సమయం అంటే జీవితం లాంటిది. ఎందుకంటే నిన్న ఐపోయిన సమయాన్ని , నిన్నటి రోజును ఎం చేసిన వెనక్కి తిరిగి తీసుకురాలేము. జీవితంలో కొన్ని రోజులు కూడా అంతే. మనము గుర్తు చేసుకున్నప్పుడు మనలని పలకరించి వెళ్తాయి. కాల జ్ఞానాన్ని ఎప్పుడో ఆ బ్రహ్మం గారు రాసారు.
ఈ రోజుల్లో మనుషులు వాళ్ళ సమయాన్ని సంపాదన మీద పెట్టారు.వాళ్ళ సంపాదన ఎలా ఉంది అంటే తినే తిండి కూడా మర్చిపోయేంత. సమయానికి తినరు .మళ్ళీ ఏ రోగాలు రాకూడదు. ఇలా ఐతే రోగాలు రాక ఏమి వస్తాయి. మీ సమయాన్ని తినటానికి కూడా ఇవ్వండి.
మనిషి ఎంత డబ్బు సంపాదించిన అవి ఏమి తినలేరు. వాటిలో అన్నం మాత్రమే తినగలరు. ఇంకేమి తినలేరు.సంపాదన కూడా తిండి కోసమే అని ఇంకా తెలుసుకోలేక పోతున్నారు. కొంతమంది మనుషులు తిండి కూడా సరిగా తినకుండా పనిచేస్తూనే ఉంటారు .
వాళ్ళు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. పని చేయాలి …కానీ ప్రాణం మీదకి వచ్చేలా కాదు అండి. బ్రతకడానికి ఎదో ఒక పని చేయాలి. మీరు చేసే పని కూడా మీ పొట్ట కూటి కోసమే కదా. మీరు పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది అన్న వాళ్ళు ఏ పనైన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మీద మీ కుటుంభం ఆధారపడి ఉంది కాబట్టి.ఇప్పుడు బయట పరిస్థితులు బాగా లేవు కాబట్టి ఇంట్లో ఉండి సమయానికి భోజనం తీసుకోండి.
ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎంత సంపాదిస్తారో…అంత తరువాత ఖర్చు పెట్టాలిసిందే కదా. ఏ పని ఐన ఉరుకులు పరుగులు పెట్టకుండా నెమ్మదిగా చేసుకోండి. మీరు పరుగులు పెట్టినంత మాత్రన మీరు చేసే పనులు అలాగే జరుగుతాయి కదా. మనిషి శాంతంగా ఉండి ఆలోచించాలి. ప్రతి యొక్క మనిషి తనని తాను జీవితానికి అంకితం చేయాలి. మీ జీవితాలను మీరే మలచుకోవాలి.