ఓ మనిషి ఓ మనిషి
ఏమయ్యాయి నీ డబ్బులు
ఏమయ్యాయి నీ బంగళాలు
ఏమయ్యాయి నీ కార్లు
ఏమయ్యాయి నీ బంగారు ఆభరణాలు
ఏమైనది నీవు సంపాదించిన లంచగొండిసొమ్ము
●●ఏ కారులో వెళ్లగలవు బయటికి నేడు
●●ఏ విమానంలో బయటకు వెళ్లగలవు నేడు
●●ఏ షిప్లో బయటకు వెళ్లగలవు నేడు
●●ఎవడు తాకుతాడు నిన్ను ఈరోజు
◆◆ఏమవుతుంది నీవు కూడబెట్టిన వేల ఎకరాల భూమి
◆◆రోడ్డుకు ఇరువైపులా పచ్చని పొలాలు మాయం చేస్తివి
◆◆పేదోడు వంద గజాల భూమి కొనుక్కునే పరిస్థితి చేజారిస్తివి
◆◆పచ్చదనం కాలరాస్తివి పైసలకు కకృతు పడితివి
◆◆ఏమవుతాయి నీ వందల ఎకరాల నేడు
■■అంతరాలు పెంచితివి
■■ఆత్మీయత తుంచితివి
■■డబ్బే సర్వస్వం అనుకుంటివి
■■డబ్బులిచ్చి ఆపగలవా కరోనాను…
■■భూములిచ్చి ఆపగలవా కారోనాను….
■■లంచమిచ్చి ఆపగలవా కారోనాను…..
■■మనిషిని మనిషిగా చూడవైతివి….
■■నేడు నిన్ను కాపాడడానికి మళ్లీ మనిషే (డాక్టరు) కావాలి.
★★డబ్బులున్నోడికి ఓ మర్యాద
★★డబ్బులు లెనోడికి ఓ మర్యాద
★★నడిచొస్తే ఓ మర్యాద
★★కార్లోవస్తే మరొక మర్యాద
★★గోచి పెడితే ఒక మర్యాద
★★సూటు వేస్తే మరొక మర్యాద
★★నీవ్వు పోయినపుడు నీ వెంట ఏది రాదు అని తెలుసుకో
★★మానవా ఇకనైనా నీ బుద్ది మార్చుకో అందరినీ కలుపుకో