గెలుపు , ఓటమి లు రెండు మనకు రెండు కళ్ళు లాంటివి.మనిషి జీవితంలో గెలుపు ,ఓటములు రెండు ఉంటాయి. అవే మనిషి ఎదగడానికి కారణం అవుతాయి. జీవితంలో ఏది సాధించాలి అన్నా ముందు ఓపికగా ఉండటం చాలా అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ” ఓటమి ” నీ రాత కాదు ,” గెలుపు ” ఇంకొకరి సొత్తు కాదు. గెలకవకపోవడం ఓటమి కాదు మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి .
గెలుపు ” సాధించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము… గెలుపు అంటే వినడానికి, చూడటానికి , గెలిచినప్పుడు ఆనందించడానికి మాత్రమే బావుంటుంది. గెలిచే వారి ఆలోచన ఎప్పుడు గెలుపు పై నే ఉంటుంది. గెలిస్తే పొగరు నెత్తికెక్కుతుంది. గెలుపు కు బలుపెక్కువ. అణిగి మణిగి అస్సలు ఉండలేదు. గెలిచిన దగ్గర నుంచి ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతునే ఉంటుంది.
గెలిస్తే గెలుపునొకటే చూస్తావ్… ఓడితే ఎందుకు ఒడిపోయావో, ఏం చేస్తే గెలుస్తావో రెండు చూస్తావ్..!! కాబట్టి గెలుచానని ఆరాట పడకు …ఓడానని నిరాశపడకు.గెలుపు కన్నా ఓటమి తో నే ఎక్కువ స్నేహం చేయండి. ఎందుకంటే ఓటమి మనల్ని మార్చి గెలుపు దగ్గరికి పంపిస్తుంది.
1) ఓటమి ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించి పోతుంది , ఆ గెలుపు దానికే అంత విలువ ఉంటే
నీకు తనంటే ఇష్టం లేదని తెలిసినా ఎప్పుడూ నీ పక్కనే ఉంటూ నీకిష్టమైన గెలుపు ను తెస్తా అని హమినిచ్చే ఓటమికి ఎంత విలువుండాలి . మన లో మన యొక్క గుణం బయట పడాలి అంటే ” గెలుపు” కావాలి. కానీ గెలిచామని అది నెత్తికెక్కించుకోకండి
2) “గెలుపు”మనదని పొంగి పోతాము. కానీ అది కాలనిది అది అర్థం చేసుకోండి. గెలుపు కోసం ఆరాట పడుతూ పోరాటం చేయాలి తప్పదు.
చేరే గమ్యం ఎంత దూరం ఉన్నా , నీకు మాత్రం ” గెలుపు ” ఒక్కటే కనిపించాలి…గమ్యం చేరే వరకు అలిసిపోకు..ఎంత ఓర్పు ఉంటే అంత నేర్పు ..ఓర్పు నేర్పుల తో గెలుపు ఉంటుంది.
3) బయటున్నా ప్రపంచానికి సమాధానం ఇచ్చినంత మాత్రాన నువ్వు గెలుచనట్లు కాదు … నీ లోపలున్న నీ ప్రపంచానికి సమాధానం చెప్పుకోకలిగినప్పుడే నువ్వు గెలుచనట్లు .
4) గెలుపు అంటే ఎవరో ఇచ్చే బహుమతి కాదు. ఆటలో ఒకడు గెలవాలి అంటే పోటీదారులందర్ని ఓడించాలి ! కాని జీవితంలో లో ఒకడు గెలవాలి అంటే తోటివారందర్ని ప్రేమించాలి. ఒకోసారి మన గెలుపు పరాజయంతో ప్రారంభమవుతుంది.
5) గెలుపు ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది . ఓటమి నీకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది . కొన్నిసార్లు సార్లు వెలుగు కోసం చీకటిలో బ్రతకాలి …అది పగలు కోసం రాత్రిలో ఐనా ,లేదా గెలుపు అనే వెలుగు కోసం ఓటమి అనే చీకటిలో ఐనా ..!!
6) గమనం గెలుపు కాదు ,గతం ఓటమి కాదు గతగమనాలు జంటపదాలు ,గతం లేనిదే గమనం లేదు . ఓటమి రానిదే గెలుపు రాదు ,ఏది శాశ్వతం కాదు , ఏది పరిమితం కాదు.
” జీవితం “ఒక పోరాటం . గెలుపు ఓటమికి మధ్య పోరాటం . అంతులేని ఈ పోరాటం లో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయిస్తుంది.