదారి మీద మనము వెళ్ళే కొద్ది మనకు కొత్త కొత్త చెట్లు ఎలా కనిపిస్తాయో , అలాగే మన జీవితంలో కూడా మనము ముందుకు వెళ్ళే కొద్ది కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. మన స్నేహితుల్లో చిన్న నాటి స్నేహితులు, మరియు మనము చదువుకున్న కళాశాలో స్నేహితులు ఎక్కువుగా ఉంటారు. అన్ని బంధాలలో చాలా గట్టి బంధం ” స్నేహ బంధం ” . మనము ఒక్కసారి చేయి పట్టుకుంటే అంత సామాన్యంగా విడిచిపెట్టలేము. అది స్నేహానికి ఉన్న శక్తి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి యొక్క మనిషికి స్నేహితులు ఉంటారు. అసలు స్నేహితులు లేకుండా ఎవరు ఉండరు. కొంతమంది ఇంట్లో చెప్పుకోలేని బాధలు కూడా స్నేహితులు దగ్గర చెప్పుకుంటారు. అలా చెప్పుకున్నారు అంటే మీరు
మంచి స్నేహితులను పొందినట్లే .


మనము బాధ పడే కొద్ది బాధలే వస్తాయి. అలా కాకుండా మీరు మీ స్నేహితులతో పంచుకుంటే కొంచం తగ్గుతాయి. బాధలు లేని మనుషులే ఉండరు. బాధలు అన్నాక మనుషులకే వస్తాయి. అంత మాత్రాన మీరు మరి బాధ పడిపోకండి. ఆ దేవుడు బాధలను పంచుకోమనే స్నేహితులను ఇచ్చాడు. నమ్మకంగా ఉన్న వారి దగ్గర ఏమైనా చెప్పుకోవచ్చు. అప నమ్మకం ఉన్న చోట ఏమి చెప్పిన మనలనే పిచ్చి వాళ్ళను చేస్తారు. ఈ లోకంలో చాలా మంది గెలిచే వాళ్ళ వైపే నిలబడుతారు. గెలిచే వాళ్ళ వైపు నువ్వు ఉండటం కాదు. ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళ పక్కన నిలబడి చూడు తెలుస్తుంది. మనము తలచుకుంటే డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ మంచి స్నేహితులను సంపాదించుకోలేము. మంచి మనసుతో మాత్రమే సంపాదించుకోగలము.


స్నేహ బంధం లో ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా అవి ఏమి పట్టించుకోరు. తిరిగి మళ్ళీ మాట్లాడుకుంటారు . మిమ్మల్ని బాగా నమ్మే స్నేహితులను మోసం చేయకండి. ఎందుకంటే మీరు మోసం చేస్తున్నారనే అనుమానం వచ్చిన వాళ్ళు తట్టుకోలేరు. నా, మా అనుకొనే స్నేహితులకు మీరు ఎప్పుడు తోడుగా ఉండండి.ఈ స్నేహం అనేది మన జీవితంలో ఒక భాగం. మిమ్మల్ని ఇష్టపడే స్నేహితులను ఎప్పుడు బాధ పెట్టకండి. వారిని సంతోషంగా ఉంచండి. ఎందుకంటే మీ కంట్లో నుంచి ఒక్క బొట్టు కన్నీరు వచ్చిన వాళ్ళు చూసి బాధ పడతారు. స్నేహం విలువ తెలుసుకోవాలి. అప్పుడే ఆ బంధం గట్టి పడుతుంది.

Exit mobile version