Site icon Chandamama

సరిహద్దుల్లో సైన్యం ఉండడం వలనే

Reading Time: 3 minutes

కాశ్మీర్ లో ఐదుగురు సైనికులు మరణించారు, ఐదుగురు తీవ్రవాదులు చనిపోయారు అని ఎక్కడో ఒక మూలన వార్తా పత్రికలలో వ్రాసే సంఘటనల వెనుక ఉన్న అసలు విషయాలు తెలుసుకోవాలి అంటే ఇది పూర్తిగా చదవండి……

వాళ్ళు కూడా మనలాగే నెల జీతగాళ్లే కదా… ఏదో నెల తిరిగితే జీతం వస్తుంది అనుకికుండా తెలిసి మరీ తమ ప్రాణాలను మనకోసం బలి ఇచ్చారు.. అపార ప్రాణనష్టాన్ని ఆపగలిగారు…

Army – pexels.com

కాశ్మీరులో ముఖాముఖి పోరాటంలో అసువులు బాసిన 5 గురు అమర జవాన్లు

ఒక పక్క దేశం మొత్తం COVID 19 మీద యుద్ధం చేస్తుంటే మరో వైపు పాకిస్థాన్ తన కోవర్ట్ ఆపరేషన్స్ ని ఆపలేదు.

పత్రికలు,ఎలక్రానిక్ మీడియా అదో రోజువారీ కార్యక్రమంలాగా సహద్దుల్లో నలుగురు తీవ్రవాదులు ఎంకౌంటర్ లో మరణించారు అంటూ ఓ మూల చిన్న కాలం తో సరిపెట్టేశాయి.

కానీ జరిగింది చిన్న సంఘటన ఏమీ కాదు. రక్షణ పరంగా చాలా కీలకమయిన ప్రదేశంలో జరిగిన యుద్ధం.!!

ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. చనిపోయింది అయిదుగురు తీవ్రవాదులు, అయిదుగురు సైనికులు కానీ అది జరిగిన తీరు తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

కేరన్ ఒక చిన్న గ్రామం. LOC వద్ద జమ్మూ కాశ్మీర్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వేరుచేస్తూ ప్రవహించే కృషన్ గంగా నది ఒడ్డున ఉంటుంది. ఉత్తర కాశ్మర్ లోని కుప్వారా జిల్లాలో ఉంది.

సైన్యం దీని కేరన్ సెక్టార్ అని పిలుస్తుంది. చాలా టఫ్ టేర్రైన్. కొండలు,గుట్టలతో నిండి ఉంటుంది. ఏప్రిల్ నెలలో కూడా మంచు కురుస్తూ ఉంటుంది.

చాలా ప్రాంతం నడవడానికి కూడా వీలులేనంత కష్టంగా ఉంటుంది.
బాగా శిక్షణ పొందిన సైనికులు కూడా గంటకి 250 మీట ర్ల కంటే ఎక్కువ దూరం నడవలేరు అంటే గంటకి పావు కిలోమీటర్ దూరం నడవగలరు. అదే కాంబాటింగ్ గేర్ తో అయితే ఇంకా తక్కువ దూరం మాత్రమే వెళ్లగలరు.

1990 నుండి పాకిస్తాన్ సైన్యానికి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో చాలా ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగిన ప్రదేశంగా గుర్తింపు ఉంది కేరన్ కి.

సైన్యం ఈ ప్రాంతాన్ని ఫ్లాష్ పాయింట్ గా పిలుస్తుంది. కాశ్మీర్ లో చొరబడడానికి పాకిస్థాన్ ఈ ప్రాంతాన్నే ఎక్కువసార్లు వాడుకుంటూ వస్తున్నది ఎందుకంటే ఎంత కాపలా కాసినా ఏదో విధంగా కళ్లుకప్పి చొరబడడానికి అనువుగా ఉంటుంది పైగా సరిహద్దు పొడువునా భారత సైన్యం కాపలా కాయలేదు.

అందుకే కొన్ని చోట్ల ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకున్న థెర్మల్ ఇమేజింగ్ రాడార్స్ ని పెట్టారు.

ఏప్రిల్ 1వ తేదీ అర్ధ రాత్రి కేరన్ సెక్టార్ లో థెర్మల్ ఇమేజింగ్ రాడార్లు తీవ్రవాదుల కదిలకలని రికార్డ్ చేశాయి. అప్ర మత్తమయిన సైన్యం అదే ప్రాంతంలో ఉన్న infantry యూనిట్ [8th Battalion of The JAT Regiment] తో గాలింపు మొదలు పెట్టింది…..

from Pexels.com

ఏప్రిల్ 2,3, తారీఖుల్లో జరిపిన గాలింపు వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో 4th పారా స్పెషల్ ఫోర్స్ ని [4th PARA SF] ని రంగంలోకి దించింది.

దీనిని ‘డ్రాగర్స్ ‘[nick-named as “Draggers”] అని పిలుస్తారు. ఇద్దరు SF కమాండోస్ ని, సహాయుకులుగా ముగ్గురు పారాట్రూర్లని హెలికాప్టర్ ద్వారా మొదట తీవ్రవాదులని ట్రెస్ చేసిన ప్రాంతంలో దించారు.

మంచువల్ల పడిన పాదముద్రలని మొదట గుర్తించారు. వాటిని అనుసరిస్తూ ఒక కొండమీదకి చేరుకున్నారు. కొండ అంచు మీద [అప్పటికే మంచు కురిసి అది గట్టి పడిపోయింది ] కి చేరుకున్నారు.

SF కమాండోస్ ఉన్న కొండకి ఎదురుగా మరో కొండ ఉన్నది రెండిటిమధ్య నిలువుగా లోయ ఉన్నది. మంచు వల్ల ఎక్కువ దూరం చూడలేకపోతున్నారు వెంటనే తమ వద్ద నున్న థెర్మల్ బైనాక్యులర్స్ తో ఆ ప్రాంతం వెతకడం మొదలు పెట్టారు.

మంచు గట్టిపడిన ప్రదేశంలో అడుగులు వేయడంవల్ల ముగ్గురు కమాండోస్ మంచు గడ్డ విరగడం వలన కిందనున్న లోయలోకి పడిపోయారు.

SF కమాండోస్ పడ్డ చోటనే 5 పాకిస్థాన్ తీవ్రవాదులు నక్కి ఉన్నారు…..హఠాత్ పరిణామానికి బిత్తరపోయి తమ వద్దనున్న AK 47 తో కాల్పులు జరపాలని ప్రయత్నించారు కానీ అందరూ దగ్గరగా ఉండడంతో వీలుపడక రైఫిల్ బొనేట్ తో ఒకరినొకరు ముఖాముఖి తలపడ్డారు . బ్యానెట్ తో పోరాడుతూ ఒకర్నొకరు పొడుచుకోవడం మొదలుపెట్టారు.

కొండపై ఉన్న మిగిలిన ఇద్దరు కింద అలజడిని గమనించి ఏదో జరుగుతున్నదని గ్రహించి వెంటనే లోయలోకి దూకేశారు.

అయిదుగురు తీవ్రవాదులు, అయిదుగురు కమాండోలు ఒకరికొకరు ఎదురుపడి ముఖాముఖీ తలబడి రైఫిల్ బొనెట్స్ తో ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు.

ఇద్దరు పారా ట్రూపర్లు తీవ్ర గాయాలతో 92 Base Hospital at Srinagar లో రెండురోజుల తరువాత మరణించారు.

హాస్పిటల్ లో చనిపోయిన ఇద్దరు పారాట్రూపర్లు ఆపరేషన్ ఎలా మొదలయ్యి ఎలా ముగిసిందో అధికారులతో చెప్పారు.

బుల్లెట్స్ తగిలి అప్పటికప్పుడు ప్రాణం పోవడం వేరు కానీ హెడ్ to హెడ్ ఫైట్ లో రైఫిల్ బొనెట్స్ తో ముఖాముఖి తలపడి పొడుచుకొని రక్తస్రావం అవుతూ బాధతో కుప్ప కూలి తమని తీసుకెళ్లడానికి సైన్యం వస్తుందని ఆశతో…. బాధతో…. చనిపోవడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.

ఎత్తైన కొండ మీద నుండి లోయలోకి పడి ఎదురుగా ఆయుధాలతో తీవ్రవాదులు ఉండడం కాళ్ళు చేతులు విరిగినా వీరోచితంగా పొరాడి అయిదుగు తీవ్రవాదులని చంపి తాము చనిపోయారు మన కమాండోస్.

ఒక కమాండో శవం తన ఆయుధాలతో సహా రక్తం గడ్డకట్టిన మరకలతో మరో తీవ్రవాది మీద పడి ఉందంటే అక్కడ పోరాటం ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోండీ.

చనిపోయిన అయిదుగురు తీవ్రవాదులు వద్ద దొరికిన ఆయుధాలు చూస్తే వాళ్ళు లాక్ డౌన్ లో ఉన్న కాశ్మీర్ లో పెద్ద విధ్వంసం సృష్టించడానికే వచ్చారు అని అర్ధం అవుతున్నది.
రాజకీయనాయకులని ఒకసారి తీసుకెళ్లి అక్కడ వదిలేసి రావాలి అరగంటలో చచ్చిపోతారు .
మనం ప్రశాంతంగా ఉంటున్నాము అంటే సరిహద్దుల్లో సైన్యం ఉండడం వలనే అని మరువొద్దు..
అమరులకు జోహార్లు..

జైహింద్ ! జై భారత్

Exit mobile version